KVS Admissions Notifications 2024 Details : కేంద్రీయ విద్యాలయాలో అడ్మిషన్లు ప్రారంభం... అర్హ‌త‌లు ఇవే.. ! వీరికే మొద‌టి ప్రాధాన్యం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు 1254 పాఠశాలల్లో ప్రవేశానికి కొత్త అడ్మిషన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది.

అర్హతలు : 
ఏ తరగతిలో ప్రవేశం కోరుచున్నారు అంతకుముందు తరగతిలో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 
31 మార్చి 2024 నాటికి ఒకటో తరగతికి 6–8, రెండో తరగతికి 7–9, మూడు, నాలుగో తరగతులకు 8–10 సంవత్సరాల మ‌ధ్య‌, 5,6,7,8,9,10 వ తరగతులకు వరుసగా 9–11, 10–12, 11–13, 12–14, 13–15, 14-16 సంవత్సరాలు కలిగి ఉండాలి.

అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం

వీరికి మాత్ర‌మే ప‌రీక్ష :

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలుగా నిర్ణయించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 5న విడుదల చేయనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

వీరికే మొద‌టి ప్రాధాన్యం..


☛ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. 
☛ ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీల‌కు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు.
☛ ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్‌ ప్రకారం సీటును కేటాయిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది.
☛  సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 
☛  పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
☛ విద్యార్థుల త‌ల్లిదండ్రులు https://kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
☛ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు
☛ ప్రొవిషనల్ లిస్ట్–1 విడుదల తేదీ : ఏప్రిల్ 19
☛ ప్రొవిషనల్ లిస్ట్–2 విడుదల :  ఏప్రిల్ 29
☛ ప్రొవిషనల్ లిస్ట్–3 విడుదల : మే 08

2వ త‌ర‌గ‌తి ప్ర‌వేశ వివ‌రాలు ఇవే..
☛ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10 వరకు
☛ ప్రొవిషనల్ లిస్ట్ విడుదల : ఏప్రిల్ 15 నుంచి
☛ అడ్మిషన్లు : ఏప్రిల్ 16 నుంచి 29 వరకు

కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు.

11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు కేటాయించమని కేవీఎస్ స్పష్టం చేసింది.

అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం

The minimum and maximum age limit for admission in Kendriya Vidyalayas in various classes is given below: (Child born on 1st April should also be considered.)


Class

Minimum / Maximum Age as on 31st March of the Year in which admission is sought.

I

6 years but less than 08 years of age.

II

7 years but less than 09 years of age

III

8 years but less than 10 years of age.

IV

8 years but less than 10 years of age.

V

9 years but less than 11 years of age.

VI

10 years but less than 12 years of age.

VII

11 years but less than 13 years of age.

VIII

12 years but less than 14 years of age.

IX

13 years but less than 15 years of age.

X

14 years but less than 16 years of age.


KVS Important Dates 2024-25 :

Events

Dates

Class I

Starting date for online registration

01 April, 2024

Last date for online registration

15 April, 2024


Starting date for online registration

01 April, 2024

Last date for online registration

10 April, 2024

Declaration of list of class II onwards

April 15, 2024

Admission for class II onward

April 16, 2024 to April 29, 2024

Last Date of admission for all classes except class XI

June 29, 2024

KVS Admission Schedule 2024-25 for Classes I-X PDF : 

PDF
| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh