Alerts

Loading alerts...

17, అక్టోబర్ 2021, ఆదివారం

Ananthapur | Chittoor | Cuddappah | Kurnool District Classifieds 17-10-2021










Gemini Internet

WhatsApp Loan: మీకు డబ్బు అవసరం పడిందా.. వాట్సప్‌లో హాయ్ అని చెప్పండి.. పదిలక్షల వరకూ లోన్ పొందండి!

స్పందించే ముందు జాగ్రత్త వహించండి  

టెక్నాలజీ పెరిగిన తరువాత రుణాలు పొందడం కూడా సులభంగా మారిపోయింది. ఇప్పుడు ఎన్నో యాప్‌లు రుణాలు ఇవ్వడానికి అందుబాటులో ఉన్నాయి. వాట్సప్‌లో హాయ్ అని చెబితే చాలు మీకు రుణం ఇస్తామంతోంది ఓ సంస్థ ఎలానో తెలుసుకుందాం. 

Business Loan: మీకు రూ.10 లక్షల వరకు రుణం అవసరమైతే, ఇది మీ కోసం కొన్ని నిమిషాల పని. మీరు వాట్సప్ (WhatsApp) లో హాయ్ చెప్పాలి. మీకు రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది.

మొదటిసారి అలాంటి సదుపాయం

భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఇటువంటి సదుపాయాన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) ఇండియా ఇన్ఫోలిన్ (IIFL) ప్రారంభించింది. 10 లక్షల వ్యాపార రుణం వెంటనే ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. మీరు వాట్సప్ (WhatsApp)లో ఈ లోన్ పొందుతారు. కంపెనీ ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు ఈ రుణాన్ని కొన్ని నిమిషాల్లో పొందవచ్చు.

కనీస పత్రాలు అవసరం

దేశంలో ఈ పథకాన్ని ప్రారంభించిన మొదటి కంపెనీ ఐఐఎఫ్ఎల్ అని కంపెనీ తెలిపింది. దీని కోసం కనీస పత్రాలు అవసరం. ఈ రుణం కోసం కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) ని ఉపయోగిస్తుంది. దీని ద్వారా, వినియోగదారుల వివరాలు తనిఖీ చేయబడతాయి. దీని ద్వారా రుణగ్రహీత యొక్క దరఖాస్తు .. KYC మాత్రమే పూర్తి చేయబడతాయి. దీనితో పాటు, బ్యాంక్ ఖాతా కూడా దీని ద్వారా ధృవీకరించబడుతుంది.

కనీసం 10 వేల రూపాయల రుణం

ఈ పథకం కింద, మీరు కనీసం 10 వేలు మరియు గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. మీరు ఈ రుణాన్ని 5 సంవత్సరాలలో అంటే 60 నెలల్లో తిరిగి చెల్లించాలి. మీ లోన్ మొత్తం 24 గంటల్లోపు మీ అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ లోన్ 10 నిమిషాల్లో ఆమోదం పొందుతుంది.

ఈ నంబర్‌లో వాట్సప్ చేయండి

రుణం తీసుకోవడానికి, మీరు 9019702184 లో WhatsApp ద్వారా హాయ్ చెప్పాలి. ఈ వాట్సాప్ నంబర్ IIFL ఫైనాన్స్. దీని తర్వాత మీకు కంపెనీ నుండి స్వాగత సందేశం వస్తుంది. ఇందులో, బిజినెస్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి అలాగే, అలర్ట్ అందుకోవడం గురించి మిమ్మల్ని అడుగుతారు.

ఆర్టిఫిషియల్ బాట్ సమాచారం అడుగుతుంది

ఆర్టిఫిషియల్ బాట్ కొంత సమాచారం కోసం మిమ్మల్ని అడుగుతుంది. ఇందులో మీ పేరు, వ్యాపారం మీదేనా లేదా భాగస్వామ్యంలో నడుస్తుందా? అప్పుడు మీరు వ్యాపారం యొక్క టర్నోవర్. అది ఎంతకాలం నడుస్తోంది అనే సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అన్ని వివరాలను ఇచ్చిన తర్వాత, మీ వివరాలను నిర్ధారించమని బాట్ మిమ్మల్ని అడుగుతుంది. దీని తర్వాత మీ క్రెడిట్ చరిత్ర తనిఖీ చేస్తుంది.

వివరాలు నిర్ధారించిన తరువాత..

మీ వివరాలను నిర్ధారించిన తర్వాత, ఐఐఎఫ్ఎల్ మీ క్రెడిట్ చరిత్రను ఒటీపీ ద్వారా ధృవీకరిస్తుంది. ధృవీకరణ తర్వాత, మీకు రుణ మొత్తం అందిస్తారు. ఇందులో, రుణ మొత్తం, వడ్డీ, నెలవారీ వాయిదాల గురించి సమాచారం ఇస్టారు. తుది రుణ మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత, మీరు మీ బ్యాంక్ మరియు IFSC కోడ్‌ను అందించాలి. దీని తరువాత రుణ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది. మీరు రూ. 8.11 లక్షలు రుణం తీసుకుంటే, మీ నెలవారీ వాయిదా రూ .23,333 అవుతుంది. అంటే, మీరు ఏటా 24% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

 

16, అక్టోబర్ 2021, శనివారం

BEL Recruitment 2021: 'బెల్'లో ఉద్యోగాలు.. జీతం రూ.50,000.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

BEL Recruitment 2021: పంచకులలో ఉన్న భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharath Electronics Limite) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BEL Recruitment 2021: బెల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50,000.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. 

652 BEL Recruitment 2021: పంచకులలో ఉన్న భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharath Electronics Limite) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా 88 ప్రాజెక్ట్ ఇంజనీర్, 11 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.25,000 జీతం నుంచి రూ.50,000 జీతం ఉంటుంది. పోస్టులకు ఇంజనీరింగ్ విద్యార్ధులు అర్హులు. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 27, 2021. పూర్తి సమాచారం కొరకు వెబ్సైట్ https://www.bel-india.in/Default.aspx ను సందర్శించాలి. ముఖ్యమైన సమాచారం.. ప్రాజెక్ట్ ఇంజనీర్ : బీఈ/బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. మొదటి సంవత్సరం వేతనం రూ.35,000/- , రెండో సంవత్సరం వేతనం రూ.40,000/-, మూడో సంవత్సరం వేతనం రూ.45,000/-, నాలుగో సంవత్సరం వేతనం రూ.50,000/- ట్రైనీ ఇంజనీర్ : బీఈ/బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. మొదటి సంవత్సరం వేతనం రూ.25,000/- ,  

రెండో సంవత్సరం వేతనం రూ.28,000/-, 

 మూడో సంవత్సరం వేతనం రూ.31,000/-  

దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 6, 2021 

 దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 27, 2021 

 దరఖాస్తు ఫీజు : ప్రాజెక్టు ఇంజనీర్ రూ.500, ట్రైనీ ఇంజనీర్ రూ.200 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి పరీక్ష ఫీజు లేదు ఎంపిక ప్రక్రియ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  

అభ్యర్ధుల అకడమిక్ సామర్ధ్యం, అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అకడమిక్ మార్కులు 75 శాతం ఉండాలి. అనుభవానికి 10 శాతం మార్కులు, ఇంటర్వ్యూకి 15 శాతం మార్కులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ.. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.  

ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.bel-india.in/Default.aspx ను సందర్శించాలి. అనంతరం Careerలో రిక్రూట్మెంట్ విభాగంలోకి వెళ్లాలి. అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. తరువాత అప్లై ఆన్లైన్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి.

 

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...