ప్రపంచం మారుతోంది... అవసరాలూ మారుతున్నాయి... దానికి అనుగుణంగా మానవ వనరులూ కావాలి... కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం... ప్రపంచవ్యాప్తంగా కొలువుల దశ దిశను నిర్దేశిస్తోంది.
ప్రపంచం మారుతోంది... అవసరాలూ మారుతున్నాయి... దానికి అనుగుణంగా
మానవ వనరులూ కావాలి... కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం...
ప్రపంచవ్యాప్తంగా కొలువుల దశ దిశను నిర్దేశిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగ రంగంలో పెనుమార్పులు రావడం ఖాయం.
ఒకవైపు భయం... మరోవైపు భరోసా... ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరచుకుంటోంది.
టెక్నాలజీ నుంచి పునరుత్పాదకత వరకు... అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు
రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సంకేతాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ దారుల్లో నడిస్తే కొలువులకు కొదవుండదంటున్నాయి... నాస్కామ్, మెకిన్సే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లాంటి ప్రఖ్యాత సంస్థలు! మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ... 2025లో టాప్ టెన్ ఉద్యోగ రంగాలేంటో చూద్దామా...!
◈ చదువంటే ఇంజినీరింగ్, మెడిసినే కాదు...
◈ కొలువంటే సాఫ్ట్‌వేర్, డాక్టరే కాదు...
◈ మారుతున్న ప్రపంచంలో... విస్తరిస్తున్న రంగాలతో....
◈ కొత్త కొలువులొస్తున్నాయ్
◈ వాటికి తగ్గ కోర్సులు పుట్టుకొస్తున్నాయ్
◈ కృత్రిమ మేధ భయంతో పాటే... ఆర్థిక వ్యవస్థను పరుగెత్తిస్తున్న రంగాల్లో ఉద్యోగావకాశాలు ఊటలా ఊరుతున్నాయి. స్వల్పకాల కోర్సులతోనూ ఈ అవకాశాలను అందుకోవచ్చు.! రాబోయే రోజుల్లో మనదేశంలో ఉపాధి ధోరణులపై ఫిక్కీ, నాస్కామ్ వంటి ప్రఖ్యాత సంస్థల అంచనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
◈ వాటి ప్రకారం... 2025, ఆ తర్వాత అవకాశాలు మెండుగా ఉండే రంగాలేంటో చూద్దాం రండి!
1. ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్
◈ ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
◈ భారత ఐటీ రంగం ఏటా 8 శాతం వృద్ధిని నమోదు చేయడంతోపాటు 2025 నాటికి 30 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని నాస్కామ్ అంచనా వేస్తోంది.
◈ ఏఐ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు, డేటా అనలిస్టులు, ఎథికల్ హ్యాకర్ల అవసరం గణనీయంగా పెరగనుంది.
◈
టెక్నాలజీ అండ్ ఐటీ రంగంలో పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో పాటు రోజువారీ
ఆఫీసు పనులు నిర్వహించడం కోసం ఎంఎస్ ఆఫీస్, డేటా ఎంట్రీలో పట్టున్న వారికి
కూడా డిమాండ్ ఉంది. అదే సమయంలో వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్,
హార్డ్‌వేర్, నెట్ వర్కింగుల్లో నైపుణ్యాలున్నవారి అవసరం ఉంది. డిజిటల్
మార్కెటింగ్ రంగంలోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.
2.హెల్త్‌కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్
◈ కరోనా మహమ్మారి అనంతరం అందరిలో ఆరోగ్యం పట్ల
దృక్పథాలు మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ రిసెర్చ్
అండ్ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల ఉద్యోగాల్లో 15 శాతం వృద్ధి
ఉంటుందని మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేస్తోంది. టెలి
మెడిసిన్, హెల్త్‌కేర్ స్టార్టప్‌లు ఎక్కువవుతాయి.
◈ మెడికల్ రీసెర్చర్లు, టెలి మెడికల్ స్పెషలిస్టులు, క్లినికల్ ట్రయల్ కో-ఆర్డినేటర్లు అవసరమవుతారు.
