13, నవంబర్ 2023, సోమవారం

DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమOదంటే..?!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
🔊DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమన్నదంటే..?!

🍥DOT | సిమ్ కార్డు సర్వీసు నిలిపివేస్తారనే పేరుతో సైబర్ మోసగాళ్లు మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించి.. రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని కేంద్ర టెలికం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కాల్స్ ను నమ్మొద్దని హితవు చెప్పింది.

🌀DOT | సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి.. మరో రెండు గంటల్లో కేంద్ర టెలికం శాఖ మీ సిమ్ కార్డ్ సర్వీసు నిలిపేస్తుందని చెబుతున్నారు. అలా జరుగొద్దంటే తాము అడిగిన వివరాలు చెప్పాలంటున్నారు. అలాంటి వారి మాటలు నమ్మిన మొబైల్ యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు చెబుతున్నారు. మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటాతో సైబర్ మోసగాళ్లు పలు రకాల మోసాలు చేస్తున్నారని కేంద్ర టెలికం శాఖ (డాట్) తెలిపింది.

💠ఇటువంటి కాల్స్ ను నమ్మొద్దని పేర్కొంటూ మొబైల్ యూజర్లకు టెలికం శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఇటువంటి కాల్స్ వస్తే మొబైల్ ఫోన్ యూజర్లు తమ నెట్ వర్క్ ప్రొవైడర్‌ని సంప్రదించాలని సూచించింది. యూజర్ల వ్యక్తిగత డేటా తాము సేకరించబోమని, సిమ్ కార్డు సర్వీసుల విషయమై వచ్చే మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పింది.

✳️మోసపూరిత కాల్స్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ)కి ఫిర్యాదు చేయాలని డాట్ పేర్కొంది. ఇటువంటి మోసపూరిత కాల్స్‌ను అరి కట్టడానికి తాము దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: