AP MODEL SCHOOLS ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2023-2024 విద్యా సంవత్సరమునకు'6 ' వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2023-2024 విద్యా సంవత్సరమునకు'6 ' వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 11.06.2023 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 11.06.2023 న ఉ. 10-00 గం.ల నుండి ఉ.12-00 గం.ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
ప్రవేశ అర్హతలు:
1) వయస్సు: ఒ.సి, బి.సి. (OC,BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011 - 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి.
యస్.సి.,యస్.టి. (SC,ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2009 - 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి.
2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలోనిరవధికంగా 2021-22 మరియు 2022-23 విద్యా సంవత్సరములు ఉండాలి. 2022-23 చదివి విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది, ఉండాలి.
3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన www.cse.ap.gov.in / apms.ap.gov.in చూడగలరు.
దరఖాస్తు చేయు విధానము: అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది  09.05.2023 నుండి 25.05.2023 వరకు net banking/ credit/debit card ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్
నెంబరు ఆధారముగా జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం 9640006015 ఇంటర్ నెట్ కేంద్రములోwww.cse.ap.gov.in / apms.ap.gov.in (Online లో దరఖాస్తు చేసుకొనవలయును.
4) పరీక్షా రుసుము: OC మరియు BC లకు: రూ.150/- (అక్షరాల 150/-రూపాయలు మాత్రమే)SC మరియు ST లకు రూ.75/- (అక్షరాల 75/- రూ.మాత్రమే) అప్లికేషన్ ఆన్ లైన్ ద్వారా ఫిలఫ్ చేయడానికి Gemini Internet వారు కేవలం రూ.100/- మాత్రమే తీసుకుంటారు.
5) 6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షలో OC మరియు BC విద్యా మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందియుండవలెను.
6) ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
7) ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము Objective Type లో వుండును. ఇతరవివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.పాఠశాల విద్యా కమీషనరు, ఆం.ప్ర. ఆదర్శ పాఠశాలలు, ఇబ్రహీంపట్నం, అమరావతి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.