6, ఫిబ్రవరి 2023, సోమవారం

AP Constables Update ఐదోవంతే పాస్‌✍️📚 ♦️. కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 20.73% మందికే అర్హత ♦️. 4,59,182 మంది పరీక్ష రాస్తే ఉత్తీర్ణులైంది 95,209 మందే ♦️. ఒక్కో పోస్టుకు 15 మంది ♦️.వారికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు ♦️.ఫలితాలను విడుదల చేసిన పోలీసు నియామక మండలి

రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గత నెల 22న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) రాసిన 4,59,182 మంది అభ్యర్థుల్లో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పోలీసు నియామక మండలి ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. వీరు స్టేజ్‌-2 పరీక్షల కోసం ఈ నెల 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని తెలిపింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది,  95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు.

♦️3 ప్రశ్నలకు సమాధానాల మార్పు
సమాధానాల ‘కీ’కి సంబంధించి మొత్తం 2,261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో  మూడు ప్రశ్నల సమాధానాలను ‘కీ’లో మార్చినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. సందేహాలు ఉంటే 94414 50639, 91002 03323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

♦️కటాఫ్‌ మార్కులు తగ్గించాలి
▪️- ఏపీ నిరుద్యోగ ఐకాస

కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఎట్టకేలకు ఒక నోటిఫికేషన్‌ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం కటాఫ్‌ మార్కులు ఎక్కువగా పెట్టటంతో రాత పరీక్షలో లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్దిఖీ ఆరోపించారు. తక్షణమే కటాఫ్‌ మార్కులను తగ్గించాలని డిమాండు చేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: