● అపరాధ రుసుము లేకుండా ఈ నెల 5వరకు అవకాశం
అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఫీజులు చెల్లించడానికి గడువు పొడిగించారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్, ప్రైవేట్ (ఫెయిల్డ్ లేదా డిస్కంటిన్యూడ్) విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా తమ కళాశాలల్లో ఈ నెల 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 6వ తేదీలోపు ప్రిన్సిపాల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటర్ బోర్డు ఖాతాకు బదిలీ చేయవచ్చని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. జరిమానాతో కలిపి ఈ నెల 15వ తేదీలోపు కళాశాలల్లోను, 16వ తేదీ లోపు ప్రిన్సిపాల్స్ ద్వారా ఇంటర్ బోర్డు ఖాతాకు పరీక్ష ఫీజు రుసుమును బదిలీ చేయవచ్చని ఆయన గురువారం ఒక ప్రకటనలో వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి