24, డిసెంబర్ 2023, ఆదివారం

GICRE: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకం

GICRE: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకం



జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ముంబై, GICRE శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఖాళీల వివరాలు:

     ఆఫీసర్-అసిస్టెంట్ మేనేజర్ కేడర్ (స్కేల్ I): 85 పోస్టులు (జనరల్- 35, SC- 12, ST- 6, OBC- 26, EWS- 6, PWD- 3)

విభాగాలు: హిందీ, జనరల్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, లీగల్, హెచ్‌ఆర్, ఇంజినీరింగ్, ఐటీ, యాక్చువరీ, ఇన్సూరెన్స్, మెడికల్, హైడ్రాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, అగ్రికల్చరల్ సైన్స్, నాటికల్ సైన్స్.

అర్హతలు: అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తుదారులు 01.10.2023 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.50,925-96,765.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 23.12.2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 12.01.2024.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 23.12.2023 నుండి 12.01.2024 వరకు.

Important Links

Posted Date: 23-12-2023


ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: