Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు
India Post Gramin Dak Sevak Recruitment 2022: ఖాళీల వివరాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2,942 పోస్టులున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 పోస్టులున్నాయి. రెండేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఆ తర్వాత మరో ఏడాది గడువు పొడిగించవచ్చు.
ఇండియా
పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. ఆసక్తి గల
అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. జూన్‌లో ఎగ్జామ్
ఉంటుంది. అదే నెలలో ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 650 |
ఆంధ్రప్రదేశ్ | 34 |
తెలంగాణ | 21 |
అస్సాం | 25 |
బీహార్ | 76 |
చత్తీస్‌గఢ్ | 20 |
ఢిల్లీ | 4 |
గుజరాత్ | 31 |
హర్యానా | 12 |
హిమాచల్ ప్రదేశ్ | 9 |
జమ్మూ అండ్ కాశ్మీర్ | 5 |
జార్ఖండ్ | 8 |
కర్నాటక | 42 |
కేరళ | 7 |
మధ్యప్రదేశ్ | 32 |
మహారాష్ట్ర | 71 |
ఒడిషా | 20 |
పంజాబ్ | 18 |
రాజస్తాన్ | 35 |
తమిళనాడు | 45 |
ఉత్తరప్రదేశ్ | 84 |
ఉత్తరాఖండ్ | 3 |
పశ్చిమ బెంగాల్ | 33 |
ఈశాన్య రాష్ట్రాలు | 15 |
India Post Gramin Dak Sevak Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2022 మే 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మే 20
అడ్మిట్ కార్డుల విడుదల- 2022 మే 27 తర్వాత
ఎగ్జామ్- 2022 జూన్
ఫలితాల విడుదల- 2022 జూన్
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Gemini Internet
కామెంట్‌లు