BEd @ IIT : ఐఐటీల్లో బీఈడీ కోర్సు .. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ అనుమతి .. ! కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్*
భువనేశ్వర్ : దేశంలో ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు . ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన .. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ ) ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు . ఇందుకోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ( ITEP ) త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు .
రాష్ట్రాలు , దేశంలో చాలా బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు . మనం ఆశించిన ఉపాధ్యాయులను తీర్చుదిద్దుకోలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది . ఒకవేళ మంచి ఉపాధ్యాయులు లేకపోతే .. నాణ్యమైన విద్యను ఆశించలేం . దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న తరం ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు . అందుకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్న ( ITEP ) పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం ' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు
భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ' ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్'ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు . దేశవ్యాప్తంగా మొత్తం 15 వేల పీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభిస్తామని .. కేవలం ఒడిశాలోనే 500 నుంచి 600 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు . అయితే , అన్నీ కొత్త పాఠశాలలే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రీయ పాఠశాలలను వీటి పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు . ఇక నాలుగేళ్ల బీఈడీ కోర్సును అందించేందుకుగాను ఐఐటీ భువనేశ్వర్తోపాటు పలు ఐఐటీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచరం . కేంద్ర విద్యాశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కోర్సును ప్రారంభిస్తాయి . ఈ ఏడాది నుంచే ఐఐటీ భువనేశ్వర్ నాలుగేళ్ల బీఈడీని మొదలు పెట్టేందు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది .
Gemini Internet
కామెంట్‌లు