28, జనవరి 2023, శనివారం

B.Ed.,కౌన్సెలింగ్‌ గడువును 31 వరకు పొడిగించండి, కోర్టుకొచ్చిన కాలేజీలను కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చండి ఉన్నత విద్యామండలికి హైకోర్టు ఆదేశం

బీఈడీ మొదటి విడత కౌన్సెలింగ్‌ గడువు తేదీని ఈ నెల 81వ తేదీ వరకు పొడిగించాలని ఉన్నత విద్యామండలిని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ కాలేజీలను కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మథరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తమ కాలేజీలను కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ పలు బీఈడీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. అలాగే ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారని, ఈ తేదీని పొడిగిం చేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు విద్యార్థులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ మన్మథరావు విచారించారు. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌, మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపిస్తూ... జీరో అడ్మిన్‌ పేరుతో తమ కళాశాలలను ఏకపక్షంగా కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగించారన్నారు. కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈ నెల జీన తెలియచేసి, 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించారని తెలిపారు. తమ కాలేజీలు కౌన్సెలింగ్‌కు అర్హమైనవేనంటూ ప్రభుత్వం ధ్రువపత్రాలిచ్చినా ఉన్నత విద్యామండలి అధికారులు ఏకపక్షంగా కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగించారని వివరించారు. ఉన్నత విద్యాశాఖ తరపున సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆయా కాలేజీల్లో పలు లోపాలున్నాయని చెప్పారు. అందువల్లే నిబంధనల మేరకు ఆ కాలేజీలను కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగించామన్నారు. విద్యార్ధులు ఈ కాలేజీల్లో చేరితే నష్టపోవాల్సి ఉంటుందని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టును ఆశ్రయించిన కాలేజీలను కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. అలాగే మొదటి విడత కౌన్సెలింగ్‌ తేదీని ఈ నెల 81వ తేదీ వరకుపొడిగించాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

------------------------------------------------------------------------For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురంEPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: