Government Jobs and Admissions | బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్ వింగ్ పోస్టులు | రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ | ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్
బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్ వింగ్ పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎయిర్ వింగ్ గ్రూప్- ‘సి’ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) 22 పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (ఏఎస్‌ఐ): 08
అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ఏఎస్‌ఐ): 11
కానిస్టేబుల్ (స్టోర్‌మెన్): 03
ట్రేడ్స్: మెకానికల్, ఏవియానిక్స్.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.147.20 (ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/
రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ
రాయ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. శాశ్వత ప్రాతిపదికన 129 బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్ 2. అడిషనల్ ప్రొఫెసర్
3. అసోసియేట్ ప్రొఫెసర్ 4. అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, డాక్టరేట్ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం.
వయసు: ప్రొఫెసర్/ అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల తనిఖీ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతావారందరికీ రూ.3000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2024.
వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php
ప్రవేశాలు
ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్ సపోర్ట్ విధానంలో వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఆఈట్ 2024) ప్రకటన విడుదలైంది.
బ్రాంచీలవారీగా సీట్ల వివరాలు
బీటెక్- సీఎస్‌ఈ: 360
బీటెక్- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్: 60
బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్: 30
బీటెక్- సివిల్ ఇంజినీరింగ్: 30
బీటెక్- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 30
అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2 (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).
సీట్ల కేటాయింపు: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.
దరఖాస్తు రుసుము: రూ.1,200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2024.
రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 01-05-2024.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 03-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 05-05-2024.
ఫలితాల విడుదల: 07-05-2024.
వెబ్‌సైట్: https://audoa.andhrauniversity.edu.in/default1.aspx?CET=EET
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు