6, జులై 2023, గురువారం

SSC MTS Jobs with 10th Qualification ‣ ఎంటీఎస్‌, హవల్దార్‌ ఖాళీల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ ‣ ఎంటీఎస్‌, హవల్దార్‌ ఖాళీల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ | కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, హవల్దార్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసుకునే అరుదైన అవకాశమిది. దీన్ని సద్వినియోగం చేసుకునేదెలాగో తెలుసుకుందాం!

‘పది’తో 1558 కేంద్ర కొలువుల భర్తీ 

ఎంటీఎస్‌, హవల్దార్‌ ఖాళీల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌


కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, హవల్దార్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసుకునే అరుదైన అవకాశమిది. దీన్ని సద్వినియోగం చేసుకునేదెలాగో తెలుసుకుందాం! 

https://st.adda247.com/https://www.careerpower.in/blog/wp-content/uploads/2023/06/30170503/ssc-mts-notification-2023.pdf

మల్టీటాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ (గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌ నాన్‌-మినిస్టీరియల్‌) 1198.. హవల్దార్‌ (గ్రూప్‌-సి, నాన్‌ మినిస్టీరియల్‌) 360.. మొత్తం 1558 పోస్టులు ఉన్నాయి. 

దరఖాస్తుదారులు పదో తరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. వయసు 01.08.2023 నాటికి పోస్టును అనుసరించి 18-25, 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. 

జీతభత్యాలు 

హవల్దార్‌ పోస్టుకు లెవెల్‌-1, ఏడో పే కమిషన్‌ ప్రకారం మూలవేతనం రూ.18,000 ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ అన్నీ కలిపి రూ.31,000 వేతనం వరకూ అందుకోవచ్చు. ఎంటీఎస్‌ అభ్యర్థులకు వేతనం రూ.35,000 వరకూ ఉంటుంది. అయితే పనిచేసే ప్రాంతాన్ని బట్టి వేతనంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పెన్షన్‌ స్కీమ్, శాలరీ ఎరియర్స్, ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, వ్యక్తిగత, కుటుంబానికి మెడికల్‌ ఇన్సూరెన్స్‌.. మొదలైన సౌకర్యాలూ ఉంటాయి. 

ఎంపిక

ఎంటీఎస్‌ పోస్టులకు అభ్యర్థులను సెషన్‌-1, 2 కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. హవల్దార్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తోపాటుగా.. తమిళ్, తెలుగు, ఉర్ద్దూ లాంటి 13 ప్రాంతీయ  భాషల్లోనూ నిర్వహిస్తారు. 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష

దీంట్లో 2 సెషన్లు ఉంటాయి. సెషన్‌-1లో న్యూమరికల్‌ అండ్‌ మేథమెటికల్‌ ఎబిలిటీకి 20 ప్రశ్నలు (60 మార్కులు). రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌కు 20 ప్రశ్నలు (60 మార్కులు). వ్యవధి 45 నిమిషాలు. 

సెషన్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు (75 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 25 ప్రశ్నలు (75 మార్కులు). వ్యవధి 45 నిమిషాలు. 

రెండు సెషన్లనూ ఒకేరోజున నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండూ రాయాలి. ఏ ఒక్కటి రాయకపోయినా అనర్హులుగా ప్రకటిస్తారు. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు పూర్తికాగానే సెషన్‌-1 ముగిసి సెషన్‌-2 మొదలవుతుంది. దీన్ని కూడా 45 నిమిషాల్లోనే ముగించాలి. 

సెషన్‌-1లో నెగెటివ్‌ మార్కులు ఉండువుగానీ సెషన్‌-2లో నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు. కాబట్టి తెలియని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించకుండా వదిలివేయడమే మంచిది. 

ఎంటీఎస్‌ పోస్టుకు సెషన్‌-1లో సాధించిన మార్కులను ముందుగా మూల్యాంకనం చేస్తారు. దీంట్లో పాసయితేనే సెషన్‌-2లోని మార్కులను లెక్కిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 30 శాతం, ఓబీఎస్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 25 శాతం, ఇతర కేటగిరీల అభ్యర్థులు 20 శాతం మార్కులు సంపాదించాలి. సెషన్‌-2లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంటీఎస్‌ అభ్యర్థుల షార్ట్‌లిస్టును తయారుచేస్తారు. 

హవల్దార్‌ పోస్టుకు.. అభ్యర్థులు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)కు హాజరుకావాలి. 

పీఈటీ: దీంట్లో భాగంగా 1600 మీటర్ల దూరాన్ని పురుష అభ్యర్థులు 15 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 1 కి.మీ. దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలి. 

పీఎస్‌టీ: పురుష అభ్యర్థులు 157.5 (ఎస్టీ అభ్యర్థులు 152.5 సెం.మీ.) సెం.మీ.ఎత్తు, ఛాతీ 81 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థులు 152 సెం.మీ. ఎత్తు (ఎస్టీ మహిళా అభ్యర్థులు 149.5 సెం.మీ.), బరువు 48 కేజీలు (ఎస్టీ మహిళా  అభ్యర్థులు 46 కేజీలు) ఉండాలి. దేశంలోని ఏ సెంటర్‌లో పీఈటీ/ పీఎస్‌టీలను నిర్వహించినా అభ్యర్థులు అక్కడ హాజరుకావాలి. ఈ టెస్టుల్లో అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సాధించాలి. 

హవల్దార్‌ పోస్టుకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ సెషన్‌-2లో సాధించిన మార్కులు, పీఈటీ/పీఎస్‌టీ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్‌లిస్టును తయారుచేస్తారు. పీఈటీ/పీఎస్‌టీలో అర్హత సాధించనివాళ్లను హవల్దార్‌ పోస్టుకు ఎంపిక చేయరు. 

పరీక్షలో ఏయే అంశాలు? 

న్యూమరికల్‌  మేథమెటికల్‌ ఎబిలిటీ: ఇంటిజర్స్‌ అండ్‌ హోల్‌ నంబర్స్, ఎల్‌సీఎం-హెచ్‌సీఎఫ్, డెసిమల్స్‌-ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్‌ బిట్వీన్‌ నంబర్స్, ఫండమెంటల్‌ అరిథ్‌మెటిక్‌ ఆపరేషన్స్, బాడ్‌మాస్, పర్సంటేజ్, రేషియో- ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్‌ ఇంట్రెస్ట్, ప్రాఫిట్‌ -లాస్, డిస్కాంట్, బేసిక్‌ జామెట్రీ ఫిగర్స్, డిస్టెన్స్‌-టైమ్, లైన్స్‌-యాంగిల్స్, ఇంటర్‌ప్రెటేషన్‌ ఆఫ్‌ సింపుల్‌ గ్రాఫ్స్‌ ఆన్‌ డేటా, స్క్వేర్‌ అండ్‌ స్క్వేర్‌ రూట్స్‌ మొదలైన అంశాలుంటాయి. 

రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌: దీంట్లోని ప్రశ్నలు అభ్యర్థుల అవగాహన సామర్థ్యాన్నీ, తార్కికంగా ఆలోచించే నైపుణ్యాన్నీ పరీక్షించేలా ఉంటాయి. ఆల్ఫా-న్యూమరిక్‌ సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, ఫాలోయింగ్‌ డైరెక్షన్స్, సిమిలారిటీస్‌-డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అండ్‌ ఎనాలిసిస్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ బేస్డ్‌ ఆన్‌ డయాగ్రమ్స్, ఏజ్, కాలిక్యులేషన్స్, క్యాలెండర్‌-క్లాక్‌ మొదలైనవి. 

జనరల్‌ అవేర్‌నెస్‌: హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్‌-కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలో ఉంటుంది. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: దీంట్లోని ప్రశ్నలు అభ్యర్థి ఇంగ్లిష్‌ భాషా ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఒకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్‌ స్ట్రక్చర్, సిననిమ్స్, యాంటనిమ్స్‌ను సరిగా ఉపయోగించడం, పేరాగ్రాఫ్‌ ఇచ్చి ప్రశ్నలకు సమాధానాలు రాయమనడం..  మొదలైనవి ఉంటాయి. 

టైమ్‌ టేబుల్‌ ప్రకారం..

పరీక్షకు హాజరయ్యేలోగా అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనే దాని మీదే  విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏయే అంశాలకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైమ్‌టేబుల్‌ వేసుకోవాలి. దాన్ని కచ్చితంగా అమలుచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టైమ్‌టేబుల్‌ను వాయిదా వేయకుండా ఏరోజు అంశాలను ఆరోజే పూర్తిచేయాలి. 

ఒక్కో సబ్జెక్టుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. సులువుగా అనిపించే చాప్టర్ల మీద తక్కువ సమయాన్నీ, క్లిష్టంగా ఉండే వాటి మీద ఎక్కువ సమయాన్నీ వినియోగించాలి. 

ప్రశ్నపత్రంలో అన్నీ తెలిసినవే ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తిచేయలేకపోవచ్చు. ఇలాంటప్పుడు పాత ప్రశ్నపత్రాల సాధన ఉపయోగపడుతుంది. దీంతో నిర్దిష్ట సమయంలోనే ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయగలుగుతారు.  

హవల్దార్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. కాబట్టి వేగంగా నడవడాన్ని ప్రతిరోజూ సాధన చేయాలి. 

ముఖ్య సమాచారం..

దరఖాస్తుకు చివరి తేదీ: 21.07.2023 

ఎస్‌బీఐ చలాన్‌ ద్వారా ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 24.07.2023

దరఖాస్తు సవరణ తేదీలు: 26.07.2023 - 28.07.2023 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు: సెప్టెంబరు, 2023  

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

 

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: