21, ఫిబ్రవరి 2022, సోమవారం

TCS Jobs: బీటెక్‌ చేసిన వారికి బంపరాఫర్‌.. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

TCS Jobs: ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలకోసం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* టీసీఎస్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డిజిటల్‌ హైరింగ్‌ ప్రకటన జారీ చేసింది.

* టీసీఎస్‌ భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. 2019/2020/2021లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే ఐటీ రంగంలో కనీసం 6 నుంచి 12 నెలల అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం అభ్యర్థులు టీసీఎస్‌ కెరీర్ పోర్టల్ లోకి వెళ్లి..  రిజిస్టర్‌ నౌ క్లిక్‌ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లి. వివరాలు నమోదు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిబ్రవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తేదీని ప్రకటిస్తారు.

* రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తివివరాలు, సందేహాల కోసం ilp.support@tcs.com మెయిల్‌, లేదా 1800 209 3111 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి.

 

Gemini Internet

కామెంట్‌లు లేవు: