RRB Technicain: రైల్వేలో 9,144 టెక్నీషియన్ పోస్టులు
దేశవ్యాప్తంగా
అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ
విభాగాల్లో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి రైల్వే శాఖ(రైల్వే
రిక్రూట్‌మెంట్ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన
అభ్యర్థులు మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక
ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.
ప్రకటన వివరాలు:
1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,092 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III: 8,052 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 9,144.
ఆర్‌ఆర్‌బీ రీజియన్ వారీగా ఖాళీలు:
1. ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్- 761
2. ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్- 522
3. ఆర్‌ఆర్‌బీ బెంగళూరు- 142
4. ఆర్‌ఆర్‌బీ భోపాల్- 452
5. ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్- 150
6. ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్- 861
7. ఆర్‌ఆర్‌బీ చండీగఢ్- 111
8. ఆర్‌ఆర్‌బీ చెన్నై- 833
9. ఆర్‌ఆర్‌బీ గువాహటి- 624
10. ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్ శ్రీనగర్- 291
11. ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా- 506
12. ఆర్‌ఆర్‌బీ మాల్దా- 275
13. ఆర్‌ఆర్‌బీ ముంబయి- 1284
14. ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్- 113
15. ఆర్‌ఆర్‌బీ పట్నా- 221
16. ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్- 338
17. ఆర్‌ఆర్‌బీ రాంచీ- 350
18. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్- 744
19. ఆర్‌ఆర్‌బీ సిలిగురి- 83
20. ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం- 278
21. ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్- 205
అర్హతలు:
* టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై ఉండాలి.
* టెక్నీషియన్ గ్రేడ్-III: మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితరాలు). లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్) ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు; టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల సడలింపు ఉంది.
ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్నపత్రం: టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు, 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ సైన్స్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం మార్కులు 100.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-03-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-04-2024.
Important Links
Posted Date: 10-03-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి