పేదపిల్లలకు ప్రైవేట్ స్కూల్ నందు ఉచిత అడ్మిషన్ నోటిఫికేషన్ -2023ప్రధానంగా వివరించిన ముఖ్యాంశాలు1) పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ నందు ఉచిత అడ్మిషన్లు కి సంబంధించిన నోటిఫికేషన్2) విద్యా హక్కు చట్టం కి సంబంధించిన3) ప్రైవేట్ స్కూల్ లో ఉచిత విద్యకి కావాల్సిన అర్హతలు4) రిజిస్ట్రేషన్ ప్రాసెస్
5) Toll Free Number
ఈ ప్రైవేట్ స్కూల్ లలో 25% సీట్లు ఉచితంగా ఇచ్చి, వాటితో పాటు ఉచిత విద్య ని అందిచాలని రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన విద్యా హక్కు చట్టం - 2009 గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట సారిగా విద్యా హక్కు చట్టం - 2009 ని సమగ్రంగా అమలు చేయాలని అధికూడా ఈ విద్యా సంవత్సరం కి ప్రైవేట్ స్కూల్ లో 1 వ తరగతి ప్రవేశాలలో నిరుపేదలకు 25% సీట్లను ఇచ్చి ఉచితంగా విద్యను అందించాలని ఆదేశించారు.బహుశా ఇంతవరకు ఎప్పుడూ మన రాష్ట్రం లోనే కాదు ఎక్కడా ఇది అమలు అయినట్టు మనం వినలేదు. మొట్ట మొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ మరియు ఆన్-ఎయిడెడ్ స్కూల్ లలో 25% సీట్లు ఇచ్చి ఉచిత విద్య అందించనున్నారు.
A) వికలాంగులు, అనాథ బాలలు, HIV బాధితులు మరియు వీధి బాలలకు 5% ఉచిత సీట్లు
B) SC బాలలకు - 10%
C) ST బాలలకు - 4%
D) BC, OC కులాలకు చెందిన బాలలకు 6%
ఇలా మొత్తానికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అన్నీ గుర్తింపు ఉన్న స్కూల్స్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
గమనిక: ఈ 25% ఉచిత సీట్లు అనేది 1 వ తరగతి ప్రవేశాలకు మాత్రమే వర్తిస్తుంది. మరియు అడ్మిషన్ పొందే నాటికి ఆ విద్యార్థి వయస్సు 5 సంవత్సరాలు పూర్తి అయి 6 వ సంవత్సరం కి వచ్చి ఉండాలి.
దీనికి ఎలా ఎంపిక చేస్తారు ?
ప్రభుత్వం దీనికి సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని వెరిఫై చేశాక లాటరీ పద్ధతి లో ఎంపిక చేయాలని కొన్ని ముఖ్య తేదీలను కూడ విడుదల చేశారు.
నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ - 04-03-2023
రిజిస్ట్రేషన్ మొదలు - 18-03-2023
రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ - 07-04-2023
మొదటి లాటరీ తీయుట-13-04-2023
అర్హత జాబితా విడుదల - 15-04-2023 To 21-04-2023
రెండవ లాటరీ తీయుట- 25-04-2023
అర్హత జాబితా విడుదల - 26-04-2023 To 30-04-2023
ఈ ఉచిత అడ్మిషన్లు కొరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ క్రింది నంబరు కి కాల్ చేయగలరు.
Cal: 14417
అర్హతలు:
ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రైవేట్ స్కూల్ నందు 1 వ తరగతిలో పేదవాళ్ళు ఉచిత విద్య పొందాలంటే దానికి అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతం వాళ్ళు అయితే కుటుంబ ఆదాయం సంవత్సరం కి 1,20,000 మించరాదు.
పట్టణ ప్రాంత వాళ్ళు అయితే వారి కుటుంబ ఆదాయం సంవత్సరం కి 1,44,000 కంటే మించరాదు.
మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే పై అర్హతలని బట్టి చూస్తే రైస్ కార్డ్ ఉంటే ఇందులో ఉచిత అడ్మిషన్లు లభించినట్టే.
ఆన్లైన్ లో దరఖాస్తు చేయు విధానము...
దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చింది.దానిపై క్లిక్ చేయండి.లింక్ పై క్లిక్ చేశాక లాగిన్, పాస్స్వర్డ్ అడుగుతుంది. అది మనకు ఉండదు.మనం ఇప్పుడు కొతగా క్రెయేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి https://cse.ap.gov.in/RTE/ లింక్ పై క్లిక్ చేసి మీ అబ్బాయి/అమ్మాయి యొక్క ఆధార్ లేదా తల్లిదండ్రులు యొక్క ఆధార్ తో అయినా అక్కడ అడిగిన వివరాలను ఇచ్చి రిజిస్టర్ చేయించుకుంటే మీరు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి లాగిన్ & పాస్ వర్డ్ వస్తుంది.
మీకు లాగిన్ పాస్ వర్డ్ వచ్చాక మీకు కావాలంటే పాస్ వర్డ్ ని మళ్లీ కూడా మార్చుకోవచ్చును. ఇక ఇక్కడి నుండి మీ సచివాలయ పరిధిలో 1 నుండి 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు ఆన్-ఎయిడెడ్ స్కూల్స్ వివరాలను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.
కామెంట్‌లు