e-Filling - Refund గురించి కొన్ని ప్రశ్నలు - సమాదానాలు
1. Form 16 ద్వారా చెల్లించిన టాక్స్ efilling ద్వారా తిరిగి రిఫండ్ రూపంలో వచ్చే విధంగా చేస్తాము మాకు 10 నుంచి 20% మొత్తం మీ అకౌంట్లో పడిన తర్వాత ఇవ్వండి అని కొంతమంది ఆడిటర్స్ అడగటం దానిని నమ్మి కొంతమంది చేయించుకొని 10 నుంచి 20% చేసినందుకు ఇవ్వడం జరుగుతున్నట్లు గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పుడుంనుండి గత రెండు సంవత్సరాలుగా చేయించుకున్నవారు Mouth Publicity విస్తృతంగా చేస్తున్నారు ఒక్క సారి ఆలోచించండి అన్ని రకాలుగా లెక్కలు కట్టి టాక్స్ కట్టినతర్వాత ఆ మొత్తం ఎలా తిరిగివస్తుంది? దీనిలో తిరకాసు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దాం!!!! 1. Net Taxable Income అనగా అన్నిరకాల deductions పోను వచ్చిన మొత్తం 5 లక్ష ల పైన ఉంటే దానికి టాక్స్ పడుతుంది ఈ 5 లక్షల పైన ఉన్న మొత్తాన్ని మీకు housing లోన్ లేకపోయినా ఉన్నట్లు చూపించి,Education లోన్ లేకపోయినా ఉన్నట్లు చూపించి,డోనేషన్స్ ఇవ్వకపోయినా ఇచ్చినట్లు చూపించి,Dependents కి PH, MR గా మొదలైన రక రకాల ప్రభుత్వం కల్పించిన తగ్గింపులు దొడ్డిదారిలో చూపించి మీ Net taxable Income 5 లక్షల కన్నా తగ్గించి మీరు కట్టిన మొత్తం రిఫండ్ రూపంలో మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ పెడుతున్నారు.
2. ఈ పని ఆడిటర్ చెస్త్తున్నాడు కావున ఆ forms మీద ఆడిటర్ సంతకం ఉంటుంది కావున ఉద్యోగికి ఇబ్బంది లేదు అని కొంతమంది వాదన, అంతే కాకుండా ఏదైనా వస్తే ఆడిటర్ చూసుకుంటాడు అని భ్రమ పడుతున్నారు ఇవ్వని అపోహలు మాత్రమే. ఈ దొడ్డిదారి తిరిగి పొందిన మొత్తం వ్యవహారాలన్నీ వ్యక్తి భాద్యతే.
3. ఇలాంటి మోసాలకు ఆడిటర్ కి ఎటువంటి సంబంధం ఉండదు.
4.ఏదైనా నష్టం జరిగితే వ్యక్తి చెప్పిన వివారాలను బట్టి నేను fiile చేసాను ఈ వ్యక్తి ప్రభుత్వాన్ని మోసాగించడమే కాకుండా నా ప్రతిష్టకు కూడా భంగం కలిగించాడు కావున తగిన చర్యలు తీసుకోమని సిపార్సు కూడా చేస్తాడు.
5. కావున భ్రమలు తొలిగించుకొని తెలివిగా వ్యవహరీంచడం ఉత్తమం.
6. గత రెండు సంవత్సరాలుగా 5% వరకు సుమారుగా ఇలాంటివి జరుగుతుండగా ఇప్పుడు ఉచితంగా 10 నుంచి 20% వచ్చిన లబ్దికి ఆశ పడి మీ టాక్స్ మొత్త0 తిరిగి తెప్పిస్తామని మీ సహచర ఉద్యోగులతో ప్రచారం చేయిస్తున్నారు జాగ్రత్త. ఇది కూడా సైబర్ మోసాలు మాదిరిగా మోసం లాంటిదే. ఈ సంఖ్య ఈ సంవత్సరం ఇబ్బిడిముబ్బిడిగా పెరుగుతున్న ట్లు అందులో మన సంఖ్య ఎక్కువ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది గుర్తించుకోండి ఇటువంటి వాటికి ఉద్యోగి మాత్రమే బాద్యుడు ఆడిటర్ కాదు.
Gemini Internet
కామెంట్‌లు