CBSE: సీబీఐ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు * పోటీ పరీక్షల దృష్ట్యా కొత్త టైంటేబుల్
సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల డేట్ షీట్‌ను బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టైం టేబుల్ (Time Table)లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. 10వ తరగతి షెడ్యూల్‌లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్ పేపర్‌ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్, ఫిబ్రవరి 23న టిబెటన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12వ తరగతిలో కేవలం ఫ్యాషన్ స్టడీస్ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్ డా.సన్యం భరద్వాజ్ గతంలో వెల్లడించారు.
సీబీఎస్‌ఈ 10వ తరగతి రివైజ్డ్ టైం టేబుల్
కామెంట్‌లు