SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు | Date Extended తేదీ పొడిగించబడింది
SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్... పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 07.09.2023 నుంచి 03.10.2023 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
ప్రొబేషనరీ ఆఫీసర్: 2,000 పోస్టులు(ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810)
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి(01.04.2023 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.
దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం.
స్టేజ్ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2023.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్, డిసెంబర్ 2023.
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్/ డిసెంబర్ 2023.
స్టేజ్ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 2023/ జనవరి 2024.
ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2023/ జనవరి 2024.
ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.
తుది ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి/ మార్చి 2024.
ఆన్‌లైన్ అప్లికేషన్Notification Information
Posted Date: 27-09-2023
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు