TCS NQT 2023: ప్రైవేటు కంపెనీల్లో 1.6లక్షల కొలువులు
* టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షకు దరఖాస్తులు
* నవంబర్ 27 వరకు దరఖాస్తుకు అవకాశం
\ |
ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో, ఏసియన్ పెయింట్స్ తదితర ఐటీ, ఐటీయేతర కార్పొరేట్ సంస్థల్లో 1.6 లక్షలకు పైగా కొలువులను దక్కించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.19లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని పొందొచ్చు.
పరీక్ష వివరాలు...
* నేషనల్ క్వాలిఫయర్ టెస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మంచి స్కోరు సాధించాలి. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే.. కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
* డిసెంబర్‌లో జరగనున్న పరీక్షకు నవంబర్ 27లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పరీక్ష డిసెంబర్ 9న నిర్వహిస్తారు.
* 2018 నుంచి 2024 వరకు విద్యా సంవత్సరాల్లో బీటెక్ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
* అభ్యర్థుల వయసు 17 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* టీసీఎస్ ఎన్‌క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి