✅ నేటి ప్రత్యేకత:
▪️ ప్రపంచ ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం
▪️ భారతదేశ నౌకాదళ దినోత్సవం
▪️ అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం
✅ అంతర్జాతీయ వార్తలు:.
▪️ ఆఫ్రికన్ దేశమైన టాంజేనియాలోని పలు ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి 47 మంది మృతి చెందగా 85 మంది గాయపడ్డారు.
▪️ ఎర్ర సముద్రం లోని అమెరికా యుద్ధనౌక యు ఎస్ ఎస్ కార్నీ పై ద్రోన్ దాడి జరిగినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది.
▪️ మాల్దీవులు నుంచి 75 మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవడానికి దుబాయ్ లో జరుగుతున్న కాప్ - 28 సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించారని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు తెలియజేశారు.
▪️ తమ పొరుగు దేశమైన గయానా నియంత్రణలో ఉన్న ఎస్కీబో ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోవాలని అంశంపై వెనిజులా ప్రజలు నిన్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు.
▪️ ఇండోనేషియాలోని పశ్చిమ సమత్రా దీవిలో గల మరాపీ అగ్ని పర్వతం ఆదివారంనాడు విస్ఫోటన చెందిన సంఘటనలో 3,000 ఎత్తుకు అగ్నిపర్వత ధూళి మేఘాలు అలముకున్నాయి.
▪️ కాల్పులు విరమణ తర్వాత దక్షిణ గాజా పై తాము బాంబుదాడి జరపనున్న కారణంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయిల్ సూచించింది.
✅ జాతీయ వార్తలు:
▪️ నిన్న జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
▪️ ఎన్నికల ప్రవర్తనా నియమా వాళ్ళకి విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
▪️ ఇటీవల జరిగిన మిజోరం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
▪️ పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
▪️ 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై వ్యూహరచనకు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు
▪️ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణ బోర్డుకు అప్పగించింది.
✅ రాష్ట్ర వార్తలు:
▪️ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుఫాను మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడి కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
▪️ మిచౌంగ్ తుఫాను పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
▪️ రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయా జిల్లాలలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
▪️ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటి రూ 80 లక్షల వ్యయంతో 334 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (బిపియుహెచ్) లను ఏర్పాటు చేయనున్నారు.
▪️ నవరత్న పథకాలతో పాటు కేంద్ర పథకాలకు సంబంధించి 202425 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను డిసెంబర్ 14వ తేదీలోగా ఆన్లైన్లో పంపాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
✅ క్రీడావార్తలు: .
▪️ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 t20 క్రికెట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా నిన్న బెంగళూరులో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో భారత జట్టు 6 పరుగులు తేడాతో విజయం సాధించి 4-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది.
▪️ లఖ్నవూ లో జరుగుతున్న సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్ట్రో జంట జపాన్ చేతిలో ఓటమిపాలై రన్నరప్ గా నిలిచింది.
▪️ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ - 10 పోటీలలో భాగంగా నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 34-31 తో బెంగళూరు బుల్స్ ను ఓడించగా, మరో మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ 42-31 తో దబాంగ్ ఢిల్లీ ని ఓడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి