5, జులై 2023, బుధవారం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశాల సందడి మొదలవుతుంది. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. ఏ కాలేజీలో చేరాలి? ఏం బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి? మరోవైపు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఆకర్షణీయ ప్రకటనలు. ఫలానా బ్రాంచ్‌లో చేరితేనే ఉద్యోగాలు లభిస్తాయనే విశ్లేషణలు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం...

కొంతకాలం క్రితం వరకూ దేశంలో ఇంజనీరింగ్ క్రేజీ కోర్సు. ఈ కోర్సుకు ఏర్పడిన డిమాండ్‌కు తగ్గట్టుగానే కుప్పలుతెప్పలుగా కాలేజీలు ఏర్పాటయ్యాయి. వాటిలో లక్షల సంఖ్యలో సీట్లు. ఐటీ బూమ్ కొనసాగినంత కాలం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, భారీ జీతాలు, ఎంఎన్‌సీ జాబ్స్, విదేశీ కొలువులతో ఇంజనీరింగ్ విద్యార్థుల పంటపడింది. కానీ, కొంతకాలంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, కొత్త కొలువులకు సంబంధించి ఆశాజనక పరిస్థితులు లేకపోవడం వల్ల జాబ్ మార్కెట్ పరిస్థితి కొంత స్తబ్దుగానే ఉన్నా.. నేటికీ ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఇంజనీరింగ్! నేటి ఏఐ, ఆటోమేషన్, ఐఓటీ వంటి సరికొత్త టెక్నాలజీ యుగంలో... పుట్టుకొచ్చే ఉద్యోగాలు తక్కువ. ఉన్న కొద్ది ఉద్యోగాల కోసం జాబ్ మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితితో సరైన బ్రాంచ్‌ను ఎంచుకున్న విద్యార్థులు భవిష్యత్‌లో మంచి అవకాశాలు అందుకోగలరు. కాబట్టి త్వరలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు.. బ్రాంచ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటి ప్రాధాన్యం దేనికి?
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యే విద్యార్థికి ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న... మొదటి ప్రాధాన్యం కాలేజీకా... లేక బ్రాంచ్‌కా..! వాస్తవానికి ఒక విద్యార్థిని ఉన్నతమైన ఇంజనీరింగ్ కెరీర్ దిశగా తీర్చిదిద్దడంలో.. బ్రాంచ్, కాలేజీ రెండూ ముఖ్యమే! నచ్చిన బ్రాంచ్, మెచ్చిన కాలేజీలో సీటు దొరికేది చాలా తక్కువ మందికే! రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే.. బ్రాంచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లు, ప్రొఫెసర్ల అభిప్రాయం. విద్యార్థి మొదట తనకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఆయా బ్రాంచ్‌కు సంబంధించి నాణ్యమైన విద్యను అందించే కాలేజీని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాలేజీ ఎంపికలో ముఖ్యంగా ఆయా బ్రాంచ్‌లకు అక్రిడిటేషన్, గత కొన్నేళ్లుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరిస్థితి, ఆయా బ్రాంచ్‌ల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, సదరు కాలేజీలో చేరుతున్న విద్యార్థుల కటాఫ్ ర్యాంకులు తదితర అంశాలపై దృష్టిసారించాలి. స్వయంగా కాలేజీని సందర్శించి సీనియర్ విద్యార్థులతో మాట్లాడి.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లో బోధన, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ గురించి వాకబు చేయాలి.

ఆసక్తితోనే అందలం..
ఇంజనీరింగ్ సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, ఐటీ, మెటలర్జీ, కెమికల్... ఇలా ఎన్నో బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో తనకు నప్పే బ్రాంచ్‌ను ఎంచుకోవడం విద్యార్థికి అంత తేలిక కాదు. ఇక్కడ తల్లిదండ్రులు, స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఓ విద్యార్థి తండ్రి వృత్తి రీత్యా బిల్డర్. ఆయన తన కుమారుడు సివిల్ ఇంజనీరింగ్‌లో చేరి.. తన బిజినెస్‌లో సహకరించాలని కోరుకుంటాడు. తండ్రి ఒత్తిడి కారణంగా కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో చేరాలని ఉన్నా... ఆ విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్‌నే ఎంచుకోవాల్సిన పరిస్థితి. అలాకాకుండా విద్యార్థి తన ఆసక్తి, సామర్థ్యం, కెరీర్ ప్లానింగ్‌ను దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ కెరీర్లో రాణించాలన్నా... విద్యార్థికి ఆసక్తి, సామర్థ్యం ముఖ్యం. అందుకే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు వెళ్లేముందు విద్యార్థులు తొలుత తాము చేరాలనుకుంటున్న కొన్ని బ్రాంచ్‌ల జాబితా రూపొందించుకోవాలి. ఆయా బ్రాంచ్‌ల్లో చేరితే నాలుగేళ్ల బీటెక్ కోర్సులో భాగంగా అభ్యసించాల్సిన సబ్జెక్టులను పరిశీలించాలి. ఆయా సబ్జెక్టుల్లో తన అభిరుచి ఏంటో తెలుసుకోవాలి.
  • కంప్యూటర్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ/ఐటీ) బ్రాంచ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థి తనకు మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఏమేర ఉందో చూసుకోవాలి. అలాగే పజిల్స్ సాధించడం.. కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం.. తార్కిక ఆలోచన, సహనం వంటి లక్షణాలు ఉండాలి. కంప్యూటర్ రంగంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోవాలనే జిజ్ఞాస, కొత్త ఆవిష్కరణలు చేయాలనే తపన వంటివి ఉన్న విద్యార్థి సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చు.
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ పరికరాలపై ఆసక్తి, మన ఇంట్లో ఉపయోగించే టీవీ వంటి ఎలక్టాన్రిక్స్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత, స్మార్ట్‌ఫోన్‌ల పనితీరు, మైక్రోప్రాసెసర్లు, కంప్యూటర్ సీపీయూ వంటి వాటి పనితీరు గురించి ఆసక్తి ఉండాలి. మ్యాథమెటిక్స్ సమస్యలను సాధించగలిగే సామర్థ్యం, సదరు సబ్జెక్టుపై ఆసక్తి ఉన్న విద్యార్థి ఈసీఈ బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చు.
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్రిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) బ్రాంచ్ కోరుకునే విద్యార్థులు మొదట తమకు ఇంట్లోని స్విచ్‌బోర్డు ఎలా పనిచేస్తుంది.. కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. ఎలక్ట్రిక్ మోటార్‌ల పనితీరు, సెన్సర్లు, జనరేటర్లు, ట్రాన్సిస్టర్ల పనితీరు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి. వాటి లోపల ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అవసరం. వీటితోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈఈఈ బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చు.
  • మెకానికల్... ఇంట్లోని ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి ఆటోమొబైల్ పరికరాల రిపెయిరింగ్, వాటి డిజైన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే... మెకానికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవచ్చు. అలాగే సివిల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకుంటే... పెద్దపెద్ద నిర్మాణాలు, భవంతులు, డ్యామ్‌లు, వంతెనలు ఎక్కువగా ఆసక్తి కలిగిస్తూ, అలాంటి వాటి నిర్మాణాల్లో పాల్గొనాలనే కోరిక ఉంటే.. సివిల్ ఇంజనీరింగ్‌లో చేరొచ్చు.
  • ముఖ్యంగా మ్యాథ్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు సీఎస్‌ఈ/ఐటీను ఎంచుకోవచ్చు. ఫిజిక్స్‌ను ఎక్కువగా ఇష్టపడే విద్యార్థులు ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. కెమిస్ట్రీపై ఆసక్తి ఉంటే... కెమికల్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.
భవిష్యత్ కోణంలో..
 చాలామంది విద్యార్థులు ఎంటెక్ లేదా ఎంబీఏ వంటి ఉన్నత విద్య తమ లక్ష్యంగా ముందే నిర్ణయించుకుంటారు. అలాంటి విద్యార్థులు తాము చేరే బ్రాంచ్‌కు ఉన్నత విద్యావకాశాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. తాము చేరుతున్న బ్రాంచ్‌కు ఎంటెక్‌లో మంచి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయా... ఆయా స్పెషలైజేషన్లను అందించే నాణ్యమైన కాలేజీలు.. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే భవిష్యత్‌లో ఎంబీఏ చేయాలనే ఆలోచన ఉంటే.. దానికి తగ్గ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం మేలు. అన్నింటికంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంచుకునే ముందు విద్యార్థులు.. సాధ్యమైనంత ఎక్కువ మంది సీనియర్లు, ఇప్పటికే సదరు రంగంలో రాణిస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 అవకాశాలు  సృష్టించుకోవాలి..
 నేటి ఆటోమేషన్ యుగంలో ఉన్నత నైపుణ్యాలుంటేనే.. ఉజ్వల అవకాశాలు అందుతారుు. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్ సబ్జెక్టులపై పట్టుసాధిస్తూనే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌‌స, మెషిన్ లెర్నింగ్, ఐవోటీ, బిగ్‌డేటా, డేటాసైన్‌‌స, బ్లాక్‌చైన్ టెక్నాలజీ తదితర అప్‌కమింగ్ టెక్నాలజీపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. దాంతోపాటు ఇంగ్లిష్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి. తద్వారా ఇంజనీరింగ్ కోర్సుతో అద్భుత కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు!!

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: