4, జనవరి 2023, బుధవారం

6 వ తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయసమితి (Navodaya Vidyalaya Samiti) దరఖాస్తులనుఆహ్వానిస్తోంది

వచ్చే విద్యా సంవత్సరం (2023-24) లో ఆరో తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి(Navodaya Vidyalaya Samiti) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు తమ అధికారిక వెబ్సైట్లో https://navodaya.gov.in/nvs/en/Homel/ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం సోమవారం నుంచి జనవరి 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎంపిక పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్
విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్కు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరిని తెలిపింది. దీంతో పాటు అభ్యర్థి ఫోటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.| ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగాజవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. అలాగే, అడ్మిషన్ పొందాలనుకుంటున్న జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్/గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23
విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలని నవోదయ విద్యాలయ సమితి తెలిపింది. దీంతో పాటు అభ్యర్థి మే 1, 2011 నుంచి ఏప్రిల్ 30, 2013 మధ్య జన్మించి ఉండాలని నిబంధన విధించింది.

నవోదయ ప్రవేశాలకు కొత్త ని‘బంధనాలు’✍️📚

*♦️. వయో పరిమితి కుదింపు*

*♦️. ఆధార్‌ ‘చిరునామా’ ప్రాతిపదికపై ఆందోళన*

*🌻. హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే:* జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 29న నిర్వహించాలని నిర్ణయించి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. ఏ జిల్లాలోని నవోదయలో విద్యార్థులు ప్రవేశం కోరుకుంటున్నారో, ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారు అయిదో తరగతి అదే జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితే ఇంతకుముందు వరకు సరిపోయేది. తాజా నిబంధనల ప్రకారం చదువుతున్న పాఠశాలతో పాటు, విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల చిరునామా కూడా అదే జిల్లాలో ఉండాలి. లేకుంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా బాపులపాడులో నివసిస్తూ, సరిహద్దునే ఉన్న ఏలూరు జిల్లా ఏపూరు గ్రామంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన ఆధార్‌ చిరునామా ప్రకారం ఏలూరు జిల్లా నవోదయకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. అదే సమయంలో కృష్ణా జిల్లా నవోదయకు దరఖాస్తు చేసుకుందామంటే చదివే పాఠశాల ఏలూరు జిల్లా పరిధిలోది కావడంతో ఇక్కడా అర్హత లభించదు. 2022-23 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరేందుకు 2009, మే ఒకటి నుంచి 2013, ఏప్రిల్‌ 30 మధ్య జన్మించిన వారు అర్హులుగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 2011, మే ఒకటి నుంచి 2013, ఏప్రిల్‌ 30 మధ్యన జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. గతేడాది నాలుగు సంవత్సరాల వీలు(గ్యాప్‌) కల్పించగా, ఈసారి దానిని రెండేళ్లకు కుదించేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

కామెంట్‌లు లేవు: