తిరుమల శ్రీవారి ^రథసప్తమి^ బ్రహ్మోత్సవం - 2021
తిరుమల శ్రీవారి ^రథసప్తమి^ బ్రహ్మోత్సవం ఈ నెల ఫిబ్రవరి 19వ తేదీన శుక్రవారం జరుగనుంది.,
కరోనా నిబంధనలను పాటిస్తూ.. తిరుమల తిరుపతిలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 వ తేదీన ఈ వేడుకలను నిర్వహించనున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు., ఆరోజున శ్రీవారు సప్తవాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మాడ వీధుల్లో వాహన సేవలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే గ్యాలరీలోకి అనుమతినివ్వనున్నామని టీటీడీ అధికారులు చెప్పారు...
ఇందులో భాగంగా ఉదయం 5.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు వివిద వాహనాలపై ఈ ఒక్కరోజు రథసప్తమి బ్రహ్మోత్సవంలో తిరుమాడ వీధులలో ఊరేగూతూ భక్తులకు (భక్తకోటీకీ) దర్శన భాగ్యం ఇస్తారు,. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి...
వాహనసేవల వివరాలు:-
[ఉదయం మధ్యాహ్నం సాయంత్రం` రాత్రి]
చక్రస్నానం కార్యక్రమాన్ని ఏకాంతగానే నిర్వహించనున్నామని తెలిపారు., రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు., ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీవారు ఊరేగనుండగా., ఉదయం 11 గంటలకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ ఉంటుంది., ఇక, మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.,. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం ఊరేగింపు., రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని తెలిపారు...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ^రథసప్తమి (ఒక్కోరోజు) బ్రహ్మోత్సవం^ ఫిబ్రవరి 19 వ తేదీన జరుగనున్నా సందర్భంలో కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, భక్తులకు, టిటిడి ఉద్యోగులకు ఈ వ్యాధి వ్యాపించకుండా నివారించేందుకు ఈ బ్రహ్మోత్సవాలను తగు జాగ్రత్తలు పాటిస్తూ తిరుమాడ వీధులో స్వామివారి వాహనసేవలు నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది...
గమనిక;-
శ్రీవారి భక్తులందరూ బ్రహ్మోత్సవాలు తిలకించేందుకై ప్రత్యక్ష ప్రసారాలు ^శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్^ [SVBC] Live మరియు యూట్యూబ్ (YouTube) Live ఈ ఛానెల్స్ ద్వారా మీరు తిలకిస్తూ శ్రీవారి 'రథసప్తమి' ఒక్కోరోజు^ బ్రహ్మోత్సవ వైభవనీ తిలకించండీ...
గోవింద హరి గోవిందా