◈
రాబోయే ఆరేళ్ల కాలంలో హాస్పిటల్స్ 8 శాతం పురోభివృద్ధి సాధిస్తాయి.
ఐదారేళ్లలో ఈ రంగంలో ఆరు లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ నిపుణులకు
డిమాండ్ ఏర్పడుతోంది.
చిన్న కోర్సులు చేసినా చాలు
◈
హెల్త్‌కేర్ రంగం అంటే ఎం.డి., ఎం.ఎస్., చేసినవారికే రాణింపు అనేది నిజం
కాదు. ఉన్నత స్థాయి వైద్యులకు సహాయకారులుగా పారా మెడికల్, నర్సింగ్,
ఫార్మా వంటి కోర్సులు చేసిన నిపుణులు అవసరం.
◈ ప్లస్
టూ తర్వాత చేసే స్వల్పకాల కోర్సుల ద్వారా మెడికల్ లేబొరెటరీ టెక్నాలజీ,
రేడియాలజీ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, ఫార్మసీ,
ఫిజియోథెరపీ, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్
లాంటి ఉద్యోగాలు పొందవచ్చు.
◈ హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్, పేషెంట్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ ఫైనాన్స్, అకౌంట్స్,
ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ లాంటి కొత్త విభాగాల్లో మెడికల్ కోర్సులతో
సంబంధం లేని సాధారణ కోర్సులు చేసినవారికి అవకాశం లభిస్తోంది. ఇంటర్ తర్వాత
బీబీఏ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సులు చేసిన యువతను ఎంపిక
చేసుకుంటున్నారు.
◈ హెల్త్‌కేర్ రంగ విస్తరణలో
భాగంగా ఫస్ట్ ఎయిడ్, ప్లేబొటమీ, మెడికల్ ల్యాబ్, ఎమర్జెన్సీ మెడిసిన్‌లలో
శిక్షణ పొందినవారికి త్వరగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి.
ఎంపీహెచ్‌ఏ రాత పరీక్షకు సర్వం సిద్ధం
3.రెన్యూవబుల్ ఎనర్జీ
◈
2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ)ని
ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని భారతదేశం భావిస్తోంది.
◈
ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ
(ఐఈఏ) అంచనాల ప్రకారం సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్‌లకు సంబంధించి 2025
నాటికి పది లక్షల మంది నిపుణులు అవసరం అవుతారు.
◈ సోలార్ ప్యానల్ టెక్నీషియన్లు, విండ్ టర్బైన్ ఇంజినీర్లు, గ్రీన్ హైడ్రోజన్ స్పెషలిస్టులు ప్రధానమైన ఉద్యోగాలు.
4.ఎంటర్‌టెయిన్‌మెంట్ అండ్ కంటెంట్ క్రియేషన్
◈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్, డిజిటల్ మీడియాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
◈
భారతదేశ మీడియా, ఎంటర్‌టెయిన్‌మెంట్ పరిశ్రమ వ్యాపారం 2025 చివరి నాటికి
రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని కేపీఎంజీ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
◈ వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టులు, కంటెంట్ రైటర్లు, గేమిషికేషన్ ఎక్స్‌పర్టుల అవసరం గణనీయంగా పెరగనుంది.
5.బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్
◈ ఆర్థిక వ్యవహారాల్లో డిజిటల్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది.
◈ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం ఇండియా ఫిన్‌టెక్ మార్కెట్ 2025 చివరి నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరనుంది.
◈ బ్లాక్‌చెయిన్ అనలిస్టులు, వెల్త్ అడ్వైజర్లు, రిస్క్ అనలిస్టుల అవసరం అధికమవుతుంది.
◈
జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, వివిధ
ఆర్థిక సేవల కంపెనీలు, ఇన్స్యూరెన్స్ సంస్థలు కామర్స్, ఎకనామిక్స్, ఎంబీఏ,
ఫైనాన్స్, డేటా అనాలిసిస్ తదితర కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలు
కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
6.మాన్యుఫాక్చరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్
◈
మేక్ ఇన్ ఇండియా, పీఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకాల
అంతర్జాతీయ తయారీరంగ కేంద్రంగా మారాలని భారతదేశం లక్షిస్తోంది.
