30, జనవరి 2023, సోమవారం

నేటి నుంచి ఇంటర్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు | అనంతపురం

ఇంటర్మీడియట్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు సోమవారం నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఐఓ సురేష్‌బాబు తెలిపారు. ఫస్టియర్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం ఉదయం ఫస్టియర్‌ విద్యార్ధులకు సెకండ్‌ లాంగ్వేజ్‌-1, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం సెకండ్‌ లాంగ్వేజ్‌-2 పరీక్షలు ఉటటాయన్నారు.
31న ఉదయం ఇంగ్లిష్‌-1,
మధ్యాహ్నం ఇంగ్లిష్‌-2,
ఫిబ్రవరి 1న ఉదయం మేథమేటిక్స్‌-1ఏ, బోటనీ-1, సివిక్స్‌-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-1, మధ్యాహ్నం మేథమేటిక్స్‌-2ఏ, బోటనీ-2, సివిక్స్‌-2, ఒకేషనల్‌ సబ్జెక్టు -1,
రెండో తేదీన ఉదయం మేథమేటిక్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-2, మధ్యాహ్నం మేథమేటిక్స్‌ -2 బీ, జువాలజీ- 2, హిస్టరీ- 2, ఒకేషనల్‌ సబ్జెక్టు -2,
మూడో తేదీన ఉదయం ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-3,
మధ్యాహ్నం ఫిజిక్స్‌-2, ఎకనామిక్స్‌-2, ఒకేషనల్‌ సబ్జెక్టు -8,
నాలుగో తేదీన ఉదయం కెమిస్ట్రీ-1, కామర్స్‌-1, మధ్యాహ్నం కెమిస్టీ-2, కామర్స్‌-2, ఏడో తేదీన ఉదయం మోడర్న్‌ లాంగ్వేజ్‌-1, మధ్యాహ్నం మోడర్న్‌ లాంగ్వేజ్‌-2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు.


కామెంట్‌లు లేవు: