CUET UG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2024
CUET UG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2024
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్ పద్ధతి (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్, పెన్ను విధానంలో నిర్వహణకు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. సీయూఈటీ (యూజీ) పరీక్షకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకు ఆన్‌లైనులో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 30న ఫలితాలను విడుదల చేస్తారు. అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం
ప్రకటన వివరాలు...
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ)-2024
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్- మూడు సబ్జెక్టులకు రూ.1000; అడిషనల్ సబ్జెక్టుకు రూ.400.
ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్- మూడు సబ్జెక్టులకు రూ.900; అడిషనల్ సబ్జెక్టుకు రూ.375.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్- మూడు సబ్జెక్టులకు రూ.800; అడిషనల్ సబ్జెక్టుకు రూ.350.
ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్ నగర్. For applications visit Gemini Internet, D L Road, Hindupur.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31-03-2024.
రుసుము చెల్లింపు చివరి తేదీ: 31-03-2024.
పరీక్ష కేంద్రాల ప్రకటన: 30-04-2024 తర్వాత.
అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2024.
పరీక్ష తేదీలు: 15-05-2024 నుంచి 31-05-2024 వరకు.
ఫలితాల ప్రకటన: తర్వాత ప్రకటిస్తారు.
Important Links
Posted Date: 26-03-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు