Alerts

--------

11, నవంబర్ 2021, గురువారం

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలకోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ..

Gemini Internet

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా స్కీమ్‌లను రూపొందించింది పోస్టల్‌ శాఖ. ఆర్థికంగా ఎదిగేందుకు పలు రకాల స్కీమ్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్టు చేసే సదుపాయం ఉంది. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రతి నెలా డబ్బులు పెడుతూనే ఉండాలి.

స్కీమ్‌ గడువు ఐదేళ్లు:

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకోసారి మీ ఖాతాలో జమ అవుతూనే వస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే ఒకవేళ వడ్డీ రేటు తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చు. లేదంటే అలానే స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరితే నెలకు 10 వేల రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఐదు సంవత్సరాల తర్వాత 7 లక్షల రూపాయల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. ఖచ్చితమైన లాభం వస్తుంది తప్ప.. రిస్క్‌ అనేది ఉండదు. ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తిగానీ, ముగ్గురు కలిపి కూడా ఉమ్మడి ఖాతాగా తీసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే మైనర్ల పేరు మీద కూడా ఖాతా ఓపెన్‌ చేసి పెట్టుబడి పెట్టువచ్చు. కనీసం 10 సంవత్సరాలపైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

ఉదాహారణకు చెప్పాలంటే.. మీరు 1 నుంచి 15వ తేదీ మధ్యలో అకౌంట్‌ ఓపెన్‌ చేసినట్లయితే ప్రతి నెల 15వ తేదీ లోపు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అలాగే 15వ తేదీ తర్వాత ఖాతా తీసినట్లయితే ప్రతి నెల చివరి దినం వరకు మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. గడువులోగా మొత్తాన్ని జమ చేయనట్లయితే కొంత పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే కొంత మినహాయింపు కూడా ఉంటుంది. మీరు ఆరు నెలల పాటు అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే నెలవారీ ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఎవరైనా ప్రతి నెల డిపాజిట్‌ చేస్తే ఆరు నెలల పాటు అతను రూ.6000కు బదులు రూ.5900 మాత్రమే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం మొత్తం డిపాజిట్‌ చేస్తే ఈతనికి నెలవారీ ప్రీమియంలో 40 శాతం వరకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక సంవత్సరానికి మొత్తం డిపాజిట్‌ రూ.12,000కు బదులు రూ.11,600 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్‌ మొత్తం రుణ సదుపాయం:

ఇక రుణ సదుపాయం విషయానికొస్తే.. డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం రుణం పొందే అవకాశం ఉంటుంది. ఏడాది తర్వాత డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందవచ్చు. దానిని వివిధ వాయిదాల రూపంలో కూడా తిరిగి చెల్లించి సౌకర్యం ఉంటుంది. రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీపై వడ్డీ రేటు 2 శాతం వీడిగా ఉంటుంది. ఇక కాలిక్యులేటర్‌ ప్రకారం.. మీరు ప్రతి నెలా రూ.10 వేలు ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసినట్లయితే ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ రేటుతో, మెచ్యూరిటీపై మొత్తం రూ.69,6967 అవుతుంది. 5 ఏళ్లలో డిపాజిట్‌ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ మొత్తం రూ.99967 అవుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ వివరాలన్ని వివిధ వెబ్‌సైట్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు స్కీమ్‌లో చేరి డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదిస్తే పూర్తి వివరాలు అందజేస్తారు.

 

 

CIIL రిక్రూట్‌మెంట్ 2021 రిసోర్స్ పర్సన్ – 6 పోస్టులు www.ciil.org చివరి తేదీ 14-11-2021

Name of Organization Or Company Name :Central Institute of Indian Languages

Total No of vacancies:– 6 Posts

Job Role Or Post Name:Resource Person 

Educational Qualification:MA/ MLISc(Relevant Discipline)

Who Can Apply:All India

Last Date:14-11-2021

Website: www.ciil.org

Click here for Official Notification


బోస్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ 2021 ప్రాజెక్ట్ అసోసియేట్ II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, మాస్టర్ ట్రైనర్ – 8 పోస్టులు www.jcbose.ac.in చివరి తేదీ 24-11-2021

Name of Organization Or Company Name :Bose Institute

Total No of vacancies: – 8 Posts

Job Role Or Post Name:Project Associate II, Administrative Assistant, Project Assistant, Master Trainer 

Educational Qualification:Secondary, B.Sc,/ B.Com, M.Sc (Relevant Discipline)

Who Can Apply:All India

Last Date:24-11-2021

Website: www.jcbose.ac.in

Click here for Official Notification


నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ రిక్రూట్‌మెంట్ 2021 సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ – 10 పోస్ట్‌లు ncpor.res.in చివరి తేదీ 15-11-2021


Name of Organization Or Company Name :National Centre for Polar & Ocean Research


Total No of vacancies:– 10 Posts


Job Role Or Post Name:Senior Consultant, Consultant 


Educational Qualification:Degree (Engg), Any Degree, PG (Science)


Who Can Apply:All India


Last Date:15-11-2021


Website: ncpor.res.in


Click here for Official Notification


cfw ap nic in MLHP Recruitment Zone wise Provisional Merit List

nrhm

Gemini Internet

MLHP RECRUITMENT ZONE-1 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-2 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-3 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-4 PROVISIONAL MERIT LIST.

 

TTD UPDATE

🕉 *తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం*
        ➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
        నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

🕉 పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. 👉ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

★★ మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 

👉 ఈ కారణంగా వర్చువల్  ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
 *Dept.Of PRO TTD* 

10, నవంబర్ 2021, బుధవారం

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే

IRCTC Shri Ramayana Yatra | ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర టూరిస్ట్ రైలు భద్రాచలం రోడ్ స్టేషన్‌లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. భద్రాచలం సందర్శించిన తర్వాత ఢిల్లీకి రైలు బయల్దేరుతుంది.

Gemini Internet

తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్‌లో వెల్లడించింది.


ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం రామేశ్వరం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి వెళ్లేదారిలో భద్రాచలం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. భద్రాచలం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రామాణయానికి సంబంధించిన ప్రాంతాలను యాత్రికులు సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరుతుంది.

 

Recent

Uncertainty Over Results: Delays in Group Exams and TET Concerns Among Teachers తేలని ఫలితాలు: గ్రూప్ పరీక్షల జాప్యం మరియు టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన

TET ISSUE సైన్స్/మ్యాథ్స్ టీచర్లు టెట్ (TET) లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి? ...