CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జులై-2024

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జులై-2024  

 

ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జులై-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 2 వరకు కొనసాగనుంది. పరీక్షను ఓఎమ్మార్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. 

వివరాలు...

* సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జులై-2024

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 02.04.2024.

ఫీజు చెల్లింపు చివరి తేది: 02.04.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 08.04.2024  నుంచి 12.04.2024 వరకు.

ఓఎమ్మార్‌ ఆధారిత పరీక్ష తేదీ: 07-07-2024.

ఫలితాల వెల్లడి: ఆగస్టు, 2024.

Important Links

Posted Date: 07-03-2024

 

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.