Alerts

Loading alerts...

11, సెప్టెంబర్ 2021, శనివారం

Doordarshan: దూరదర్శన్ హైదరాబాద్‌లో స్ట్రింగర్‌ పోస్టులు


స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్య ర్థుల నుంచి హైదరా బాద్‌లోని దూరదర్శన్‌ కేంద్ర ప్రాంతీయ విభా గం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Doordarshan
దూరదర్శ హైదరాబాద్‌లో స్ట్రింగర్‌ పోస్టులు

ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుంచి రెండేళ్లపాటు కొనసాగుతారని వెల్లడించింది. వ్యవధి పూర్తైన ప్రస్తుత స్ట్రింగర్‌లు కూడా ఈ కొత్త ఎంపా నెల్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసు కోవాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ దరఖా స్తులను సెప్టెంబర్‌ 30లోపు హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని దూరదర్శన్‌ కేంద్రానికి పోస్ట్‌ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చని పేర్కొంది. స్ట్రింగర్ల ఎంపికకు కావాల్సిన విద్యార్హత, అనుభవం, ఎంపిక విధానంతో పాటు పూర్తి వివరాలకుhttp://prasarbharati.gov.in/pbvacancies వెబ్‌ సైట్‌ చూడాలని సూచించింది.

Free Coaching: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌: కేంద్ర ప్రభుత్వం

స్కీం ఫర్‌ ఫ్రీ కోచింగ్‌.. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యల కారణంగా పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకోలేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. స్కీమ్‌ ఫర్‌ ఫ్రీ కోచింగ్‌ ద్వారా భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికార విభాగం(డీఓఎస్‌జేఈ)..ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు అవసరమైన శిక్షణకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌ వి«ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం సీట్ల సంఖ్య: 1500
అర్హత: ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ, ఓబీసీ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.

వీటికే ఉచిత కోచింగ్‌
ఉద్యోగ పరీక్షలు: యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ ఎ,బీ స్థాయి ఉద్యోగాలు, ఎస్‌ఎస్‌బీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఆర్‌ఆర్‌బీ) చేపట్టే నియామకాలు, రాష్ట స్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ సంస్థలు చేపట్టే ఆఫీసర్‌ స్థాయి కొలువులకు సంబంధించిన పరీక్షల కోచింగ్‌కు ఫీజు చెల్లిస్తారు.
ఎంట్రన్స్‌ టెస్టులు: ఐఐటీ జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్, సీడీఎస్, ఎన్‌డీఏ, జీఆర్‌ఈ, శాట్, జీమ్యాట్, టోఫెల్‌ లాంటి ఎంట్రన్స్‌ టెస్టులకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణకు అవసరమైన  ఫీజు చెల్లిస్తారు.

స్టయిపెండ్‌
స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.3000, దూర ప్రాంత విద్యార్థులకు నెలకు రూ.6000, దివ్యాంగులకు నెలకు రూ.2000 అదనంగా స్టయిపెండ్‌ అందిస్తారు. 

రెండు విధాలుగా అమలు

  • ఈ స్కీమును రెండు విధాలుగా అమలు చేస్తారు. మొదటగా గుర్తింపు పొందిన కోచింగ్‌ సెంటర్లుల/ఇన్‌స్టిట్యూట్లకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఇన్‌స్టిట్యూట్‌లే అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తాయి.  
  • రెండో విధానంలో సంబంధిత మంత్రిత్వ శాఖ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇష్టమైన కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది.
  • ఆయా కోచింగ్‌లకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 10, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.coaching.dosje.gov.inernet

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...