17, సెప్టెంబర్ 2023, ఆదివారం

Postal Scholarship: విద్యార్థులకు ‘తపాలా’ ఉపకారం * ఎంపికైతే ఏటా రూ.6 వేల స్కాలర్‌షిప్‌ * దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పేరుతో పోటీలు * 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు అవకాశం

Postal Scholarship: విద్యార్థులకు ‘తపాలా’ ఉపకారం

* ఎంపికైతే ఏటా రూ.6 వేల స్కాలర్‌షిప్‌

* దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పేరుతో పోటీలు

* 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు అవకాశం
 


నేటితరం విద్యార్థుల్లో సృజనాత్మకత, జిజ్ఞాసను పెంపొందించేందుకు తపాలాశాఖ దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పేరుతో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. చరిత్ర, క్రీడలు, విజ్ఞానం, సమకాలీన అంశాలు, సంప్రదాయాలు వంటి పలు అంశాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నది దీని ఉద్దేశం. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (ఫిలాటలీ) వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఏటా ఈ పోటీలను నిర్వహిస్తోంది. 


ఎంపిక ప్రక్రియ
రెండు దశల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విజయవాడ, హైదరాబాద్‌లోని తపాలాశాఖ సర్కిల్‌ కార్యాలయం అధికారులు ఎంపిక చేస్తారు. ఒక్కో తరగతి నుంచి పది మంది విద్యార్థులు చొప్పున మొత్తం 40 మందిని ఎంపిక చేస్తారు. వారికి ప్రతినెలా రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేల ఉపకార వేతనం అందిస్తారు. ఈ సాయం పొందేందుకు విద్యార్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేరుతో తపాలాశాఖలో జాయింట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ను తెరవాల్సి ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి విద్యార్థి ఖాతాలో తపాలాశాఖ ఉపకార వేతనం మొత్తాన్ని జమ చేస్తుంది.
దరఖాస్తు ఎలా..?

6 నుంచి 9వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైనా దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పోటీ పరీక్ష రాసేందుకు అర్హులు. సెప్టెంబర్‌ 20వ తేదీలోపు విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తులు పంపాలి. దరఖాస్తును పాఠశాల హెచ్‌ఎం పేరు మీద సంబంధిత రీజనల్‌ ఆఫీస్‌కు పంపించాలి. తపాలాశాఖలో రూ.200 చెల్లించి పోటీ పరీక్ష రాసే విద్యార్థి పేరుతో లేదా హెచ్‌ఎంల పేరుపై ఫిలాటలీ ఖాతా లేదా ఫిలాటలీ క్లబ్‌ అకౌంట్‌ను తెరవాలి. ఖాతా తెరవగానే రూ.180 విలువ చేసే తపాలా బిళ్లలను ఇస్తారు. ఇవి పోటీ పరీక్షలు రాసేందుకు ఉపయోగపడతాయి. పరీక్ష తేదీని తపాలా అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తారు.
రెండు దశల్లో..
దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పోటీ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుంది. రెండో దశలో ప్రాజెక్టు వర్క్‌ ఉంటుంది. స్క్రీనింగ్‌ పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్‌, స్టాంపులు, చరిత్ర, క్రీడలు, సైన్స్‌, కరెంట్‌ అఫైర్స్‌ సబ్జెక్టుల నుంచి 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రెండో దశ ప్రాజెక్టు వర్కు చేయాల్సి ఉంటుంది. ఇందులో జంతువులు, పక్షులు, ప్రదేశాలు, పూలు, సంగీతం వంటి విభాగాల్లో విద్యార్థులు ఏదో ఒక అంశాన్ని ఎంచుకొని ఇంటి వద్దనే ప్రాజెక్టు వర్క్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 16 స్టాంపులతో 4, 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. పూర్తయిన ప్రాజెక్టును సంబంధిత తపాలాశాఖ రీజనల్‌ ఆఫీస్‌ చిరునామాకు పంపాలి.


ఫిలాట్లీ అనేది పోస్టల్ స్టాంపుల సేకరణ మరియు అధ్యయనం. ఇది స్టాంపులు మరియు ఇతర సంబంధిత ఫిలాటెలిక్ ఉత్పత్తులపై సేకరణ, ప్రశంసలు మరియు పరిశోధన కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుంది. స్టాంపులను సేకరించే అభిరుచిలో స్టాంపులు లేదా సంబంధిత ఉత్పత్తులను థీమాటిక్ ప్రాంతాలలో వెతకడం, గుర్తించడం, సంపాదించడం, నిర్వహించడం, జాబితా చేయడం, ప్రదర్శించడం, నిల్వ చేయడం మరియు నిర్వహించడం వంటివి ఉంటాయి. స్టాంపుల సేకరణ ఒక అభిరుచిగా చాలా విద్యాపరమైన ప్రయోజనాలను కలిగి ఉంది, ఎందుకంటే ఇది స్టాంపు జారీ చేయబడిన కాలం లేదా అది జారీ చేయబడిన ఇతివృత్తం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వాస్తవికత గురించి చాలా బోధిస్తుంది. సేకరణను నిర్వహించడం అనేది జీవితంలోని ఒత్తిడిని ఎదుర్కొనే ఒక విశ్రాంతి కార్యకలాపంగా ఉంటుంది, అదే సమయంలో విసుగును నిరోధించే ఉద్దేశ్యపూర్వక సాధనను అందిస్తుంది. అభిరుచి సారూప్య ఆసక్తులు మరియు కొత్త స్నేహాల అభివృద్ధికి వ్యక్తుల మధ్య సామాజిక సంబంధానికి దారితీస్తుంది. సేకరించడం అనేది సమాచారాన్ని జాబితా చేయడానికి మరియు నిర్వహించడానికి మరియు వారి చర్యలకు అర్థాన్ని ఇవ్వడానికి మానవ మెదడు యొక్క ఆవశ్యకతపై పని చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ​

ఫిలాట్లీ పరిధిని పెంచే లక్ష్యంతో చేసిన ప్రయత్నాలను బలపరుస్తూ, దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్టాండర్డ్ VI నుండి IX వరకు తరగతి విభాగంలో పిల్లలకు బహుమతులు ఇవ్వడానికి అనే స్కాలర్‌షిప్ పథకాన్ని పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ ప్రారంభిస్తోంది. స్టాంపుల అభిరుచి లేదా దీన్ దయాళ్ స్పర్ష్ యోజనలో ప్రతిపాదించబడింది . ఆప్టిట్యూడ్ & రీసెర్చ్‌ని ప్రోత్సహించడం కోసం స్కాలర్‌షిప్ కింద మంచి అకడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులకు వార్షిక స్కాలర్‌షిప్‌లను అందించాలని మరియు ఫిలాట్లీని అభిరుచిగా కొనసాగించాలని
స్కాలర్‌షిప్ యొక్క లక్ష్యం ఫిలాట్లీని ప్రోత్సహించడం వయస్సులో పిల్లలలో " చిన్న బలోపేతం చేయగల మరియు అనుబంధంగా చేయగల స్థిరమైన పద్ధతిలో ". సహాయపడే అభిరుచిని అందించడంతో పాటు అకడమిక్ పాఠ్యాంశాలను , ఇది వారికి విశ్రాంతి మరియు ఒత్తిడిని తగ్గించడంలో మరింత తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి 1847 KB ​​​​​

 For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: