Alerts

--------

27, మే 2020, బుధవారం

ఆంధ్రప్రదేశ్ లో ఏ సెట్ ఎప్పుడు | తేదీల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్-2020 ఆన్‌లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.
అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్‌కుమార్ మే 6న విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది. అయితే కరోనా, లాక్‌డౌన్‌లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,48,614 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్‌కు 1,69,137, అగ్రి,మెడికల్‌కు 78,959, రెండింటికీ 518 దరఖాస్తులు వచ్చాయి.

తాజా షెడ్యూళ్లు ఇలా

పరీక్ష

తేదీ

ఈసెట్

జూలై 24

ఐసెట్

జూలై 25

ఎంసెట్

జూలై 27 - 31 వరకు

పీజీసెట్

ఆగస్టు 2 - 4 వరకు

ఎడ్‌సెట్

ఆగస్టు 5

లాసెట్

ఆగస్టు 6

పీఈసెట్

ఆగస్టు 7- 9 వరకు (ఫీల్డ్ టెస్టు మాత్రమే)

NBPGR VACANCIEA | ఎన్‌బిపిజిఆర్ రిక్రూట్‌మెంట్

ఎన్‌బిపిజిఆర్ రిక్రూట్‌మెంట్ 2020 రీసెర్చ్ అసోసియేట్ III, ప్రాజెక్ట్ అసోసియేట్ I, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 12 పోస్టులు www.nbpgr.ernet.in చివరి తేదీ 15-06-2020



సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జన్యు వనరులు


మొత్తం ఖాళీల సంఖ్య: 12 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: రీసెర్చ్ అసోసియేట్ III, ప్రాజెక్ట్ అసోసియేట్ I, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్


విద్యా అర్హత: ఏదైనా డిగ్రీ, పిజి, పిహెచ్‌డి (సంబంధిత క్రమశిక్షణ)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 15-06-2020


వెబ్సైట్: http: //www.nbpgr.ernet.in



బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ | Bank of India Recruitment

బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2020 06 పోస్టులు bankofindia.co.in చివరి తేదీ 30 మే 2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: బ్యాంక్ ఆఫ్ ఇండియా


మొత్తం ఖాళీల సంఖ్య: 06 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. ఆఫీస్ అసిస్టెంట్ - 02

2. ఫ్యాకల్టీ సభ్యుడు - 03

3. అటెండర్ - 01

విద్యా అర్హత: 10 వ / గ్రాడ్యుయేషన్ డిగ్రీ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 30 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ 2020 మే 30 లోపు లేదా అంతకుముందు కింది చిరునామాకు సంబంధిత టెస్టిమోనియల్స్ (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) తో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి.

చిరునామా -బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొల్లాపూర్ జోనల్ ఆఫీస్, 1519 సి, జయధవాల్, బిల్డింగ్, లక్ష్మీపురి, కొల్లాపూర్.

వెబ్సైట్: https: //bankofindia.co.in


26, మే 2020, మంగళవారం

GEMINI TIMES హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 26-05-2020

ఈ నెల 13 వ తేదీన సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనంతపురం సర్వజానస్పత్రిలో డీఅడిక్షన్ సెంటర్ల్ లో వివిధ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులను అనంతపురం వెబ్ సైట్ లో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. అభ్యర్థులు అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తమ తెలియజేయాలన్నారు. www.ananthapuramu.ap.gov.in

రెండు నెలలుగా శ్రీవారి దర్శన భాగ్యంనోచుకోని భక్తులకు శ్రీవారి ప్రసాద వితరణ కోసం 20 వేల లడ్డూలను అనంతపురం జిల్లా రామచంద్రానగర్ లోని టిటిడి కళ్యాణ మండపంలో ఉదయం భక్తులకు విక్రయం జరిపారు, కాని మధ్యాహ్నం లోపే లడ్డూ ప్రసాదం అయిపోవడంతో మంగళవారం 10 వేల లడ్డూలను తెప్పిస్తున్నామన్నామని.

అనంతపురం డిపో నుండి ఇతర జిల్లాలకు ప్రతి రోజూ వెళ్ళే బస్సుల సమయం వివరాలు
విజయవాడకు - సాయంత్రం 6.30 లకు
నెల్లూరుకు - ఉదయం 6.30 లకు
తిరుపతి - ఉదయం 6.00 లకు, 7.30లకు
మదనపల్లి -ఉదయం 6.30 లకు, 7.00 లకు, 9.00లకు
ఆదోని -ఉదయం 7.30 లకు
కర్నూలు -ఉదయం 6.00 లకు, 7.00లకు, 10.00 లకు
కడప -ఉదయం 6.00 లకు, 7.00లకు, 8.00లకు
www.apsrtconline.in
దీని ప్రకారం మీప్రయాణానికి ప్రణాళికలు వేసుకోండి

భక్తుల మనోభావాలను గౌరవిస్తూ టీటీడి కి చెందిన 50 ఆస్తులను వేలం వేయాలని గత ప్రభుత్వం 2016 జనవరి 30వ తేదీన చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తున్నామని, ఈ విషయమై సోమవారం రాత్రి జిఎడీ ముఖ్యకారదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జోవో ఆర్ టి నెం 888 ను జారీ చేశారు.

కోవిడ్ -19 దృష్ట్యా పదవ తరగతి పరీక్ష హాలులో ఒక్కో గదికి  కేవలం 12 మంది విద్యార్థులను మాత్రమే పరిమితం చేస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పరీక్ష కేంద్రాల సంఖ్య 315 కు పెరిగాయి. ఇదే సందర్భంలో సి బి ఎస్ ఇ పరీక్షల కేంద్రాలు  15 వేలకు పెంచారు ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మనవి. గతంలో 3 వేల కేంద్రాలనుకున్నా ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యపడటంలేదు.

ఆంధ్రప్రదేశ్  పి ఇ సెట్ 2020 ఫిజికల్ ట్రైనర్ కోర్సు, ఈ పరీక్ష ద్వారా రెండు రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. బిపి ఇడి (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) మరొకటి డి పి ఇడి/యుజి డి పి ఇడి (అండర్ గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్).
రెండేళ్ళ బిపిఇడి కి అర్హతలు, ఏదైనా డిగ్రీ, ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వయసు జులై 1 2020 నాటికి 19 ఏళ్ళు నిండిఉండాలి.
రెండేళ్ళ డిపిఈడీ/యుజిడిపిఈడి కి అర్హతలు, ఇంటర్, ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులు, వయసు జులై 1 2020 నాటికి 16 ఏళ్ళు నిండిఉండాలి.

వ్రాత పరీక్ష ఉండదు కాని ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
https://sche.ap.gov.in/pecet


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్  డీఈఈసెట్ 2020 కోసం   దరఖాస్తులు
అర్హత:ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణ‌త
దరఖాస్తు : ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 05

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ లో ఉద్యోగాలు
అర్హత - బి ఇ / బి టెక్ / పీజి లో సైన్స్ / ఎకనామిక్స్/ఆపరేషన్స్ రీసెర్చ్) కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉండాలి
దరఖాస్తుకు చివరి తేది జూన్ 18
www.pngrb.gov.in

రీజినల్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ మెడికల్ సైన్సెస్ టెక్నీషియన్ ఉద్యోగాలు
ఖాళీలు 12
ఉద్యోగాలు - ఓటీ టెక్నీషియన్ 6, ల్యాబోరేటరీ టెక్నీషియన్ 6
అర్హత - ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
ఈ మెయిల్ ద్వారా దరఖస్తుకు చివరి తేది మే 27
rims.imphal@gov.in
www.rims.edu.in


 

ఎపి పిఇసెట్ 2020 వివరాలు వార్తా పత్రిక ద్వారా సేకరణ | APPECET INFORMATION FROM DAILY NEWS PAPER


ఎయిమ్స్ భోపాల్ రిక్రూట్మెంట్ 2020 | AIIMS Bhopal Recruitment

ఎయిమ్స్ భోపాల్ రిక్రూట్మెంట్ 2020 11 పోస్టులు 

తెలియదు / 7 రోజుల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భోపాల్


మొత్తం ఖాళీల సంఖ్య: 11 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. రక్త మార్పిడి అధికారి - 01

2. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ - 02

3. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 01

4. వైద్య భౌతిక శాస్త్రవేత్త - 02

5. అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ - 04

6. అకౌంట్స్ ఆఫీసర్ - 01

విద్యా అర్హత: బి.కామ్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా (పిఆర్ / కార్పొరేట్ కామన్ / జర్నలిజం / మాస్ కామన్) / ఎంఎస్సి / ఎండి / ఎంఎస్ / ఎంహెచ్ఏ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: లాక్డౌన్ ఎత్తిన తేదీ నుండి 02 వారాలు


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ http://www.aiimsbhopal.edu.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నింపిన తరువాత, అభ్యర్థి లాక్డౌన్ ఎత్తిన తేదీ నుండి 02 వారాల ముందు లేదా సంబంధిత కింది చిరునామాకు సంబంధిత టెస్టిమోనియల్స్ (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) తో పాటు హార్డ్ కాపీని పంపాలి..అడ్డ్రెస్-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (శ్రీ విశాల్ కుమార్ గుప్తా) 1 వ అంతస్తు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సాకేత్ నగర్ భోపాల్ (ఎంపి) -462020.

వెబ్సైట్: www.aiimsbhopal.edu.in



Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...