22, డిసెంబర్ 2023, శుక్రవారం

ప్రభుత్వ, పార్టీల బాధితులకు అండగా ఉంటాం | ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించేందుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ

ప్రభుత్వ, పార్టీల బాధితులకు అండగా ఉంటాం

18004250264కు కాల్‌ చేయండి: సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ

ఏపీలో పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీ నేతల విద్వేషాలు, అరాచకాలు, దాడుల ఫలితంగా నష్టపోయిన బాధితులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించేందుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో న్యాయ సహాయ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌ చైర్మన్‌గా ముప్పాళ్ల సుబ్బారావు, నర్రా శ్రీనివాసులు, పీవీజీ ఉమేష్‌చంద్రం, ఎం.అశ్వినీకుమార్‌, కె.అజయ్‌కుమార్‌, పీఎస్పీ సురేష్‌కుమార్‌, జంపని శ్రీదేవి, కె.అరుణ, పాలెపు వెంకటనరసింహారావు సభ్యులుగా న్యాయ సహాయ బందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వివిధ కారణాలతో బాధితులుగా మారి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నిస్సహాయులకు చేయూతనందించడమే లక్ష్యంగా ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలోనూ న్యాయ సహాయం కావాలని కోరుకునేవారు 18004250264 టోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేసి సంప్రదించవచ్చన్నారు. అదే విధంగా www.citizensfordemocracy23@gmail.com, www.citizensfo-rdemocracy.net ను సంప్రదించగలరని ఆ ప్రకటనలో తెలిపారు. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: