29 నుంచి బైక్ మెకానిజంలో
29 నుంచి బైక్ మెకానిజంలో శిక్షణ
కళ్యాణదుర్గం, న్యూస్టుడే: ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ద్విచక్రవాహన మెకానిజం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 29నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్లులోపు, ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకుచదువుకుని ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. 45 రోజులపాటు కొనసాగుతుందని, శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.
1,500, ఎస్సీ, ఎస్టీలు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులు ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు.
కామెంట్‌లు