26, సెప్టెంబర్ 2022, సోమవారం

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం:

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరాన్ని సోమవారం తితిదే
కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు హిందూపురం

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు
హిందూపురం గ్రామీణం: 10వ తరగతి
ఉత్తీర్ణులైన విద్యార్థులు లేపాక్షిలోని కంచిన
ముద్రం రోడ్డులోని హిందూపురం ప్రభుత్వ
పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మూడో
విడత ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బదిరీనాథ్ తెలిపారు.

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం ఉరవకొండ, న్యూస్టుడే: ఎనిమిదో
తరగతి ఉత్తీర్ణులై పది
ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఐటీఐలో డ్రెస్ మేకింగ్ ట్రేడ్ ప్రవేశం కల్పించనున్నట్లు ఉరవకొండ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు ఆదివారం పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 27 లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ధ్రువపత్రాలను ఐటీఐ కళాశాలలో 28లోపు పరిశీలన చేయించుకోవాలన్నారు.
29న ఉదయం ఉరవకొండ గాంధీబజారులో ఉన్న ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.

29 నుంచి బైక్ మెకానిజంలో

29 నుంచి బైక్ మెకానిజంలో శిక్షణ
కళ్యాణదుర్గం, న్యూస్టుడే: ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ద్విచక్రవాహన మెకానిజం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 29నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్లులోపు, ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకుచదువుకుని ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. 45 రోజులపాటు కొనసాగుతుందని, శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.
1,500, ఎస్సీ, ఎస్టీలు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులు ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్


ఇంటర్న్
మొబైల్ యాప్ డెవలప్మెంట్
సంస్థ: డిక్రిప్షన్ స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఆండ్రాయిడ్, పైర్బేస్, ఫట్టర్, ఐఓఎస్, మైఎస్
క్యూఎల్, పీహెచ్పీ నైపుణ్యాలు
internshala.com/i/2d6d40


సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ప్రైమైట్ మార్కెటింగ్ స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యం
internshala.com/i/82aa25


వెండర్ మేనేజ్మెంట్
సంస్థ: వర్డ్స్ లీడ్స్ (ఓపీసీ) స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/7812c8


ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
సంస్థ: ఎర్రర్ టెక్నాలజీస్ స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఆఫీస్
నైపుణ్యాలు
internshala.com/i/9ff4b6

రేపు వాహనాల వేలంధర్మవరం రూరల్:

 సెబ్ స్టేషన్ పరిధిలో వివిధ
నేరాల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 27న ఉదయం 10 గంటలకు సెబ్ స్టేషన్లో వేలం వేయనున్నట్లు సెబ్ ఇన్స్పెక్టర్ సైదులు
ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీజ్
చేయబడిన వాహనాలకు నిర్ణయించిన
అప్సెట్ ధరలో 10 శాతం ధరావత్తు
రుసుము చెల్లించి వేలంలో పాల్గొనాలని
సూచిచంఆరు. వేలంలో వాహనాలను దక్కిం
చుకున్న వారు జీఎన్డీ చెల్లించాల్సి ఉంటుం
దని తెలిపారు. పూర్తి వివరాలకు ధర్మవరం
సెబ్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

అనంతపురం సెంట్రల్: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికిసంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడుదల చేశారు.

'సూపర్వైజర్' అభ్యర్థుల
మెరిట్ జాబితా విడుదల
అనంతపురం సెంట్రల్: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికిసంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. రీజనల్ పరిధిలో 216 పోస్టులు ఉండగా.. అనంతపురం జిల్లా నుంచి 594మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 592మంది పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు కాంట్రాక్టు సూపర్వైజర్లు ఉన్నారు. వారం క్రితంఅభ్యర్థులు పరీక్షలు రాశారు. మెరిట్ అభ్యర్థుల జాబితాను ఆయా ప్రాజెక్టు కార్యాలయాల సీడీ పీఓలకు పంపారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఇంగ్లిష్ లో మాట్లాడే ఐదు నిమిషాల నిడివిగల వీడియోను అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం కనబరచిన వారికి ఐదు మార్కులు కలపనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ఎంపిక తుది జాబితా విడుదల చేస్తారు.