◈
స్మార్ట్ సిటీలు, మెట్రో ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ తదితరాల
వల్ల ఏటా 9 శాతం ఉద్యోగాల వృద్ధి ఉంటుందని ప్రపంచబ్యాంకు పేర్కొంటోంది.
◈ ఇండస్ట్రియల్ ఇంజినీర్లు, రోబోటిక్స్ టెక్నీషియన్లు, ప్రాజెక్టు మేనేజర్లు కీలకమైన ఉద్యోగాలు.
7.ఎడ్యుకేషన్ టెక్నాలజీ - ఎడ్‌టెక్
◈ దాదాపు 50 కోట్ల మంది యువతకు అవసరమైన ఆన్‌లైన్ లర్నింగ్ సేవలను అందించే వేదికలు అవసరమవుతాయని అంచనా.
◈
ఆన్‌లైన్ ట్యూటర్లు, కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ ఎడ్యుకేషన్
కరిక్యులమ్ డెవలపర్ల వంటి ఉద్యోగాల వృద్ధి భారత్‌లో ఏటా 10 శాతం వరకు
ఉంటుందని డెలాయిట్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
◈ ఆన్‌లైన్ ఎడ్యుకేటర్లు, ఎల్‌ఎంఎస్ డెవలపర్లు, గేమిఫైడ్ లెర్నింగ్ డిజైనర్లు ముఖ్యమైన ఉద్యోగ హోదాలు.
8. అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్
◈ స్మార్ట్ ఫార్మింగ్ టెక్నాలజీలు, ఆహార ఎగుమతుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెద్దఎత్తున పెరుగుతాయని అంచనా.
◈ సప్లై చెయిన్ డిజిటైజేషన్, అగ్రి బిజినెస్, ఫార్మింగ్‌కి సంబంధించి సుమారు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఫిక్కి నివేదిస్తోంది.
◈ అగ్రానమిస్టులు, ఫుడ్ టెక్నాలజిస్టులు, సప్లై చెయిన్ ఎక్స్‌పర్ట్‌లు ప్రధానమైన ఉద్యోగాలు.
◈ ఆర్గానిక్ ఫార్మింగ్, గార్డెనింగ్‌లలో నిపుణుల కొరత అధికంగా ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈ రంగాల్లో ప్రవేశించవచ్చు
◈
డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో
ప్రవేశించాలంటే ఫుడ్ టెక్నాలజీ కోర్సులే చేసి ఉండాల్సిన అవసరం లేదు.
చిరుతిళ్ల స్థాయి నుంచి భారీ ప్యాక్డ్ ఫుడ్ ఇండస్ట్రీగా అవతరించిన
పరిశ్రమలో సాధారణ టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసినా మంచి అవకాశాలు ఆహ్వానం
పలుకుతున్నాయి.
◈ డిప్ల్లొమా ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజ్‌మెంట్
◈ డిప్లొమా ఇన్ వ్యాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్
◈ డిప్లొమా ఇన్ డెయిరీ టెక్నాలజీ
◈ డిప్లొమా ఇన్ మీట్ టెక్నాలజీ
◈ డిప్లొమా ఇన్ ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ
◈ ఫుడ్ అనాలిసిస్ అండ్ అస్యూరెన్స్
◈డిప్లొమా
ఇన్ ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ... ఇలాంటి విభిన్న డిప్లొమా, సర్టిఫికెట్
కోర్సులను స్వల్పకాల వ్యవధిలో పూర్తిచేస్తే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోకి
అడుగు పెట్టవచ్చు.
ఈ రంగంలో ఉన్నతశ్రేణి ఉద్యోగులకే కాకుండా సాధారణ కోర్సులతో చేరిన
చిరుద్యోగులకూ చెప్పుకోదగ్గ జీతాలుంటున్నాయి. బీటెక్ చేసి ఐటీ కంపెనీల్లో
చేరే ఫ్రెషర్స్‌తో సమానంగా ఈ రంగంలో ప్యాకేజీలు ఇస్తున్నారు.
9.ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్
◈ ఆన్‌లైన్‌లో రిటైల్ విక్రయాలు విస్తృతంగా పెరుగుతున్నాయి.
◈ ఎఫ్‌ఎంసీజీ, మొబైల్, జ్యువెలరీ, కాస్మటిక్స్, గార్మెంట్స్ వంటి వివిధ ఉప విభాగాలు అద్భుత వృద్ధిని సాధిస్తున్నాయి.
◈
ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా ఈ రంగంలో 21.5 శాతం
వృద్ధి నమోదు కానుంది. వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్, సప్లై చెయిన్
మేనేజ్‌మెంట్‌ల్లో మానవ వనరులకు డిమాండ్ పెరగనుంది.
◈ లాజిస్టిక్ మేనేజర్లు, ఈ-కామర్స్ అనలిస్టులు, వేర్‌హౌస్ ఆటోమేషన్ నిపుణుల కోసం మార్కెట్ ఎదురుచూడబోతోంది.
◈ దేశంలో 78 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండటంతో ఈ-కామర్స్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది.
కనీస విద్యార్హతలుంటే...
◈ రిటైల్ రంగంలో భారీ మాల్స్, హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్
చెయిన్స్‌లో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలైన సేల్స్‌మెన్‌కు పెద్దగా
విద్యార్హతలు అవసరం లేదు. ఇంటర్/ టెన్త్ విద్యార్హతలుంటే చాలు.
కస్టమర్స్‌తో వ్యవహరించాల్సిన తీరు, తమ వద్ద లభ్యమయ్యే ఉత్పత్తులపై అవగాహన
కలిగించి స్టోర్స్‌కు పంపుతున్నారు.
◈ రిటైల్ రంగంలో మొత్తం పనిచేస్తున్న సిబ్బంది 4 కోట్లు కాగా వీరిలో 50 శాతం మంది సేల్స్ ఫోర్సే.
◈ గత దశాబ్ద కాలంగా ఉజ్వలంగా వెలుగొందుతున్న ఈ-కామర్స్ రంగంలో డెలివరీ ఫోర్స్ చాలా పెద్దది.
◈
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కి దేశవ్యాప్తంగా కోటి మంది డెలివరీ సిబ్బంది
ఉన్నారు. కేవలం టెన్త్ విద్యార్హతలు, టూ-వీలర్ నడిపే నైపుణ్యం ఉంటే చాలు,
డెలివరీ బాయ్‌గా అవకాశం లభించినట్టే.
10.టూరిజం & హాస్పిటాలిటీ
◈ కరోనా అనంతరం అంతర్జాతీయ టూరిజం పుంజుకుంటోంది. భారతదేశ ఘనమైన వారసత్వం ఈ రంగం అందిస్తున్న అవకాశాలను అందుకుంటోంది.
◈
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ),
వరల్డ్ * ట్రావెల్ అండ్ టూరిజమ్ కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) భారత్‌లో 20
శాతం టూరిజం రంగంలో ముఖ్యంగా ఇకో-టూరిజమ్, వెల్‌నెస్ సెక్టార్లలో
ఉద్యోగాల వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.
◈ ట్రావెల్ కన్సల్టెంట్లు, హాస్పిటాలిటీ మేనేజర్లు, ఈవెంట్ ప్లానర్లు మొదలైనవి ముఖ్యమైన ఉద్యోగాలు.
◈
ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లున్న భారత ఆతిథ్య పరిశ్రమ 2032 నాటికి రూ. 3
లక్షల 20 వేల కోట్లకు చేరుతుందన్న అంచనా మధ్య భారీ పెట్టుబడులను
ఆకర్షిస్తోంది.
◈ భారీ హోటల్స్‌తో పాటు మధ్య తరహా, చిన్న తరహా హోటల్స్ చెయిన్లు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
◈
ఆతిథ్య, పర్యాటక రంగాలు చెట్టపట్టాలేసుకొని ఎదుగుతున్నాయి. ఒకదాని
వృద్ధిపై మరొకటి ఆధారపడివుంటుంది. ఈ రెండు రంగాల్లో కలిపి 2029 నాటికి 5
లక్షల కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి.
◈ తెలుగు
రాష్ట్రాల్లోని చాలా హోటళ్లలో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉపాధి పొందుతున్నారు.
దానికి కారణం- తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఈ కోర్సుల
గురించి ఆలోచించకపోవడమే! టూరిజం రంగంలో కూడా నిపుణుల కొరత ఉంది.
మెటావర్స్‌లో కోట్ల కొలువులు
పురాణాల్లో దేవుడి అవతారాల గురించి విన్నాం. ఇకపై ప్రతి మనిషి అనేక అవతారాలు ఎత్తబోతున్నాడనేది కొత్త బాట. ఈ వర్చువల్ ప్రపంచంలో ఎవరికి వారు తమ రూపాన్ని సృష్టించుకుంటారు. దానినే ‘అవతార్’ అంటారు. చుట్టూ త్రీడీ ప్రపంచం ఉంటుంది. సొంత వర్చువల్ ఆఫీసులు నిర్మించుకొని, సహోద్యోగులతో కలిసి పని చేసుకోవచ్చు. దీన్ని సాక్షాత్కరింపజేసే మార్గం మెటావర్స్! భవిష్యత్తులో గేమ్ ఛేంజర్‌గా మారనున్న మెటావర్స్ సృష్టించనున్న అద్భుతమైన, అపరిమితమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అందరూ తమ సామర్థ్యాలను అన్‌లాక్ చేయాలి.
మెటావర్స్ అనేది భవిష్యత్తులో ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేయబోయే ఒక అద్భుతమైన డిజిటల్ ప్రపంచం. సంబంధిత కోర్సులు చేయడానికి చాలావాటికి ఏదైనా డిగ్రీ సరిపోతుంది. ఇంటర్మీడియట్‌తో కూడా చేసేవి ఉన్నాయి. ఇంకొన్నాళ్లు పోతే విద్యార్హతలతో సంబంధం లేకుండా కేవలం నైపుణ్యాల ఆధారంగా కూడా ఉద్యోగాలు అందే అవకాశం ఉంది. విద్యార్థులూ, ఉద్యోగార్థులూ కొత్త సంవత్సరంలో ఈ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి తెలుసుకొని, నైపుణ్యాలను పెంచుకోవాలని నిర్ణయించుకోవాలి. కలల కొలువుల సాకారానికి కాల్పనిక లోకంలోకి ‘అవతార్’లుగా అడుగుపెట్టాలి.
2.30 కోట్ల మందికి అవకాశం
అమెరికాకు చెందిన మార్కెట్స్ అండ్ మార్కెట్ అనే అంతర్జాతీయ
కాంపిటిటివ్ ఇంటలిజెన్స్ మార్కెట్ రిసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం
మెటావర్స్ మార్కెట్ 2030 నాటికి 1303.4 బిలియన్ డాలర్లకు అంటే సుమారు
రూ.కోటి కోట్లు! యాక్సెంచర్ అంచనా ప్రకారం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు
2.3 కోట్ల ఉద్యోగావకాశాలను 2030 నాటికి మెటావర్స్ అందిస్తుంది. సంస్థాగత
కార్యకలాపాల్లో మెటావర్స్‌ను వినియోగించుకోడానికి భారతదేశంలో 70 శాతం
బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు మొగ్గు చూపుతున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా
నివేదిక చెబుతోంది. ఇందులో మెటావర్స్ డెవలపర్, త్రీడీ ఆర్టిస్టు,
ఏఆర్/వీఆర్ కంటెంట్ డెవలపర్, మెటావర్స్ మార్కెటింగ్ స్పెషలిస్టు,
బ్లాక్ చెయిన్ ఇంజినీరు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టు, మెటావర్స్
స్ట్రాటజిస్టు తదితర ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
నైపుణ్యాలను అందిస్తున్న సంస్థలు
ఐఐటీ-మద్రాస్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతోపాటు, ఇతర ప్రైవేటు సంస్థలు
ఆఫ్‌లైన్‌లో మెటావర్స్ టెక్నాలజీ సంబంధిత కోర్సులను అందిస్తుంటే,
కోర్సెరా, యుడెమీ, ఎడెక్స్, సింప్లిలెర్న్ వంటి సంస్థలు ఆన్‌లైన్‌లో
శిక్షణ ఇస్తున్నాయి.
ఏం నేర్చుకోవాలి?
మెటావర్స్ అందించబోతున్న మెగా అవకాశాలను అందుకోవాలంటే వీఆర్, ఏఆర్,
ఎక్స్‌ఆర్ (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ), త్రీడీ మోడలింగ్, బ్లాక్ చెయిన్
టెక్నాలజీ నైపుణ్యాలను అభ్యర్థులు నేర్చుకోవాలి. సీ-హాష్, పైతాన్,
జావాస్క్రిప్ట్ లాంగ్వేజీల్లో కోడింగ్‌పై పట్టు పెంచుకోవాలి. వర్చువల్
కంటెంట్ డిజైన్ చేస్తుండాలి. ఇతర టీమ్‌లతో కలిసి వర్చువల్
ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి. మెటావర్స్ టెక్నాలజీ సంబంధిత
ఇంటర్న్‌షిప్‌లు చేయాలి.
ఇంటి నుంచే హార్వర్డ్ పాఠాలు!
పేరున్న సంస్థలో సీటు రాలేదా... బేఫికర్ మీ బ్రాంచీలో సరైన ఫ్యాకల్టీ లేరా... టెన్షన్ వద్దు. మీ సర్ చెప్పిన పాఠాలు కిక్కివ్వడం లేదా ... నిరుత్సాహపడొద్దు. కోచింగ్ తీసుకునే స్థోమత లేదా... ఆశయాన్ని చంపుకోనవసరం లేదు.
నేటి తరం విద్యార్థులను ప్రశ్నిస్తే సమస్యల శంఖారావమే. ఫ్యాకల్టీ సభ్యులు లేరని చెప్పేవాళ్లు కొందరైతే, ఉన్నా సరిగా చెప్పడం లేదనేవాళ్లు మరి కొందరు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇవేవీ పెద్ద సమస్యలు కావు. అంతర్జాలం అండతో వీటన్నింటినీ అధిగమించవచ్చు.
ఆసక్తి ఉంటే చాలు...
జేఈఈకి సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులు ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు
ఆస్వాదించవచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థులు అటు ఇంజినీరింగ్ పాఠాలూ, ఇటు
గేట్, ఐఈఎస్ కోచింగ్ రెండూ ఆన్‌లైన్‌లోనే పద్ధతి ప్రకారం
పూర్తిచేసుకోవచ్చు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులూ డిగ్రీ, పీజీ
పాఠాలు పూర్తిగా వినేయొచ్చు. నెట్ కోసమూ సిద్ధమైపోవచ్చు. ఈ ఏర్పాట్లు
యూజీసీ ఇప్పటికే చేసేసింది. బడి పిల్లలకు సైతం సీబీఎస్‌ఈ చక్కగా వీడియో
పాఠాలు అందిస్తోంది. ఓపెన్ స్కూల్ విద్యార్థుల కోసం ఎన్‌ఐఓఎస్,
దూరవిద్యార్థులకు ఇగ్నో ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం
హైస్కూల్ నుంచి పీజీ వరకూ వెబ్ పోర్టళ్లు, టీవీ ఛానెళ్ల ద్వారా తరగతి
గదికి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు రూపొందించింది. పైసా చెల్లించకుండా ఈ
సేవలను ఉపయోగించుకోచ్చు.
ఎన్‌పీటీఈఎల్
‘‘ఎవరైనా, ఏ సమయాల్లోనైనా, ఎక్కడి నుంచైనా’ నినాదంతో ఎన్‌పీటీఈఎల్
పనిచేస్తోంది. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్
లెర్నింగ్‌కు సూక్ష్మమే ఎన్‌పీటీఈఎల్. ఇది కేంద్ర మానవ వనరుల విభాగం
ఆధ్వర్యంలో ఏర్పడింది. ఏడు ఐఐటీలు, ఐఐఎస్సీ ఇందులో భాగస్వామ్య సంస్థలు.
ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెసుల్లో 3200+
కోర్సులు ఉన్నాయి. వీటిలో చక్కగా వీడియో పాఠాలు వినేయవచ్చు. కోర్సును బట్టి
4, 8, 12 వారాల వ్యవధి ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫర్ కాంపిటిటివ్
ఎగ్జామ్స్, సాఫ్ట్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ లాంటివి చదువుతున్న
కోర్సులతో నిమిత్తం లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు. విద్యార్హతతో నిమిత్తం
లేకుండా ఆసక్తి ప్రాతిపదికన వీటిలో చేరడానికి అందరూ అర్హులే. సర్టిఫికేషన్
పొందాలనుకున్నవారు రూ.వెయ్యి చెల్లించాలి.
వెబ్‌సైట్: https://nptel.ac.in/
పీఎం ఈవిద్య: ఈ పోర్టల్ నుంచి ఐఐటీ ఎంట్రన్స్,
నీట్‌లకు సిద్ధం కావచ్చు. టెస్టులూ రాసుకోవచ్చు. స్వయం, దీక్ష, స్వయంప్రభ
టీవీ, రేడియో, ఇ-కంటెంట్, ఆన్‌లైన్ కోచింగ్.. వీటన్నింటికీ ఈ పోర్టల్
వేదిక.
వెబ్‌సైట్: https://pmevidya.education.gov.in/index.html
హార్వర్డ్: ఈ ప్రసిద్ధ సంస్థ ఆన్‌లైన్ వేదికగా
ఉచితంగానూ, కొంత రుసుము తీసుకునీ కోర్సులు అందిస్తోంది. మేనేజింగ్
హ్యాపీనెస్ పేరుతో 6 వారాల వ్యవధితో కోర్సు చదువుకోవచ్చు. డేటాసైన్స్,
హ్యుమానిటీస్, సైన్స్, సోషల్ సైన్స్, మెడిసిన్, మ్యాథమెటిక్స్.. ఇలా పలు
విభాగాల్లో విస్తృతంగా కోర్సులను ఆన్‌లైన్‌లో అభ్యసించవచ్చు.
https://pll.harvard.edu/catalog/free?page=4
గ్రో గూగుల్: సెర్చింజిన్ దిగ్గజం గూగుల్.. గ్రో మై
కెరియర్, గ్రో మై బిజినెస్ విభాగాల్లో వివిధ కోర్సులు అందిస్తోంది. ఏఐ,
క్లౌడ్ కంప్యూటింగ్, కోడింగ్, కమ్యూనికేషన్, డిజైన్, డిజిటల్
మార్కెటింగ్.. ఇలా ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు..
https://www.grow.google/intl/uk/courses-and-tools/?category=career
కోర్స్‌ఎరా: ప్రపంచంలోని టాప్ 350+ విశ్వవిద్యాలయాలూ, సంస్థలూ రూపొందించిన ఆన్‌లైన్ కోర్సులను కోర్స్‌ఎరా వేదికగా నేర్చుకోవచ్చు.
www.coursera.org/
అప్‌గ్రేడ్: ఈ వేదికగా చాట్ జీపీటీ అండ్ ఏఐ,
టెక్నాలజీ, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌స్కిల్స్, లా.. ఇలా ఎన్నో
విభాగాల్లో మేటి కోర్సులు అభ్యసించవచ్చు.
https://www.upgrad.com/free-courses
స్వయంప్లస్: దీని నుంచి వంద రోజుల్లో పైతాన్, ఏఐ
ఇంజినీర్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, అప్లైడ్ డేటా సైన్స్,
సైబర్ సెక్యూరిటీ... ఇలా ఎన్నో కోర్సులు సులువుగానే నేర్చుకోవచ్చు.
మరిన్ని వివరాలకు..
https://swayam-plus.swayam2.ac.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు