Vidyalakshmi

విద్యార్థులు చదువుకునేందుకు రుణాలిచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను నడిపిస్తోంది.

బ్యాంకుల చుట్టూ తిర‌గాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేలా దీన్ని రూపొందించారు.

విద్యార్థి ఒకేసారి మూడు ర‌కాలైన ఎడ్యుకేష‌న్ రుణాలకు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌దుపాయం కూడా ఇందులో ఉంది. అతి త‌క్కువ వ‌డ్డీతో ఈ రుణాలు ఇస్తారు.

వీట‌న్నిటి కోసం కేంద్ర విద్య, ఆర్థిక మంత్రిత్వ శాఖ‌లు ‘విద్యా ల‌క్ష్మి’ పేరిట ఒక ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నాయి.

ఇంతకీ విద్యా ల‌క్ష్మి ప‌థ‌కం అంటే ఏమిటి? ఈ పోర్ట‌ల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎడ్యుకేష‌న్ లోన్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలా ? ఏమేం ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది? త‌దిత‌ర వివ‌రాలు పూర్తిగా తెలుసుకుందాం.

ఏమిటీ విద్యా ల‌క్ష్మీ?

విద్యార్థుల‌కు సుల‌భంగా, అతి త‌క్కువ వ‌డ్డీతో ఎలాంటి పూచిక‌త్తులు లేకుండా రుణాలు పొందేలా కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కం ఇది. కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పోర్ట‌ల్‌ను 2015 ఆగ‌స్టు 15న ప్రారంభించింది.

బ్యాంకులు ఎడ్యుకేష‌న్ లోన్లు ఇస్తున్నాయి క‌దా?

ఇస్తున్నాయి. కానీ విద్యా ల‌క్ష్మి ప‌థ‌కానికి, వాటికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది.

ఈ పోర్ట‌ల్‌లో ఒకే చోట 39 బ్యాంకులు విద్యా రుణాలు ఇవ్వ‌డానికి అందుబాటులో ఉంటాయి.

మామూలుగా అయితే ఒక రుణం తీసుకోవ‌డానికి విద్యార్థి, వారి త‌ల్లిదండ్రులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పైగా అక్క‌డ ఒకే బ్యాంకు చుట్టూ తిర‌గాలి.

కానీ ఇక్క‌డ ఎవ‌రి వద్ద‌కు వెళ్ల‌కుండా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ పోర్టల్ ప్ర‌త్యేక‌త ఏమిటి?

ఈ పోర్ట‌ల్ ద్వారా విద్యార్థి ఒకసారి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే చాలు.. ఇది మూడు బ్యాంకుల‌కు, మూడు రకాల విద్యా రుణాలకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లే.

ఎన్ని ర‌కాల రుణాలుంటాయి?

ఇందులో విద్యా రుణాల‌ను మూడు వ‌ర్గాలు విభ‌జించారు

  • రూ.4 ల‌క్ష‌ల లోపు రుణాలు
  • రూ.4 ల‌క్ష‌ల నుంచి రూ.7.5 ల‌క్ష‌ల లోపు
  • రూ.7.5 ల‌క్ష‌ల పైన ఎంతైనా ఉన్న రుణాలు

ఈ మూడు ర‌కాల రుణాల‌కు విద్యార్థి ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న ఒకే ఒక ద‌ర‌ఖాస్తు స‌రిపోతుంది.

వ‌డ్డీ ఎంత ఉంటుంది?

ఈ విద్యా రుణాల‌కు వ‌డ్డీ మిగిలిన బ్యాంకుల‌తో పోల్చితే త‌క్కువ‌నే చెప్పాలి.

స‌హ‌జంగా విద్యా రుణాల‌పై ఏడు శాతం వ‌డ్డీ ఉంటుంది. అంత‌కంటే ఎక్కువ కూడా కొన్ని బ్యాంకులు వ‌సూలు చేస్తున్నాయి.

పూచీక‌త్తు ఇవ్వాలా?

ఈ రుణాల ప్ర‌త్యేకత పూచీక‌త్తు లేకుండా పొందే స‌దుపాయమే. ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థులు ఇక్కడ ఎలాంటి పూచీక‌త్తు లేకుండా (కొల్లేట‌ర‌ల్‌) రుణాలు పొంద‌వ‌చ్చు.

రూ.7.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ త‌ర‌హా పూచీక‌త్తు ర‌హిత రుణాలు పొంద‌డం సాధ్య‌మ‌వుతుంది. 

కుటుంబ ఆదాయం ఎంతుండాలి?

పూచీక‌త్తు ర‌హిత రుణం పొంద‌డానికి విద్యార్థి కుటుంబ ఆదాయం 4.5 ల‌క్ష‌ల‌కు లోపు ఉండాలి. అయితే ఇది ఒక రుణానికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

ఎన్ని ర‌కాల విద్యా రుణాలు అందిస్తారు?

ఈ పోర్ట‌ల్‌లో 70 ర‌కాల విద్యా రుణాలు అందుబాటులో ఉంటాయి. వాటిని ప్ర‌ధానంగా 5 వ‌ర్గాలు విభ‌జించారు.

  • టెక్నికల్ కోర్సెస్ లోన్: టెక్నిక‌ల్ కోర్సులైన‌ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ తదితర రంగాలకు సంబంధించిన కోర్సులు చ‌దివే విద్యార్థుల‌కు ఇచ్చే రుణాలివీ.
  • వొకేషనల్ ప్రోగ్రామ్స్ లోన్: వృత్తి విద్యా సంబంధ‌మైన కోర్సులు చ‌దివే వారికి ఇచ్చే రుణాలివీ.
  • ప్రొఫెషనల్ డిగ్రీస్ లోన్: ప్రొఫెష‌న‌ల్ కోర్సులైన‌ ఎంబీబీఎస్‌, లా, చార్టెడ్ అకౌంటెన్సీ, ఆర్కిటెక్చ‌ర్ త‌దిత‌ర ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దివే వారికి ఇస్తారు.
  • డిగ్రీ ప్రోగ్రామ్స్ లోన్: అండ‌ర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చ‌దివే విద్యార్థుల‌కు ఇచ్చే రుణాలివీ.
  • ఎడ్యుకేషన్ లోన్ ఫర్ స్టడీస్ అబ్రాడ్: విదేశాల్లో ఉన్న‌త విద్య చ‌ద‌వాల‌నుకునే వారికి ఇచ్చే రుణాలు. ఈ రుణాల్లో విద్యార్థుల ట్యూష‌న్ పీజు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌, ర‌వాణ ఖ‌ర్చు త‌దిత‌రాల‌న్నీ క‌వ‌ర్ చేస్తారు.

ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ఏమైనా డ‌బ్బులు చెల్లించాలా?

ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్కడ ఉచితంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పైగా లోన్ ప్రాసెసింగ్ రుసుములు కూడా ఉండ‌వు. పార‌ద‌ర్శ‌కంగా రుణాల మంజూరు ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ఏ ప‌త్రాలు స‌మ‌ర్పించాలి?

  • విద్యార్హ‌త‌ల ధ్రువ‌ప‌త్రాలు
  • చివ‌రి సారిగా విద్యార్థి చ‌దివిన కోర్సుకు సంబంధించి ఉత్తీర్ణ‌త స‌ర్టిఫికేట్‌
  • కొత్త‌గా తాను చ‌ద‌వ‌బోయే కోర్సుకు సంబంధించి అడ్మిష‌న్ ధ్రువ‌ప‌త్రాలు
  • కుటుంబ ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • ఇంకా ఏవైనా బ్యాంకులు అడిగితే ఆ ప‌త్రాలు

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ముందు విద్యార్థి విద్యా ల‌క్ష్మి వెబ్‌సైట్‌కు వెళ్లాలి. విద్యా ల‌క్ష్మీ వెబ్ లింక్ ఇది. https://www.vidyalakshmi.co.in/Students/index#studentlogin

ఇందులో విద్యార్థి ముందుగా త‌న‌కు ఒక ప్ర‌త్యేక‌మైన లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవాలి. త‌రువాత సీఈఎల్ఏఎఫ్ పూర్తి చేయాలి.

సీఈఎల్ఏఎఫ్ అంటే ఏమిటీ?

సీఈఎల్ఏఎఫ్ అంటే కామ‌న్ ఎడ్యుకేష‌న్ లోన్ అప్లికేష‌న్ ఫాం. అంటే అన్ని ర‌కాల విద్యా రుణాల‌కు ఒక‌టే ద‌ర‌ఖాస్తు.

ఒకేసారి విద్యార్థి ఈ పోర్ట‌ల్ ద్వారా 3 బ్యాంకుల‌కు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వీట‌న్నిటికీ ఈ కామ‌న్ ఎడ్యుకేష‌న్ లోన్ అప్లికేష‌న్ ఫాం ఒక్క‌టే స‌రిపోతుంది.

రుణం వ‌స్తుందా రాదా అని ఎలా తెలుస్తుంది?

మీరు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌గానే ఏ రుణాల‌కు అర్హులవుతారో ఇందులో ఆటోమేటిగ్గా తెలుసుకోవ‌చ్చు.

అలాగే ఆ రుణాలు ఏఏ బ్యాంకులు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. 

ఆన్‌లైన్‌లోనే సంప్ర‌దింపులు జరపొచ్చా?

మీకు న‌చ్చిన, అర్హ‌త ఉన్న రుణం పొంద‌డానికి ఆయా బ్యాంకుల‌ను మీరు ఆన్‌లైన్‌లో ఈ పోర్ట‌ల్ ద్వారానే స‌ప్రందించ‌వ‌చ్చు.

ప‌త్రాల‌న్నీ కూడా ఆన్‌లైన్‌లనే స‌మ‌ర్పించాలా?

అవును. మీరు పొందాల‌నుకున్న రుణానికి సంబంధించి ప‌త్రాల‌న్నీ కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

15 రోజుల్లో తెలిసిపోతుందా?

అవును. మీకు విద్యా రుణం వ‌స్తుందా రాదా? త‌దిత‌రాల‌న్నీ కూడా 15 రోజుల్లోనే తెలిసిపోతుంది.

అలా తెలియని ప‌క్షంలో 20 రోజుల వ‌ర‌కు వేచి ఉండి, ఆ త‌రువాత ఈ పోర్ట‌ల్‌కు ఫిర్యాదు కూడా చేయొచ్చు. 

పోర్ట‌ల్‌ను ఎలా సంప్ర‌దించాలి?

Tel - 020-2567 8300

ఈమెయిల్‌: vidyalakshmi@proteantech.in

పనిచేసే సమయం- సోమవారం నుంచి శనివారం వరకూ - ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:00 వరకూ..

ముంబయి హెడ్ ఆఫీస్

చిరునామా – టైమ్స్ టవర్, ఒకటో అంతస్తు, కమల మిల్స్ కాంపౌండ్, లోవర్ పరేల్, ముంబయి - 400 013.

ఫ్యాక్స్ - (022) 2491 5217

పనిచేసే సమయం- సోమవారం నుంచి శనివారం వరకూ - ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:00 వరకూ..

దిల్లీ

చిరునామా : 409/410, అశోక ఎస్టేట్ బిల్డింగ్, నాలుగో అంతస్తు, బారాఖంబా రోడ్, కనాట్ ప్లేస్, దిల్లీ - 110 001.

ఫోన్ - (011) 2370 5418 / 2335 3817

 

 

 

 

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.