అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ (ఎన్ టీఏ) నవంబర్ 1 న విడుదల చేసింది.
నీట్ ఫలితాలు, కటాఫ్ సమాచారం
తెలంగాణకు
చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా,
మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్
సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం
విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ
స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా
జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో
మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ,
దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్
కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ
ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన
సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్
టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్‌లకు ర్యాంక్ కార్డులను పంపింది.
720కి 720 మార్కులు సాధించింది వీరే..
తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు
వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్ టీఏ ప్రకటించింది. 720
మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి,
ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్
ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది
సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది
నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది..
అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత
సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత
సాధించినట్లు ఎన్ టీఏ తెలిపింది. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్ టీ ఏ విడుదల చేసింది.
కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు
అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్‌మర్ తదితర
సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కలి్పస్తారు.
ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు..
గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది.
గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700
మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు
ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచి్చనవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది
మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180
మాత్రమే రాసే అవకాశం కలి్పంచారు.
రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు
ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో
కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010
ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే..
ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15
శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం
సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో
140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు
ఉన్నాయి.
15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్
నీట్‌లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50
పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా
నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ
అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు
వర్తిస్తాయి.
అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్
కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్
ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను
నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్‌లో
భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా
రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య
కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్
సరీ్వసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్
ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు
ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు
https://www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్ టీఏ విజ్ఞప్తి
చేసింది.
ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో
ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి.
ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా
కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్ ఆర్‌ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు.
AP EAPCET 2021-22 సంవత్సరానికి
సంబందించి ఎవరైతే weboptions పెడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా తెలుసుకోవలసినవి
1.వెబ్
ఆప్షన్స్ పెట్టాడానికి ముందు కాలేజ్ కోడ్స్, కోర్సు కోడ్ లను జాగ్రత్త ఒక పేపరు లో
వ్రాసుకుని వెబ్ ఆప్షన్స్ ను ఫిలప్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొని కొత్త కోర్సులకు విద్యార్థులు
ఆసక్తి చూపుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు, సన్నిహితులు, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రద్ద
తీసుకుని కోర్సు అలాగే నచ్చిన కాలేజీ కోడ్ లను వరుస క్రమంలో వ్రాసుకోవాలని మనవి.
2.ఇంజీనీరింగ్
లో ఎవరైనా ఫోన్ నెంబరు పోగొట్టుకున్నా లేదా ఫోన్ నెంబరు తప్పుగా ఎంటర్ చేసి OTP లు
రాకపోతే అలాంటి వారు మీకు సంబందించిన Help Line Centerను సందర్శించండి.
3.ఇప్పుడు
చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి, విద్యార్థులు ఖచ్చితంగా కంప్యూటర్లు వాడాలి సెల్ ఫోన్ లో చేయడానికి ప్రయత్నించకండి.
మీరు
ఆప్షన్స్ పెట్టినతరువాత Freeze ఆప్షన్ పనిచేయకపోతే వేరొక బ్రౌజర్ లో చేయడం ద్వారా మీ
ఆప్షన్లను ఫ్రీజ్ చేయవచ్చు.
నిజానికి
ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రస్తుత బ్రౌజర్లో options సేవ్ చేసిన తరువాత
successfully saved అని వచ్చి do you want to block this message prompt అనే ఆప్షన్
ను క్లిక్ చేసి ఉండడం వల్ల ఇది జరుగుతుంది.
క్రింద
ఉన్న స్క్రీన్ షాట్ లలో weboption ప్రక్రియను చూడవచ్చు.
Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.
వెబ్ ఆప్షన్ల
ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 5వ తేదీ వరకు ఆప్షన్లను
నమోదు చేయవచ్చు. నవంబర్ 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. నవంబర్ 10వ తేదీన
తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్ లైన్ లో
సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో నవంబర్ 15వ తేదీలోపు
చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఏపీఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ
కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ రోజు (నవంబర్ 2న) ప్రారంభం అయింది.
Gemini Internet
వెబ్ కౌన్సెలింగ్కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం
నవంబర్ 1న ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల
కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని
35 శాతం సీట్లు కూడా కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22
విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ
సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో
ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ),
మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి.
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి
కౌన్సెలింగ్లో ఉన్నాయి.
నవంబర్ 2 నుంచి వెబ్ ఆప్షన్లు
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 5వ తేదీ
వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. నవంబర్ 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు.
నవంబర్ 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన
విద్యార్ధులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత
కాలేజీల్లో నవంబర్ 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు
ప్రారంభమవుతాయి.
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ
నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు
ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా
కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ
చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని
భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన
ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో
నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన
అభ్యర్థులకు నిపుణుల సలహాలు..
జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది
అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు
ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు
చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450
మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు
సూచిస్తున్నారు.
450 కంటే ఎక్కువ
నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450
కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర
స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై
దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా
ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్
సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది.
కౌన్సెలింగ్‌కు సన్నద్ధం
నీట్‌లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు..
కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల
ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల
ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను
వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి.
ముందుగా ఆల్ ఇండియా కోటా
ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు
విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్
జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్
కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి
స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర
విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు
కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు
6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ
సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే
అవకాశముంది.
రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్
ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు
నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా
కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి
కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్,
సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం
ఖరారు చేస్తారు.
కాలేజ్ ఎంపిక
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్‌లో
మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో
చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్‌మర్
వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఆల్ ఇండియా కోటా
కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన
ఇన్‌స్టిట్యూట్‌లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి.
ప్రత్యామ్నాయ మార్గాలు
నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు..
ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో
ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో
కోర్సులను ఎంచుకోవచ్చు.
ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి
ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్,
యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే..
డాక్టర్ కల సాకారం అవుతుంది.
ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ
చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన
తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో
కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను
చేపడతాయి.
బీహెచ్‌ఎంఎస్
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్‌ఎంఎస్).గత
కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్‌ఎంఎస్
పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య
విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి
వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో
ఉంది.
బీఏఎంఎస్
మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం..
బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ
కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్,
జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు
కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత
విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు.
యునానీ (బీయూఎంఎస్)
ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్
యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో
మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది.
బీఎన్‌వైఎస్
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ
విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి
చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స
చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక
కళాశాలలో అందుబాటులో ఉంది.
బీవీఎస్‌సీ
బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్
వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్‌సీ). ఈ కోర్సు ద్వారా..
జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం
లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక
శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో
అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ,
తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు
అందుబాటులో ఉంది.
అగ్రికల్చర్ బీఎస్సీ
బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ.
వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి
నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు
రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి.
ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి
ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు
దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్
యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ)
పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
హార్టికల్చర్ సైన్స్
బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి
స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు
లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్
ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా
లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో
డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు
అందుబాటులో ఉంది.
బీఎఫ్‌ఎస్సీ
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్‌ఎస్‌సీ. బైపీసీ
విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు
పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన
ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
ఇతర కోర్సులు కూడా
బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ,
బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి
కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది.
నీట్–2021– ముఖ్యాంశాలు
జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు.
నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్,
ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి
నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు
విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా
చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్
🕉 TTD News ™ తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాల్లో నవంబరు 4వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
🕉 శరీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి ★ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ◆ అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.
🕉 శరీ కోదండరామస్వామివారి ఆలయంలో….
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు దీపావళి ఆస్థానం నిర్వహించారు.
★ దీపావళి సందర్భంగా గురువారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
🕉 నవంబరు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం :
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు 2న ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
👉 శరీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరు 2న ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
👉 ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. *Dept.Of PRO TTD*
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షలు వరకు
రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణం కోసం ఎస్‌బీఐ బ్యాంక్ ద్వారా
కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు సహాయం చేయడం కోసం
ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తుంది. రైతు తన వ్యవసాయానికి
సంబంధించిన ఖర్చుల కోసం ఈ కార్డు సహాయంతో రుణం సులభంగా తీసుకోవచ్చు. ఇది
చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం
అందిస్తుంది. ఈ కార్డు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ తరహాలోనే ఇది ఉంటుంది.
ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటును అందిస్తుంది.
ఈ కార్డు వ్యవది 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్షకు లోబడి మీ కార్డు పరిమితి 10% పెరుగుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు రూ.3 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
తిరిగి చెల్లించే వ్యవధి పంట కాలం(స్వల్ప/దీర్ఘం), పంట మార్కెటింగ్ పీరియడ్ పై ఆధారపడి ఉంటుంది.
45 రోజులకు ఒకసారి కార్డు యాక్టివేట్ చేసినట్లయితే, బ్యాంకు రూపే కార్డుల మాదిరిగా మీకు రూ. 1 లక్ష బీమా లభిస్తుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
రైతులు/వ్యక్తులు/ఉమ్మడి రుణగ్రహీతలు, యజమాని సాగుదారులు, కౌలు రైతులు,
నోటి లెస్సీలు, షేర్ క్రాపర్లు అందరూ కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు
చేసుకోవచ్చు. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు మొదలైన వాటితో సహా రైతుల స్వయం
సహాయక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా వర్తిస్తాయి. రూ.3 లక్షల
వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంటుంది. 70 సంవత్సరాల కంటే
తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద
బీమా పథకం(పీఎఐఎస్) కింద కవర్ చేయబడతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి
ఫసల్ బీమా యోజన(పిఎమ్ఎఫ్ బివై) కింద కవర్ అవుతాయి.