18, జనవరి 2022, మంగళవారం

RBI Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్‌బీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని స్వీకరించరు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

RBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు14విద్యార్హతలువయస్సు
లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ2గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 32 ఏళ్లు
మేనేజర్ (టెక్నికల్-సివిల్)6సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 35 ఏళ్లు
మేనేజర్ (టెక్నికల్-ఎలక్ట్రికల్)3ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 35 ఏళ్లు
లైబ్రరీ ప్రొఫెషనల్స్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) ఇన్ గ్రేడ్ ఏ1బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌తో పాటు మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పాస్ కావాలి.21 నుంచి 30 ఏళ్లు
ఆర్కిటెక్ట్ ఇన్ గ్రేడ్ ఏ1ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి.21 నుంచి 30 ఏళ్లు

Gemini Internet

దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 15

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలు

పరీక్ష తేదీ- 2022 మార్చి 6

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.100 ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం- ఇంటర్వ్యూ

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

RBI Recruitment 2022: అప్లై చేయండి ఇలా...

Step 1- అభ్యర్థులు ఆర్‌బీఐ కెరీర్స్ వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in/ ఓపెన్ చేయాలి.

Step 2- Current Vacancies సెక్షన్‌లో లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.

Step 3- నియమనిబంధనలన్నీ చదివిన తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Step 5- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 6- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

Step 7- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

Step 8- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 9- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 10- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

Step 11- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 12- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

 

NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్య వెల్లడించలేదు. హైదరాబాద్‌తోపాటు గువాహతిలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది గడువు ఉన్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉన్నాయి. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

NIRDPR Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...

 పోస్టు పేరు విద్యార్హతలు వయస్సు అనుభవంవేతనం
 డేటా అనలిస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 40 ఏళ్లు 2 నుంచి 5 ఏళ్లు నెలకు రూ.40,000
 ఆఫీస్ అసిస్టెంట్ పదో తరగతి 40 ఏళ్లు 5 ఏళ్లు నెలకు రూ.16,000
 వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కో-ఆర్డినేటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50 ఏళ్లు 5 నుంచి 8 ఏళ్లు నెలకు రూ.90,000
 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 40 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.30,000
 ఫైనాన్స్ అసోసియేట్ డిగ్రీ 40 ఏళ్లు 3 ఏళ్లు నెలకు రూ.30,000
 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదో తరగతి 30 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.12,000
 రీసెర్చ్ అసోసియేట్ డాక్టోరల్ 40 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.40,000
 ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 45 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.30,000
 రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 30 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.22,000
 మేనేజర్ (టెక్నికల్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ 35 ఏళ్లు 3 ఏళ్లు నెలకు రూ.50,000
 ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 35 ఏళ్లు 2 ఏళ్లు నెలకు రూ.45,000

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 26 సాయంత్రం 6.30 గంటలు

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఎంపిక ప్రక్రియ- ఇంటర్వ్యూ

కాంట్రాక్ట్ గడువు- 2022 ఫిబ్రవరి నుంచి 2023 మార్చి వరకు

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

16, జనవరి 2022, ఆదివారం

TTD Update 🕉 *జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం* 🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*

🕉 *జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం*
🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుమల:
కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 16వ తేదీ ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంలో పార్వేటు ఉత్సవం నిర్వహించనున్నారు.

◆ శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్స‌వాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు.

👉కనీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

కోవిడ్ కేసులు ఇంకా ప్రబలంగా ఉన్నందున, ఈ సంవత్సరం కూడా గ‌త ఏడాది నిర్వ‌హించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*

అదేవిధంగా జనవరి 17న తిరుమలలో నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌రు.
 *Dept.Of PRO TTD*

Gemini Internet

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోండి Know about APPSC Preparation

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్‌లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • రెండు శాఖల్లో కలిపి 730 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • రూ.16,400–రూ.48,870 శ్రేణిలో ప్రారంభ వేతనం
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక
  • దరఖాస్తుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశం
  • సిలబస్‌పై సంపూర్ణ అవగాహనతో విజయం సాధించొచ్చు

ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

రెండు శాఖలు, 730 పోస్ట్‌లు

  • ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అవి..
  • ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు–670.
  • దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3–పోస్టులు– 60.
  • అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది.

రాత పరీక్షలో మెరిట్‌

ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్‌ మాత్రం జూనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్ట్‌లకు,ఎండోమెంట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్‌ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం ఉంది.

దరఖాస్తుల సంఖ్య ఆధారంగా

  • ఒక్కో పోస్ట్‌కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 
  • ఒక్కో పోస్ట్‌కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్‌ పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌లు ఇలా

  • రెవెన్యూ శాఖలోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్ష విధానాలు..
  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు జరగనుంది.
    విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం
    జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 100 100 100ని
    బి జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 50 50 50ని

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 స్క్రీనింగ్‌ టెస్ట్‌:

  • ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు..
    విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం
    జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 50 50 50 ని
    బి హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 100 100 100 ని
  • రెండు పోస్ట్‌లకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష పూర్తిగా పెన్‌ పేపర్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు నింపాలి.
  • నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. 
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు నిర్వహించే పార్ట్‌–బి పేపర్‌లో.. జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు.

మెయిన్‌ పరీక్ష

స్క్రీనింగ్‌ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్‌ బేస్డ్‌(ఆన్‌లైన్‌) టెస్ట్‌గా ఉంటుంది.

  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ మెయిన్‌: ఈ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు..
    పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
    పేపర్‌–1 జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 150
    పేపర్‌–2 జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 150 150
  • పేపర్‌–2లో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 75 ప్రశ్నలు, జనరల్‌ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
  • ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఎండోమెంట్‌ సబ్‌ సర్వీస్‌) మెయిన్‌: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు..
    పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
    పేపర్‌–1 జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 150
    పేపర్‌–2 హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 150 150
  • ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది.
  • ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఏపీ ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీస్‌)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 60
  • వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
  • వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2022
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌(రెవెన్యూ శాఖ) (గ్రూప్‌–4 సర్వీసెస్‌)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 670
  • ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870.
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. 
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా

  • రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మెయిన్‌ పరీక్షలోనూ పేర్కొన్నారు. 
  • స్క్రీనింగ్, మెయిన్‌లకు ఒకే సిలబస్‌ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది. 
  • కాబట్టి మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్‌ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించి మెయిన్‌కు అర్హత పొందొచ్చు.
  • అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ముందే ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్‌ పరీక్షల సిలబస్‌ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి.
  • భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకొని.. వాటి ప్రిపరేషన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. 
  • దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు స్క్రీనింగ్, మెయిన్‌లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి. 
  • పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విధులు, ఎండోమెంట్‌ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి.
  • జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఆర్థికాభివృద్ధి ,ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.
  • మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి.
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ తెలుగు పేపర్‌ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్‌ గ్రామర్‌ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి.

ఒకే సమయంలో రెండు పోస్ట్‌లకు

ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌ ఉంది. ఈ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగిస్తూ.. రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్‌ పరిశీలన నుంచి ప్రిపరేషన్‌ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Gemini Internet

Vivo Scholarship: విద్యార్థులకు వివో శుభవార్త.. స్కాలర్‌షిప్‌తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్.

కరోనా (Corona) నేపథ్యంలో పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ (Scholarship)లు అందిస్తూ వారి పై చదువులకు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు వివో (Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 11 క్లాస్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ విద్యాసారథి (Vidyasarathi) సంస్థతో కలిసి ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు వారి కలలను, ఉన్నత లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు వారి ఆన్లైన్ విద్యకు సహకరించేందుకు వివో స్మార్ట్ ఫోన్ ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది.

స్కాలర్ షిప్ అర్హతలు:

అభ్యర్థులు 80 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అయితే 4 లక్షల వార్షికాదాయం కన్నా తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివో తెలిపింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Click here for official tweet

Image

Gemini Internet

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్ బుక్ కాపీ, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ సర్టిఫికేట్, ఈ విద్యాసంవత్సరం ఫీజు రసీదు. బోనఫైడ్ సర్టిఫికేట్ .jpeg, .png కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు vidyasaarathi@nsdl.co.in మెయిల్ చిరునామాను సంప్రదించవచ్చు. 022-40904484 నంబర్ ను సైతం సంప్రదించవచ్చు.

Visit Gemini Internet, Hindupur for Scholarships

-విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

-స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్కాలర్ షిప్ వివరాలు: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి రూ.1500తో పాటు, నూతన వివో స్మార్ట్ ఫోన్ కూడా అందిస్తారు.

 

15, జనవరి 2022, శనివారం

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి.

PF Transfer: మీరు తక్కువ సమయంలో రెండు, మూడు ఉద్యోగాలు మారారా.. మీ పీఎఫ్ అకౌంట్స్‌ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయా..? సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు అందరికి ఈ భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది ఉండదు. అన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు EPFO ​​వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా UAN ప్రారంభించినప్పటి నుంచి PF బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసే ప్రక్రియ సులభమైంది. UANతో, డబ్బు వేర్వేరు ఖాతాలలో ఉన్నప్పటికీ, ఉద్యోగి అన్ని ఖాతాలు ఒకే చోట ఉంటాయి. కాబట్టి, మీరు మీ UANని మీ ప్రస్తుత యజమానులకి షేర్ చేయడం ద్వారా నిధులన్ని ఒక్కచోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, EPFO ​​2020లో కోవిడ్-19 మహమ్మారి మధ్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ PF బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి ఆరు సులభమైన దశలను సూచించింది.

1. ఉద్యోగి EPFO ​​https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ యూనిఫైడ్ పోర్టల్‌కి వారి UAN నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ కావాలి.

2. మీరు లాగిన్ అయినప్పుడు ఆన్‌లైన్ సేవల కింద అందుబాటులో ఉండే ‘సభ్యుడు – EPF ఖాతా (బదిలీ అభ్యర్థన)’పై క్లిక్ చేయాలి.

3.మీరు ప్రస్తుతం ఉద్యోగం కోసం వ్యక్తిగత సమాచారాన్నిధృవీకరించాలి.

4. మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మీరు దిగువన ఉన్న ‘వివరాలను పొందండి’పై క్లిక్ చేయాలి.

5. DSC లభ్యత ఆధారంగా క్లెయిమ్ ఫారమ్‌ను ధృవీకరించడం కోసం, మీరు మీ మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోవడానికి ఎంపికలను పొందుతారు. మీరు యజమానులలో ఎవరినైనా ఎంచుకోవచ్చు.

6. మీరు UAN నమోదిత మొబైల్ నంబర్‌కు ‘OTP పొందండి’ దానిని నమోదు చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయాలి.

7. పైన పేర్కొన్న ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత యజమాని ఏకీకృత పోర్టల్, యజమాని ఇంటర్‌ఫేస్‌ను యాక్సెస్ చేయడం ద్వారా మీ EPF బదిలీ అభ్యర్థనను డిజిటల్‌గా ఆమోదిస్తారు. మీరు ఫారమ్ 13ని నింపాల్సి ఉంటుంది. PDF ఫార్మాట్‌లో ఉండే బదిలీ క్లెయిమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా పని సలువుగా చేసుకోవచ్చు.

Gemini Internet

Epfo : ఈఫీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్ న్యూస్

Epfo : కేంద్రం ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ వో సభ్యులు తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ వో సంస్థ అధికారికంగా తెలిపింది.ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్.. తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీని ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఈపీఎఫ్‌వో కల్పించింది. ఖాతాదారులు ఈ ఫెసిలిటీతో లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

అయితే, డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే వారు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే క్రమంలో వారు కంపల్సరీగా ఈ నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ అనగా వైద్య సదుపాయాల కోసమే ఈ మనీని విత్ డ్రా చేసుకుంటున్న క్రమంలోనే వ్యక్తి తప్పనిసరిగా సదరు వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రి లేదా సీజీహెచ్‌ఎస్‌ ప్యానెల్ హాస్పిటల్‌లోనే చేరాలి. ఒకవేళ ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే కనుక చేరే ముందనే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Gemini Internet

Epfo : ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే..

ఇందుకుగాను ముందు రోజు పీఎఫ్ ఆఫీస్ లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లికేషన్ చేసుకున్న మరుసటి రోజే మనీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. నెక్స్ట్ డే మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది తప్ప అదే రోజు అయితే ట్రాన్స్ ఫర్ కాదు. ఈ అమౌంట్ సదరు వ్యక్తి పర్సనల్ అకౌంట్ లేదంటే ఆస్పత్రి బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే, ఈ పనులను మీరు ఈపీఎఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. వెబ్ పోర్టల్ లో ఆన్ లైన్ సేవల ఆధారంగా మీరు ఈ పని చేయొచ్చు. అలా మీరు మీ పీఎఫ్ మనీని క్లెయిమ్ చేసుకోవచ్చు.