## ఎరువులు, పురుగుమందుల వ్యాపారంపై జీఎస్టీ ఎలా? 🧐 | How GST Applies to Fertilizers & Pesticides Business? 🧐
**ఇతర వ్యాపారాలతో పోలిస్తే, మన దేశంలో ఎరువులు, పురుగుమందుల వ్యాపారం కొంత భిన్నమైంది. మిగతా వ్యాపారాల్లో అన్ని రకాల వినియోగదారులు ఉండగా, ఈ వ్యాపారంలో అంతిమ వినియోగదారులు రైతులు మాత్రమే. అంతేకాకుండా, ఇది సీజనల్ వ్యాపారం; అంటే సంవత్సరం మొత్తం నడవదు. ఎక్కువగా అరువు మీద వ్యాపారం జరుగుతుంది. రైతులు కొన్న ఎరువులు లేదా పురుగుమందులకు సంబంధించిన డబ్బులు పంట వచ్చిన తర్వాత చెల్లిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో, ఈ వ్యాపారానికి సంబంధించి జీఎస్టీ గురించిన జాగ్రత్తలు ఏమిటి? పద్దు పుస్తకాలు ఎలా నిర్వహించాలి? మొదలైన విషయాలు మీకోసం...**
---
**Compared to other businesses, the fertilizer and pesticide business in our country is somewhat different. While other businesses have all types of consumers, in this business, the ultimate consumers are only farmers. Moreover, it is a seasonal business, meaning it doesn't run throughout the year. Most of the business operates on credit. Farmers typically pay for the fertilizers or pesticides they bought after the harvest. In such scenarios, what precautions should be taken regarding GST for this business? How should accounting records be maintained? These are some of the things you need to know...**
---
**ఒకప్పుడు జిల్లా, మండల కేంద్రాల్లోనే ఈ దుకాణాలు ఉండగా, ఇప్పుడు చిన్న గ్రామాల్లో కూడా ఉంటున్నాయి. రైతులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, సీజన్ ప్రారంభంలో అరువు మీద ఎరువులు తెచ్చుకుని, పంట వచ్చిన తర్వాత దుకాణదారులకు చెల్లిస్తారు. అంటే దుకాణదారులకు ఆ పైకం ఆలస్యంగా అందుతుంది. కాబట్టి, ఈ దుకాణదారులు కూడా హోల్ సేల్ వ్యాపారులకు, అలాగే హోల్ సేల్ వ్యాపారులు కంపెనీలకు ఆలస్యంగా డబ్బులు చెల్లిస్తుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, కంపెనీలు సీజన్ ప్రారంభంలో ఎక్కువ సరుకును హోల్ సేల్ వ్యాపారులకు పంపిస్తారు. సదరు సరుకును అమ్ముకోవటానికి హోల్ సేల్ వ్యాపారులకు సాధ్యమైనంత మేర గడువు ఇస్తుంది. అంటే, ఈ సరుకుకు సంబంధించిన మొత్తాన్ని ఆలస్యంగా చెల్లించే వెసులుబాటు ఈ వ్యాపారులకు ఉంటుంది. కాబట్టి, వీరు కూడా ఇదే పద్ధతిలో రిటైల్ వ్యాపారులకు సరుకును ఇస్తుంటారు.**
---
**Previously, these shops were only found in district and mandal centers, but now they are also present in small villages. Farmers, especially small and marginal farmers, procure fertilizers on credit at the beginning of the season and pay the shopkeepers after the harvest. This means the shopkeepers receive the payment late. Consequently, these shopkeepers also pay wholesale dealers late, and wholesale dealers, in turn, pay companies late. To elaborate, companies dispatch large quantities of goods to wholesale dealers at the start of the season, providing them with as much time as possible to sell the stock. This flexibility allows these dealers to pay for the goods later. They, in turn, extend the same credit terms to retail traders.**
---
**ఈ వ్యాపారంలో ఉన్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే, కంపెనీలు ఎక్కువగా సరుకును హోల్ సేల్ వ్యాపారులకు పంపిస్తాయని చెప్పుకున్నాం కదా. మరి అంత సరుకు అమ్ముడుపోక పోతే ఏమి చేయాలి? అందుకే, అమ్ముడుపోని సరుకుని కొంతకాలం తర్వాత వెనక్కు తీసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇదే పద్ధతిలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య కూడా ఉంటుంది. అంటే, మిగతా వ్యాపారులతో పోలిస్తే, ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి సరుకు వెనక్కి పంపించటం, అలాగే కొనుగోలుకు సంబంధించిన సొమ్ము ఆలస్యంగా చెల్లించటం.**
---
**Another important aspect of this business is that companies typically dispatch large quantities of goods to wholesale dealers. What happens if all that stock isn't sold? That's why they provide the flexibility to take back unsold goods after a certain period. The same practice exists between wholesale and retail traders. This means, compared to other businesses, there are two main issues here: one is returning unsold goods, and the other is delayed payment for purchases.**
---
**మరి ఈ విధానంలో జీఎస్టీకి సంబంధించి సమస్యలు ఏమిటంటే, ఒక వ్యాపారి తాను పొందిన సరుకు మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందినప్పుడు, ఇన్వాయిస్ తేదీ నుంచి 180 రోజుల లోపు అమ్మకందారునికి ఆ సరుకు తాలూకూ మొత్తం పన్నుతో సహా కలిపి చెల్లించాలి. అలా చెల్లించని పక్షంలో, తీసుకున్న ఐటీసీ చెల్లుబాటు కాదు కాబట్టి, దాన్ని రివర్స్ చేసి, తిరిగి ఎప్పుడైతే ఆ మొత్తం చెల్లిస్తాడో అప్పుడు ఆ క్రెడిట్ తిరిగి తీసుకోవాలి. ముందు చెప్పినట్లుగా, ఈ వ్యాపారంలో ఎక్కువ సందర్భాల్లో 6 నెలలకు మించి గడువు ఇస్తుంటారు. అలాంటప్పుడు, సంబంధిత నిబంధనల ప్రకారం ఐటీసీ మొత్తం రివర్స్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఇన్వాయిస్ తేదీ నుంచి రివర్స్ చేయాల్సిన తేదీ వరకు తీసుకున్న ఐటీసీ మొత్తంపై వడ్డీ చెల్లించాలి. ఉదాహరణకు, సరుకు తీసుకున్న ఇన్వాయిస్ తేదీ జనవరి 1 అనుకుంటే, గరిష్టంగా జూన్ 29 లేదా 30 వరకు ఈ 180 రోజుల గడువు పూర్తవుతుంది. ఇన్వాయిస్ విలువ మొత్తం మీద రూ.1,00,000, దానిమీద ఐటీసీ రూ.18,000 అనుకుంటే, మొత్తం రూ.1,18,000 ఈ తేదీ లోపులో చెల్లించి ఉండాలి. లేని పక్షంలో, ఐటీసీ కింద తీసుకున్న రూ.18,000 దాంతో పాటుగా, జనవరి 1 నుంచి వడ్డీ (18 శాతం) చొప్పున చెల్లించాలి. ఒకవేళ 180 రోజుల లోపు కొంత మొత్తం చెల్లించి ఉంటే, చెల్లించని భాగానికి సంబంధించిన ఐటీసీపై, లెక్క ప్రకారం రివర్స్ చేయాల్సి ఉంటుంది, వడ్డీతో సహా.**
---
**Now, regarding the GST issues in this system: when a dealer obtains Input Tax Credit (ITC) on goods received, they must pay the seller the total amount, including tax, within 180 days from the invoice date. If payment is not made, the ITC claimed becomes invalid and must be reversed. This credit can only be reclaimed once the full payment is made. As mentioned earlier, in this business, credit periods often exceed 6 months. In such cases, according to the relevant rules, the entire ITC amount must be reversed. Furthermore, interest must be paid on the entire ITC amount from the invoice date until the date of reversal. For example, if the invoice date for goods received is January 1st, the 180-day period would expire by June 29th or 30th at the latest. If the total invoice value is Rs. 1,00,000 and the ITC is Rs. 18,000, a total of Rs. 1,18,000 should have been paid by this date. Otherwise, the Rs. 18,000 taken as ITC, along with interest (18%) from January 1st, must be paid. If a partial payment was made within 180 days, the ITC related to the unpaid portion must be reversed, along with interest, as per the rules.**
---
**ఇక సరుకు వెనక్కు పంపేటప్పుడు, అంటే ఒక హోల్ సేల్ వ్యాపారి నుంచి పొందిన సరుకును రిటైల్ వ్యాపారి వెనక్కు పంపుతుంటే, కొన్ని సందర్భాల్లో రిటైల్ వ్యాపారి డెబిట్ నోట్ జారీ చేస్తుంటాడు. ఇది తప్పు. క్రెడిట్ నోట్ లేదా డెబిట్ నోట్‌ను వాస్తవంగా సరుకు ఎవరైతే పంపారో వారే ఇవ్వాలి. అంటే, ఈ సందర్భంలో సరుకు పంపింది హోల్ సేల్ వ్యాపారి కాబట్టి, ఇలా వెనక్కు వచ్చే సరుకు మేరకు ఒక క్రెడిట్ నోట్ రిటైల్ వ్యాపారికి తనే జారీ చేయాలి. క్రెడిట్ నోట్‌లో ఉన్న మొత్తం ఆ హోల్ సేల్ వ్యాపారి తదుపరి రిటర్న్స్‌లో తగ్గించుకోవచ్చు. ఇలా చేయాలంటే రెండు నిబంధనలు ఉన్నాయి.**
**మొదటిది, సదరు రిటైల్ వ్యాపారి తాను వెనక్కు పంపే సరుకుకు సంబంధించిన ఐటీసీ రివర్స్ చేయాలి. అలాగే, హోల్ సేల్ వ్యాపారి తగ్గింపు చేసుకోవటం అనేది, ఇన్వాయిస్ ఇచ్చిన తదుపరి ఆర్థిక సంవత్సరం నవంబరు 30 లోపులోనే చేసుకోవాలి. ఉదాహరణకు, 2024 జనవరి 1న ఇన్వాయిస్ జారీ చేసి ఉంటే, గరిష్టంగా 2024 నవంబరు 30 లోపు మాత్రమే క్రెడిట్ నోట్ మీద తగ్గింపు సాధ్యమవుతుంది.**
---
**When returning goods, for instance, if a retail dealer returns goods received from a wholesale dealer, sometimes the retail dealer issues a debit note. This is incorrect. A credit note or debit note should actually be issued by the person who originally supplied the goods. In this scenario, since the wholesale dealer supplied the goods, they should issue a credit note to the retail dealer for the returned goods. The amount mentioned in the credit note can be reduced by the wholesale dealer in their subsequent returns. To do this, two conditions must be met.**
**Firstly, the retail dealer must reverse the ITC pertaining to the goods they are returning. Secondly, the wholesale dealer's reduction must be made by November 30th of the financial year following the invoice issuance. For example, if an invoice was issued on January 1, 2024, the reduction on the credit note can only be made up to November 30, 2024, at the latest.**
---
**ఇందులో ఇంకొక పద్ధతి ఏమిటంటే, సరుకు వెనక్కు పంపే వ్యక్తి, అంటే రిటైల్ వ్యాపారి, తాను వెనక్కు పంపే సరుకును అమ్మకం కింద చూపిస్తూ, హోల్ సేల్ వ్యాపారి పేరు మీద ఒక ఇన్వాయిస్ జారీ చేయవచ్చు. అప్పుడు ఆ ఇన్వాయిస్‌కు సంబంధించిన ట్యాక్స్ రిటైల్ వ్యాపారి తాను రిటర్న్స్‌లో చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, హోల్ సేల్ వ్యాపారి ఆ మొత్తానికి సంబంధించిన ఐటీసీ తీసుకోవచ్చు. అంటే, ఇక్కడ రిటైల్ వ్యాపారి అమ్మకందారుడు, హోల్ సేల్ వ్యాపారి కొనుగోలుదారుడిగా భావించాలి. సంబంధిత నియమ నిబంధనలను ఇద్దరూ పాటించాలి. అలాగే, ఇవే నిబంధనలు హోల్ సేల్ వ్యాపారి నుంచి కొనుగోలు చేసేటప్పుడు, తిరిగి వెనక్కు పంపేటప్పుడు వర్తిస్తాయి.**
---
**Another method in this process is for the person returning the goods, i.e., the retail dealer, to treat the returned goods as a sale and issue an invoice in the name of the wholesale dealer. In this case, the retail dealer must show the tax related to that invoice in their returns and pay it to the government, while the wholesale dealer can claim ITC for that amount. This means the retail dealer is considered the seller and the wholesale dealer as the buyer. Both must adhere to the relevant rules and regulations. Similarly, these same rules apply when purchasing from a wholesale dealer and returning goods.**
---
**ఇంకొక సాధారణ విషయం, సాధారణంగా రిటైల్ వ్యాపారులు రైతుల నుంచి సరుకుకు సంబంధించి ఆలస్యాన్ని బట్టి వడ్డీ వసూలు చేస్తుంటారు. ఇలాంటప్పుడు, ఆ వడ్డీ మీద కూడా పన్ను చెల్లించాలి. అంటే, ఆ సరుకుకు ఎంత శాతం పన్ను వర్తిస్తుందో, అంత శాతం ఈ వడ్డీ మీద కూడా చెల్లించాలి. ఈ నిబంధన కూడా కేవలం రిటైల్ వ్యాపారులకే కాకుండా, అమ్మిన సరుకుకు సంబంధించి వడ్డీ, పెనాల్టీ ఎవరైతే వసూలు చేస్తారో, వారందరికీ వర్తిస్తుంది.**
---
**Another common point is that retail dealers typically collect interest from farmers based on delayed payments for goods. In such cases, tax must also be paid on this interest. This means the same percentage of tax applicable to the goods also applies to this interest. This rule applies not only to retail dealers but to anyone who collects interest or penalties related to goods sold.**
---
**ముందుగా చెప్పినట్లు, ఈ వ్యాపారంలో ఉండే వారు జీఎస్టీ మీద సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా హోల్ సేల్ వ్యాపారులు, మండల, గ్రామీణ స్థాయిలో ఉండే వ్యాపారులకు సరైన అవగాహన కల్పిస్తే, ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.**
---
**As mentioned earlier, those involved in this business must gain proper understanding of GST. Specifically, if wholesale dealers provide adequate awareness to traders at the mandal and rural levels, it will prevent difficulties for both parties.**
---
**గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.**
---
**Note: Only some key points have been highlighted here for awareness purposes. For complete details, the relevant laws should be thoroughly examined.**
---
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
కామెంట్‌లు