13, జూన్ 2022, సోమవారం

SSSHSS XI ప్రవేశ పరీక్ష గురించి తెలుసుకోండి 2022 Update

సాయిరామ్ విద్యార్థులు, ప్రవేశానికి ప్రత్యేక హాల్ టికెట్ లేదు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉన్నందున పరీక్షకు అర్హత సాధించడానికి “లాగిన్ ఆధారాలు” (యూజర్ ఐడి & పాస్‌వర్డ్) సరిపోతాయి.  హాల్ టికెట్  లాంటిది ప్రత్యేకించి ఏమి ఉండదు గమనించగలరు.

ఆన్‌లైన్ పరీక్ష సమయాలు

మాక్ టెస్ట్: 16 & 17 తేదీల్లో
ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు మీరు ఎప్పుడైనా లాగిన్ చేయవచ్చు మరియు మీ రెండు ప్రయత్నాలను ఉపయోగించవచ్చు.

ప్రధాన పరీక్ష:
జూన్ 19న విద్యార్థులు 8:45 నుండి లాగిన్ ప్రారంభించవచ్చు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.

గమనిక: రోజులో ఎప్పుడైనా మాక్ టెస్ట్ మాత్రమే ప్రయత్నించవచ్చు. కానీ మెయిన్ పరీక్ష అందరికీ ఉదయం 9:00 గంటలకు వెంటనే ప్రారంభమవుతుంది.

సాయిరాం

Gemini Internet

నిరుద్యోగ యువతులకు ఉచిత నైపుణ్య శిక్షణ | అనంతరం 25లకు పైగా జీతంతో ఉద్యోగ అవకాశాలు మరింత సమాచారం కోసం ఈ లింక ను క్లిక్ చేయండి


 

Gemini Internet

BSFలో 110 ఉద్యోగాలు| UPSCలో 24 ఉద్యోగాలు | AUEET లో ప్రవేశాలు 2022


 

Gemini Internet

10వ తరగతి పాసయిన విద్యార్థులకు ఇంజెక్షన్ మౌల్డింగ్ లో సీపెట్ ఉచిత శిక్షణ | అనంతరం అనంతపురంను కూడా కలుపుతూ పలు చోట్ల ఉద్యోగావకాశాలు వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి


 

Gemini Internet

గురుకుల విద్యాలయాల్లో 6 7 8 తరగతులలో ప్రవేశాలు | ఈ నెల 15 నుంచి 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలి వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి




Gemini Internet

BEd @ IIT : ఐఐటీల్లో బీఈడీ కోర్సు .. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ అనుమతి .. ! కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్*

భువనేశ్వర్ : దేశంలో ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు . ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన .. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ ) ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు . ఇందుకోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ( ITEP ) త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు .

రాష్ట్రాలు , దేశంలో చాలా బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు . మనం ఆశించిన ఉపాధ్యాయులను తీర్చుదిద్దుకోలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది . ఒకవేళ మంచి ఉపాధ్యాయులు లేకపోతే .. నాణ్యమైన విద్యను ఆశించలేం . దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న తరం ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు . అందుకే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్న ( ITEP ) పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం ' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు

భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ' ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్'ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు . దేశవ్యాప్తంగా మొత్తం 15 వేల పీఎం శ్రీ స్కూల్స్ను ప్రారంభిస్తామని .. కేవలం ఒడిశాలోనే 500 నుంచి 600 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు . అయితే , అన్నీ కొత్త పాఠశాలలే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రీయ పాఠశాలలను వీటి పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు . ఇక నాలుగేళ్ల బీఈడీ కోర్సును అందించేందుకుగాను ఐఐటీ భువనేశ్వర్తోపాటు పలు ఐఐటీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచరం . కేంద్ర విద్యాశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కోర్సును ప్రారంభిస్తాయి . ఈ ఏడాది నుంచే ఐఐటీ భువనేశ్వర్ నాలుగేళ్ల బీఈడీని మొదలు పెట్టేందు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది .

Gemini Internet

 

 

12, జూన్ 2022, ఆదివారం

Updates 12-06-2022

RDT CET అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుండి 2262 అప్లికేషన్లు అందాయి. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, ఈ నెల 19వ తేదీన ఎంపిక చేయబడిన కేంద్రాలలో పరీక్షలు.  10వ తరగతిలో మాథ్య్స్ సైన్స్ మార్కులతో పాటు RDT CET లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికలు, ఎంపికయిన విద్యార్థుల ఉచిత విద్యను అందిస్తారు. ఈ నెల 19వ తేదీన హిందూపురంలో NSPR మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష ఉంటుంది.  సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

ఈ నెల 13 వరకు పాస్టర్ల గౌరవ వేతనానికి దరఖాస్తులు గడువు పొడిగింపు. సవరించిన నిబంధనల ప్రకారం చర్చి సొసైటీ/ట్రస్ట్ యాక్ట్ కింద నమోదై, స్థలం చర్చి పేరిట ఉన్నట్టు తహశిల్దారు జారీ చేసిన ధృవపత్రం ఉండాలి. సొసైటీ లేదా ట్రస్ట్ పేరున ఉంతే దాతలు ఇచ్చిన స్థలానికి గిఫ్ట్ డీడ్ కాని రిజిస్టరు డీడ్ ఉండాలి. అద్దె భవనంలో నడుపుతున్న చరికి సొసైటీ ట్రస్ట్ పేరు మీద రెంటల్ లీజ్ అగ్రిమెంట్, నోటరైజ్డ్ అగ్రిమెంట్ తప్పనిసరి.అర్హులు EBC నేస్తం పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. వివరాలకు అనంతపురం జిల్లా మైనారిటీ కార్యాలయం లేదా 📞 9160776077 నెంబరులో సంప్రదించవచ్చు. సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

నేడు SSBN Degree College లో మెగా జాబ్ మేళా. 10, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బి టెక్, బి ఫార్మసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంట్వర్యూలు నిర్వహిస్తారు. సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

రేపు అనంతపురంలో Govt ITI లో అప్రెంటిస్ మేళా. ITI పాసయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

రాయదుర్గంలోని బాలికల పాఠశాలలో ఈ రోజు ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 2.00 వరకు శాంతిరామ్ కంటి ఆస్పత్రి వైద్య నిపుణులతో ప్రత్యేక శిబిరం. నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు జరిపి ఇంటికి చేర్చే వరకు దగ్గరుండి పర్యవేక్షిస్తారు. సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

10 పాసయిన విద్యార్థులు ITIలో చేరడానికి ఈ నెల 13 నుండి 30లోపు దరఖాస్తులు చేసుకోండి. అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా సంవత్సరానికి 2 లక్షల లోపు ఆదాయం ఉండి 10వ తరగతిలో 90 శాతం పైన మార్కులు వచ్చిన పేద విద్యార్థులకు విద్యాదాన్ ఉపకార వేతనాలు (Scholarships). ఇంటర్ చదివే వారికి సంవత్సరానికి 10 వేలు, ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా సంవత్సరానికి 60 వేల వరకు Scholarships  vidyadhan.org. Scholarshipల అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 జులై 10లోపు దరఖాస్తులు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 📞 8367751309 లేదా vidyadhan.andhra@sdfoundationindia.com ద్వారా సంప్రదించవచ్చు.

చిలమత్తూరులో భోజనంతో కూడిన ఉచిత శిక్షణా తరగతులు. కంప్యూటర్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, బిపీవోస్కిల్స్ లో 90 రోజుల పాటు బాల బాలికలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 📞 6364867797 నెంబరులో సంప్రదించండి. సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

 

Gemini Internet