UPSC Exams: యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం * అర్హత సాధిస్తే రూ.లక్షన్నర ఆర్థికసాయం * రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
UPSC Exams: యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం
* అర్హత సాధిస్తే రూ.లక్షన్నర ఆర్థికసాయం
* రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
ఈనాడు, అమరావతి: యూపీఎస్సీ
ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు
ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్
(ఐబీ) సిలబస్ అమలు, ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలు, అసెంబ్లీలో
ప్రవేశపెట్టనున్న పలు బిల్లులను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సీఎం జగన్
అధ్యక్షతన సచివాలయంలో బుధవారం(సెప్టెంబర్ 19) మంత్రివర్గ సమావేశం
జరిగింది. ఇందులో విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యాంశాలు..
యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రోత్సాహకం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన
సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు జగనన్న సివిల్
సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఆర్థికసాయం అందించేందుకు నిర్ణయం.
ప్రిలిమినరీలో అర్హత సాధిస్తే రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత పొందితే అదనంగా
మరో రూ.50వేలు అందిస్తారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో
కలిసి సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయ
చట్టం-2016కి సవరణల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. ఇప్పటికే
ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా ఏర్పాటుచేసే వాటికీ జాయింట్
సర్టిఫికేషన్ ఉండాలి. ఇప్పుడున్న ప్రైవేటు కళాశాలలు విశ్వవిద్యాలయాలుగా
మారితే వచ్చే అదనపు సీట్లలో 35% కన్వీనర్ కోటా కిందకు వస్తాయి.
* విశ్వవిద్యాలయాల్లో నియామకాలు ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చట్టం-2017 సవరణలకు ఆమోదం.
* కురుపాం గిరిజన ఇంజినీరింగ్ కళాశాలలో 50% సీట్లు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ విద్యార్థులకే కేటాయించాలనే నిర్ణయానికి ఆమోదం.
బడుల్లో ఇక ఐబీ సిలబస్
పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు. ఈ మేరకు ఐబీతో విద్యాశాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)కి ఆమోదం. ఒకటో తరగతితో ఆరంభించి, తర్వాత మిగిలిన తరగతులకు విస్తరిస్తారు.
పోస్టుల భర్తీ
* విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి (కేజీహెచ్), గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో కేన్సర్ సెంటర్‌తోపాటు, వైద్యవిద్య సంచాలకుని పరిధిలోని పీఎంయూలో 353 పోస్టుల భర్తీ. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు లేని (జీరో వేకెన్సీ) విధానం అమలుచేయాలి.
* ఒంగోలు, ఏలూరు, విజయవాడల్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో పదోన్నతులు/ పొరుగు సేవల ద్వారా 168 పోస్టుల భర్తీ.
* 11 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో 99 పోస్టుల భర్తీకి ఆమోదం.
* ఆదోనిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.
* కొత్త జిల్లాల్లో 13 స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు, 6 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ.
* సెరీకల్చర్‌లో ఓ సహాయ సంచాలకుని పోస్టు భర్తీ.
* విద్యుత్ విభాగంలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (తిరుపతి), ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (రాజమహేంద్రవరం) కొత్త పోస్టుల ఏర్పాటు.
* కాగ్ సూచనలతో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)లో శాశ్వత విభాగం ఏర్పాటుకు 10 పోస్టులు.
* సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయంలో శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీ.
* ఏపీ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ ట్రైబ్యునల్‌లో 5 కొత్త పోస్టుల మంజూరు.
* ఏపీ హైకోర్టులో 40 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, 28 డ్రైవర్ పోస్టులు పొరుగు సేవల కింద నియామకం.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు