22, ఏప్రిల్ 2024, సోమవారం

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు | అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి | NVS: 500 TGT, PGT Posts in Jawahar Navodaya Vidyalayas | Eligibility: Degree in relevant subject, BED, CET pass along with teaching experience.

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు
నవోదయ విద్యాలయ సమితి, భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం… ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 283 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.  

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 217 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.  

మొత్తం పోస్టుల సంఖ్య: 500.

వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250; టీజీటీలకు రూ.40,625.

వయో పరిమితి: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26/04/2024.

ఇంటర్వ్యూ తేదీలు: 16-05-2024 నుంచి.

Important Links

Posted Date: 21-04-2024

కామెంట్‌లు లేవు: