IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో రాత పరీక్ష అడ్మిట్ కార్డులు * మొత్తం 677 ఉద్యోగాల భర్తీ * డిసెంబర్ 20న పరీక్ష
IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో రాత పరీక్ష అడ్మిట్ కార్డులు
* మొత్తం 677 ఉద్యోగాల భర్తీ
* డిసెంబర్ 20న పరీక్ష
కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎంటీఎస్ ఉద్యోగ నియామక వ్రాత పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు విడుదల చేయబడ్డాయి. ప్రముఖ కేంద్రాల్లో డిసెంబర్ 20న పరీక్ష జరుగనుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 677 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఖాళీలను బట్టి టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, మౌఖిక (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇలాంటి వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700- రూ.69,100; ఎంటీఎస్ ఖాళీలకు రూ.18,000 - రూ.56,900 వేతనం ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.
Central Government Intelligence Bureau has released the admit cards for Security Assistant/ MTS recruitment written test. The exam will be held on December 20 in popular centers. Candidates who have applied with user id and password details can download the admit card. It is known that the notification has been released for the recruitment of 677 Security Assistant and MTS posts, the recruitment will be done on the basis of direct recruitment in the subsidiary intelligence bureaus under IB across the country. Depending on the vacancies candidates will be selected based on Tier-1 Written Test (Objective), Tier-2 Written Test (Descriptive), Driving Skill Test, Oral (Interview), Document Verification, Medical Examination etc. Rs.21,700- Rs.69,100 for SA/ MT posts; MTS vacancies have a salary of Rs.18,000 - Rs.56,900. Anantapur, Cherala, Guntur, Kadapa, Kakinada, Kurnool, Rajahmundry, Tirupati, Vijayawada, Visakhapatnam, Vijayanagaram, Hyderabad, Karimnagar, Khammam, Mahbubnagar and Warangal cities in our two Telugu states have been decided as examination centers.
ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
కామెంట్‌లు