ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు
తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్
సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. FCI Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | మార్చి 1, 2021 |
దరఖాస్తుకు ముగింపు తేది | మార్చి 31, 2021 |
అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేది | పరీక్షకు 10 రోజుల ముందు |
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది | మే / జూన్ 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ | 30 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్ ) | 27 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ ) | 22 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ( లా ) | 8 |
మెడికల్ ఆఫీసర్ | 2 |
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా జారీ అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 89 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
అసిస్టెంట్
జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగాలకు అప్లై చేయాలంటే
PG/ACA/AICWA/ACS/డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
Assistant
జనరల్ మేనేజర్ (టెక్నీషియన్ )విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే
అభ్యర్థులు బీ. ఎస్సీ (అగ్రికల్చర్ )/బీ. ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి
చేయవలెను.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సీఏ /కాస్ట్అకౌంట్స్ /సీఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.
అసిస్టెంట్
జనరల్ మేనేజర్ (లా ) విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
డిగ్రీ (లా ) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు సంబంధిత విభాగంలో
అనుభవం అవసరం.
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే
అభ్యర్థులు ఎం. బీ. బీ. ఎస్ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు అనుభవం అవసరం
అని ప్రకటనలో తెలిపారు.
మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
విభాగాలను అనుసరించి 28 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ ల అభ్యర్థులకు 3 మరియు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు:
ఓబీసీ
/ జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా
చెల్లించవలెను.మిగిలిన కేటగిరి అభ్యర్థులు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన
అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు విభాగాల ఉద్యోగాలను అనుసరించి నెలకు 60,000 రూపాయలు నుండి 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రముల ఎంపిక :
ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు ఈ క్రింది పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ | అమరావతి |
తెలంగాణ | హైదరాబాద్ |
Website
Notification
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x
మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS