28, మే 2022, శనివారం

గీతం ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల✍️📚 మే 31 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌



🌻విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌, ఫార్మశీ, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల (గ్యాట్‌-2022) ఫలితాలను గీతం ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాట్‌ ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌లో మే 31వ తేదీ నుంచి తొలి విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాదికి ప్రోత్సాహకాలుగా రూ.30 కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో 3,920 మంది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. వైద్య రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి కొత్తగా బీఎ్‌ససీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ, ఎమెర్జన్సీ మెడిసిన్‌ కోర్సులను ప్రారంభించామని వెల్లడించారు. ఈ సమావేశంలో గీతం ప్రొ-వైస్‌ ఛాన్సలర్‌ జయశంకర వారియర్‌, రిజిస్ట్రార్‌ గుణశేఖరన్‌, అడ్మిషన్ల డైరెక్టర్‌ శేఖర్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.
Gemini Internet

కామెంట్‌లు లేవు: