28, మార్చి 2021, ఆదివారం

తిరుమల తిరుపతి సప్తగిరి మాసపత్రిక | TTD Sapthagiri Magazine

























































 

ఏపీ, ఐఎంఎస్‌డీలో 101 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది మార్చి 31..

విజయవాడలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఎంఎస్‌డీ).. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్‌(పొరుగుసేవల) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 101
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు–92, ల్యాబ్‌ టెక్నీషియన్‌–07, ఈసీజీ టెక్నీషి యన్‌–02.

స్టాఫ్‌ నర్సు: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 42ఏళ్లు మించ కూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌: అర్హత: పదో తరగతితోపాటు రెండేళ్ల డిప్లొమా(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.04. 2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

ఈసీజీ టెక్నీషియన్‌: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఆరు నెలలకు తగ్గకుండా ఈసీజీ ట్రెయినింగ్‌ కోర్సు పూర్తిచేయాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, కేశినేని వెంకయ్య నగర్, 100 ఫీట్‌ రోడ్‌ న్యూ ఆటోనగర్‌ రోడ్, ఎంకిపాడు, విజయవాడ–521108

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.labour.ap.gov.in

విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌లో డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు...దరఖాస్తులకు చివరితేది ఏప్రిల్‌ 09....

విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ఇంజనీర్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు...
డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

డేటా ఎంట్రీ పోస్టులు: 08
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ లేదా బ్యాచిలర్‌ఆఫ్‌ కంప్యూటర్స్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 09, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌https://vizagport.com/wp-content/uploads/2021/03/Dy.CME-Corrigendum.pdf   (or)
https://vizagport.com/wp-content/uploads/2021/03/Publication-of-Data-Entry-posts-8-Nos..pdf

502 పోస్టులకు... మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌–2021 నోటిఫికేషన్

 భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్‌వైజర్‌ (బ్యారక్‌ స్టోర్‌), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్‌ నోటిఫికేషన్‌–2021 విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Jobsవివరాలు:
పోస్టుల సంఖ్య: 502
ఎంఈఎస్‌–2021 నోటిఫికేషన్‌ ద్వారా మిలిటరీ ఇంజనీర్‌ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్‌వైజర్‌ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:
  • డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్‌ జిరాక్స్, ప్రింటింగ్‌ అండ్‌ లామినేషన్ మెషీన్ పై ఏడాది కాలం అనుభవం అవసరం.
  • సూపర్‌వైజర్‌ పోస్టులకు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్‌ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్‌/కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ తోపాటు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/వేర్‌ హౌసింగ్‌ మేనేజ్‌మెంట్‌/ పర్చేజ్‌/లాజిస్టిక్స్‌/ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో డిప్లొమా, స్టోర్స్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.

వేతనం: సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్ గా ఎంపికైనవారు పే లెవెల్‌–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2021.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)
రాత పరీక్ష తేది: మే 16, 2021.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.mesgovonline.com/mesdmsk

వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో 15 ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 6

ఆంధ్రప్రదేశ్‌లోని భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ వ్యాపకోస్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌ (సివిల్, మెకానికల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్‌)–03, ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ స్పెషలిస్ట్‌–01, ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌–01, మేనేజర్‌ (సివిల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్, జీఐఎస్‌)–05, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎల్‌ఏ–ఆర్‌ఆర్, ఫైనాన్స్‌)–03, అమిన్స్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: wapcos.recruitmentcell@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 6, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.wapcos.gov.in