● 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ మరియు 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు
● 7 పేపర్లలో 10వ తరగతి పరీక్షలు..ఫిబ్రవరి 5 నుంచి ఇంటర్ మీడియటే ప్రాక్టికల్స్
ఇంటర్మీడియట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి నెలాఖరులోగా పరీక్షలు ముగించేలా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ను రూపొందించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు అలాగే 10వ తరగతి పరీక్షలు 18 నుంచి 30 వరకు జరుగుతాయని వివరించింది. పరీక్షల షెడ్యూల్‌ను ఈ మేరకు గురువారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు జరుగుతాయని.. ఇంటర్ థియరీ పరీక్షలు 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇది టెన్త్ పరీక్షల షెడ్యూల్ గురించి.
మార్చి 18న తెలుగు
మార్చి 19న హిందీ
మార్చి 20న ఇంగ్లిష్
మార్చి 22న గణితం,
మార్చి 23న ఫిజికల్ సైన్స్,
మార్చి 26న బయోలాజికల్ సైన్స్,
మార్చి 27న సోషల్.
కాంపోజిట్‌ను ఎంచుకునే విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 28న ఉంటుంది (కాంపోజిట్) . అదే రోజు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంస్కృతం, అరబిక్, పర్షియన్ పేపర్-1 పరీక్షలు ఉంటాయి.
30న ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఒకేషనల్ థియరీ పరీక్ష సంస్కృతం, అరబిక్, పర్షియన్ పేపర్-2 పరీక్షలు, నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. గత విద్యా సంవత్సరంలో సంస్కరణల పేరుతో ఒకే రోజు రెండు సైన్స్ పేపర్లు నిర్వహించగా విద్యార్థులు సందిగ్ధానికి గురవగా ఈసారి రెండు పేపర్లు వేర్వేరుగా మళ్లీ పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్...
తేదీ ఫస్టియర్ తేదీ ద్వితీయ
మార్చి 1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 మార్చి 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2
మార్చి 4 ఇంగ్లిష్ పేపర్–1 మార్చి 5 ఇంగ్లిష్ పేపర్–2
మార్చి 6 మ్యాథ్స్–1ఏ మార్చి 7 మ్యాథ్స్–2ఏ
బోటనీ పేపర్–1 బోటనీ పేపర్–2
సివిక్స్ పేపర్-1 సివిక్స్ పేపర్-2
మార్చి 9 మ్యాథ్స్–1బి మార్చి 11 మ్యాథ్స్–2బి
జువాలజీ పేపర్–1 జువాలజీ పేపర్–2
హిస్టరీ పేపర్–1 హిస్టరీ పేపర్–2
మార్చి 12 ఫిజిక్స్ పేపర్–1 మార్చి 13 ఫిజిక్స్ పేపర్–2
ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 14 కెమిస్ట్రీ పేపర్–1 మార్చి 15 కెమిస్ట్రీ పేపర్–2
కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2
సోషియాలజీ పేపర్–1 సోషియాలజీ పేపర్–2
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–2
మార్చి 16 పబ్లిక్ అడ్మిన్ పేపర్–1 మార్చి 18 పబ్లిక్ అడ్మిన్ పేపర్–2
లాజిక్ పేపర్-1 లాజిక్ పేపర్-2
బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2
(BIPC విద్యార్థుల కోసం) (BIPC విద్యార్థుల కోసం)
మార్చి 19 మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 20 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2
జాగ్రఫీ పేపర్–1 జాగ్రఫీ పేపర్–2
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల Time Table 2023-24 Andhra Pradesh Intermediate Exams Time Table
ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి పరీక్షల Time Table 2023-24 Andhra Pradesh Class 10 Exams Time Table 2023-24
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి