అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
20, అక్టోబర్ 2021, బుధవారం
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. 2500 ఖాళీల భర్తీతో భారీ నోటిఫికేషన్..
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను..
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్ భాగంగా ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోలజీ / కంప్యూటర్ సైన్స్‌లో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.
* శిక్షణా కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..
19, అక్టోబర్ 2021, మంగళవారం
Sainik School Admissions 2021: నాణ్యమైన విద్యకు చిరునామా.. సైనిక్‌స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తు వివరాలు, పరీక్ష విధానం
నాణ్యమైన విద్యాకు చిరునామా సైనిక్ స్కూల్స్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుకు అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification)
విడుదల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా ఆరోతరగతి,
తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష
నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5,
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ
సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ
అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష (Entrance Test)
జనవరి 9, 2022న నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు ( Exam Fee)
నోటిఫికేషన్, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.
ముఖ్య సమాచారం ..
| దరఖాస్తు ప్రారంభం | సెప్టెంబర్ 27, 2021 |
| దరఖాస్తకు చివరి తేదీ | అక్టోబర్ 26, 2021 |
| సవరణలకు అవకాశం | అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021 |
| పరీక్ష ఫీజు | రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 |
| పరీక్ష తేదీ | జనవరి 9, 2022 |
| పరీక్ష సమయం | ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు |
| అధికారిక వెబ్‌సైట్ | https://aissee.nta.nic.in/ www.nta.ac.in |
ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
ఆరోతరగతి ప్రవేశాలకు పరీక్ష విధానం..
| టాపిక్ | ప్రశ్నల సంఖ్య | ప్రతీ ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కులు |
| మ్యాథమెటిక్స్ | 50 | 3 | 150 |
| ఇంటలిజెన్స్ | 25 | 2 | 50 |
| లాగ్వేజ్ | 25 | 2 | 50 |
| జనరల్ నాలెడ్జ్ | 25 | 2 | 50 |
| మొత్తం | 125 | 300 |
తొమ్మిదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానం..
| టాపిక్ | ప్రశ్నల సంఖ్య | ప్రతీ ప్రశ్నకు మార్కులు | మొత్తం మార్కులు |
| మ్యాథమెటిక్స్ | 50 | 4 | 200 |
| ఇంటలిజెన్స్ | 25 | 2 | 50 |
| లాగ్వేజ్ | 25 | 2 | 50 |
| జనరల్ సైన్స్ | 25 | 2 | 50 |
| సోషల్ సైన్స్ | 25 | 2 | 50 |
| మొత్తం | 150 | 500 |
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం అధికారిక బ్రౌచర్‌ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : అప్లికేషన్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సరిగా ఇవ్వాలి.
Step 5 : జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.
Step 6 : విద్యార్హత సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధిత సర్టిఫికెట్లను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి.
SSC Recruitment 2021 : పది, ఇంటర్ విద్యార్థులకు మంచి అవకాశం.. ఎస్ఎస్‌సీలో 1,775 పోస్టులు
SSC Recruitment 2021 : పది, ఇంటర్ విద్యార్థులకు మంచి అవకాశం.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో పది, ఇంటర్ విద్యార్హతతో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి. వాటి దరఖాస్తుకు అక్టోబర్ 25 వరకు అవకాశం ఉంది.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఎస్ఎస్‌సీ ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ
చేయనున్నారు. ఈ పోస్టులలో పది, ఇంటర్ (Inter) విద్యార్హతతో
ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 25,
2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు అనంతరం ఫీజు (Fee) చెల్లించేందుకు
అక్టోబర్ 28, 2021 రాత్రి 11.30 వరకు అవకాశం ఉంది. బ్యాంక్ ద్వారా
చలాన్ (Bank challan) రూపంలో ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1, 2021 వరకు
అవకాశం ఉంది. పోస్టుల ఎంపిక పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష
జనవరి 2022 లేదా ఫిబ్రబరి 2022లో జరిగే అవకాశం ఉంది. దరఖాస్తు
ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదీలు విడుదల చేస్తారు. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
ఎంపిక విధానం..
Step
1 : ఈ పోస్టుల భర్తీకి ప్రాథమికంగా కంప్యూటర్ బెస్డ్ (Computer Based
Exam) పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం - 60 నిమిషాలు
Step 2
: ఇది అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్రశ్నలను కలిగి ఉంటుంది.
అయితే పోస్టును బట్టి విద్యార్హతను బట్టి మూడు పరీక్షల వరకు
నిర్వహించే అవకాశం ఉంది.
Step 4 : పరీక్ష ఉత్తీర్ణులైన వారిని నైపుణ్య (Skill) పరీక్షకు పిలుస్తారు. ఎంపిక విధానంలో దరఖాస్తు చేసుకొన్న పోస్టుల ఆధారంగా ఉంటుంది.
పరీక్ష విధానం
| సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
| జనరల్ ఇంటలిజన్స్ | 25 | 50 |
| జనరల్ అవెర్నెస్ | 25 | 50 |
| క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్ | 25 | 50 |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 25 | 50 |
విద్యార్హత, వయోపరిమితి..
విద్యార్హతలు పోస్టుల వారీగా మారుతూ ఉంటుంది. పదోతరగతి ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలు, 12వ తరగతి ఉత్తీర్ణతతో కొన్న ఉద్యోగాలు ఉండగా పలు పోస్టులకు గరిష్ట విద్యార్హత గ్రాడ్యుయేషన్‌గా ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హత కనీస వయసు 18 సంత్సరాలు ఉంది. చాలా పోస్టులకు గరిష్ట వయసు 30 ఏళ్లుగా ఉంది. అయితే రిజర్వేషన్‌ల ప్రకారం ఆయా విభాగాల వారీకి వయోపరిమిత (Age Limit) సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం..
Step 1: దరఖాస్తు ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది.
Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించాలి.
Step 3: అందులో NOTICES లోకి వెళ్లి. OTHERS విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. అనంతరం హోం పేజీకి వచ్చి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: మొదట వన్‌టైం రిజస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 5: అభ్యర్థి ప్రాథమిక విద్యార్హత, పాస్‌పోర్టు ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫాం సబ్‌మిట్ చేయాలి.
Step 6: ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థికి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ వస్తాయి.
Step 7: రెండో భాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
Step 8: అనంతరం ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి సమాచారం , ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.
Step 9: పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాటగిరీ అభ్యర్థులకు, మహిళలకు పరీక్ష ఫీజు లేదు.
Microsoft Internship 2021: డిగ్రీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో వర్చువల్ ఇంటర్న్‌షిప్... రేపే లాస్ట్ డేట్
Microsoft Internship 2021 | డిగ్రీ చదువుతున్నవారికి, డిగ్రీ పాస్ అయినవారికి ఇంటర్న్‌షిప్ (Internship) అవకాశం ఇస్తోంది మైక్రోసాఫ్ట్. 85000 మంది వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు అందుకు తగ్గట్టుగా సిద్ధం కావడానికి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. విద్యార్థుల కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్‌ను గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండో బ్యాచ్ ద్వారా 85,000 మంది విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తోంది.
ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్ మొత్తం 8 వారాలు ఉంటుంది. 2021 లో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులతో పాటు రాబోయే రెండేళ్లలో ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు ఈ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. అంటే 2022, 2023లో డిగ్రీ పాస్ అయ్యేవారు కూడా అప్లై చేయొచ్చు. ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 8 వారాలపాటు అంకితభావంతో పూర్తి సమయం కేటాయించి ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలి.
ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఇందులోనే 100 డాలర్ల విలువైన అజ్యూర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్కౌంటెడ్ సర్టిఫికేషన్స్ కూడా లభిస్తాయి. 8 వారాల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కెరీర్ సపోర్ట్ సేవలు కూడా పొందొచ్చు. మొత్తం 190 గంటల లెర్నింగ్ సెషన్స్, ఆన్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి.
ఆసక్తిగల విద్యార్థులు ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. విద్యాసంస్థ పేరు, స్టూడెంట్ ఐడీ, విద్యార్థి పేరు, ఊరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి. విద్యార్థుల మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ప్యూచర్ రెడీ కోర్సుల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...















































