*సమగ్ర శిక్షా - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *అన్ని కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం* *-27వ తేదీ నుంచి జూలై 12 వరకూ ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ.*
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కె.వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత విద్యా సంవత్సరం వరకు రాష్ట్రంలోని 221 కేజీబీవీల్లో మాత్రమే ఇంటర్మీడియెట్ విద్య అందించగా, ఈ విద్యా సంవత్సరం నుంచి మిగిలిన 131 కేజీబీవీల్లో కూడా ఇంటర్మీడియెట్ విద్య అప్ గ్రేడ్ చేశామన్నారు.
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలు, పేద ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామని అన్నారు. ఆసక్తిగల బాలికలు (ఈ నెల 27వ తేదీ) నేటి నుంచి జూలై 12 వరకు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ నందు దరఖాస్తులు పొందగలరని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. దీంతోపాటు సంబంధిత కేజీబీవీల నోటీసు బోర్డులో నేరుగా చూడవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 94943 83617, 94907 82111 నంబర్లను సంప్రదించాలని ఎస్పీడీ శ్రీమతి కె.వెట్రిసెల్వి కోరారు. అప్లికేషన్ ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపూర్ 9640006015
Gemini Internet
కామెంట్‌లు