13, నవంబర్ 2022, ఆదివారం

16న అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ స్పాట్ అడ్మిషన్లు

మధురానగర్(విజయవాడ సెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న బీఈడీ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీన స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు యూనివర్సిటీ సహాయ సేవా కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 500 సీట్లకు రెండు విడతలు కౌన్సెలింగ్ నిర్వహించగా, 53 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఉన్న యూనివర్సిటీ అకడమిక్ బ్లాక్ వద్ద కౌన్సెలింగ్కు ర్యాంక్ కార్డు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మరో ప్రోగ్రాం సెంటర్కు మారాలనుకుంటే (సైడింగ్) నిబంధనలకు లోబడి అనుమతిస్తామని ఆయన తెలిపారు. స్లైడింగ్ కోసం విద్యార్థులు 16వ తేదీన ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య కౌన్సెలింగ్ కేంద్రా నికి రావాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ (www.bsoauac.in) ను సందర్శించాలని తెలిపారు. 

for daily updates join in to our channel https://t.me/GEMINIINTERNETHINDUPUR

కామెంట్‌లు లేవు: