22, మార్చి 2024, శుక్రవారం

ICI: ఐసీఐ తిరుపతి నోయిడాలో బీబీఏ, ఎంబీఏ కలినరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్

ICI: ఐసీఐ తిరుపతి నోయిడాలో బీబీఏ, ఎంబీఏ కలినరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్ 

కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖకు చెందిన తిరుపతి, నోయిడాల్లోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్(ఐసీఐ)- 2024-25 విద్యా సంవత్సరానికి బీబీఏ, ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రవేశం పొందిన విద్యార్థులకు చెఫ్‌, కిచెన్‌ మేనేజ్‌మెంట్- కలినరీ స్పెషలిస్టులుగా ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

ప్రోగ్రామ్ వివరాలు...

1. బీబీఏ (కలినరీ ఆర్ట్స్): ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు.

సీట్ల వివరాలు: ఐసీఐ తిరుపతిలో 120 సీట్లు; ఐసీఐ నోయిడాలో 120 సీట్లు ఉన్నాయి.

అర్హత: కనీసం 45% మార్కులతో ఇంటర్‌/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సరిపోతుంది. 

ఎంపిక ప్రక్రియ: సీయూఈటీ(యూజీ) 2024 స్కోరు లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూ- జేఈఈ(యూజీ) 2024 స్కోరు తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

2. ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు.

సీట్ల వివరాలు: ఐసీఐ తిరుపతిలో 30 సీట్లు; ఐసీఐ నోయిడాలో 30 సీట్లు ఉన్నాయి.

అర్హత: కనీసం 45% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సరిపోతుంది. 

ఎంపిక ప్రక్రియ: సీయూఈటీ(పీజీ) 2024 స్కోరు లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూ- జేఈఈ(యూజీ) 2024 స్కోరు తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2024.

ఆన్‌లైన్ జేఈఈ పరీక్ష తేదీ (యూజీ/ పీజీ): మే 26, 2024

జేఈఈ (యూజీ/ పీజీ) ఫలితాలు: మే 31, 2024.

మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు: జూన్ 3, 2024.

మొదటి రౌండ్ రిపోర్టింగ్: జూన్ 3 నుంచి జూన్ 6, 2024 వరకు.

రెండో రౌండ్ సీట్ల కేటాయింపు: జూన్ 10, 2024.

రెండో రౌండ్ రిపోర్టింగ్: జూన్ 10 నుంచి జూన్ 13, 2024 వరకు.

చివరి రౌండ్ సీట్ల కేటాయింపు: జూన్ 18, 2024.

చివరి రౌండ్ రిపోర్టింగ్: జూన్ 18 నుంచి జూన్ 21, 2024 వరకు.

ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్: జూన్ 24 నుంచి జూలై 12, 2024 వరకు.

అకడమిక్ సెషన్ ప్రారంభం: జులై 15, 2024.

 

Important Links

Posted Date: 21-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.

100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: